Monday, August 1, 2011

63 ఓ బుల్లి కథ 51---- మన శరీరంలోని న్యురల్ నెట్వర్క్స్

ముందుమాట:  మన శరీరంలోని న్యురల్ నెట్వర్క్స్ చేసే పనల్లా సమాచారాన్ని ఒక చోటు నుండి ఇంకొక చోటుకి చేర్చటం. మన మనుగడ అంతా ఈ సమాచార సేకరణ, దానిని సరియిన చోటికి సరయిన సమయంలో పంపిణీ మీదే ఆధారపడి ఉంటుంది. ఏవిధంగా ఆ పని జరుగుతుందే చూచాయగా చూపటమే ఈ పోస్ట్ ఉద్దేశం.

మన శరీరంలో పనిచేసే న్యురల్ నెట్వర్క్స్ పనితనానికి నిదర్శనాలు చూడండి :

1. స్టవ్ మీద చిన్న సెగతో నెయ్యి కాగుతోంది. పొరపాటున చెయ్యి గిన్నెకు తగిలింది. గబుక్కున చెయ్యి తీసేస్తాము.
2. డాక్టర్ ఆఫీసు కి వెళ్ళాము. టెస్టుల్లో మోకాలు మీద రబ్బరు సుత్తి తో కొట్టారు. వెంటనే కాలు జెర్క్ ఇస్తుంది.

 పై రెండు ఉదంతాలలో  జరిగింది ఒకటే. Reflexive response.చర్మము నుండి వచ్చిన sensory signal, spinal cord దగ్గరకు రాగానే దాని తీవ్రతను తెలుసుకొని spinal cord కండరాలకి ఆదేశాలు ఇచ్చి వెంటనే బ్రెయిన్ కి కూడా తెలియపరుస్తుంది. రెండవ దాన్ని knee jerk reaction అంటారు.

3. నిరంతరమూ  (continuous) జరిగే పనులను బ్రెయిన్ ఉపేక్ష చేస్తుంది. ఉదా: మనము సముద్రపు ఒడ్డున నివసిస్తున్నామనుకోండి. మొదటే రెండురోజులూ సముద్రపు హోరు వినిపిస్తుంది. తరువాత అది మామూలే అని బ్రెయిన్ మనకి వినిపించ నివ్వదు.

4. మనం నడుస్తూ ఉంటాము. కాలులో ముల్లు గుచ్చు కుంటుంది. ముల్లు ఇంకా లోపలికి దిగకుండా వెంటనే కాలు ఎత్తుతాము. తరువాత చేత్తో ముల్లు తీసి వేస్తాము. మొదటి రియాక్షన్ spinal cord నుండి వచ్చింది. రెండోవ రియాక్షన్ బ్రెయిన్ నుండి వచ్చింది. ఏళ్ళనాడు అమ్మ చేసిన పని బుర్రలో గుర్తుకొచ్చి ముల్లు తీసేశాము.

5. ఏదో మూవీ చూస్తూ ఉంటాము. ఆ యాక్టర్ ని ఎక్కడో చూసినట్టు ఉంది. నోట్లో మెదులుతోంది కానీ బయటకి రావటల్లేదు. ఆ ఇమేజ్ పట్టుకుని మన బ్రెయిన్ వెతుకుతోంది. ఆహా తెలిసింది.  స్టీవర్ట్  షో లో ఉండేవాడు కదూ.

6. పెళ్ళిలో అమాంతంగా ఎవరో "ఏమండీ సుబ్బారావు గారూ" అని పలకరిస్తారు. మనిషి గుర్తు రావటల్లేదు. మాట తీరు విన్నట్టుగా ఉంది. గుర్తు పట్టలేక పోతున్నాము. ఆహా తెలిసింది "ముకుందరావు కదూ" "ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ". మాట తీరుని, మనిషి  ఇమేజ్ ని కలిపి వెతికి మన బ్రెయిన్, "ముకుందరావు" పేరు పట్టుకుంది.

మన శరీరంలో బ్రెయిన్, spinal cord కలిసి పనిచేసే సమాచార వ్యవస్థని Central Nervous System (CNS) అంటారు. బ్రెయిన్ ఒక ముఖ్య సమాచార కేంద్రం. మన శరీరంలో ఏమూల ఏమి జరుగుతున్నదో,  బ్రెయిన్కి ఎల్లప్పుడూ సమాచారం అందుతూ ఉంటుంది.శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఏపని ఎప్పుడు చేయాలో అప్పుడు సంకేతాలు పంపిస్తుంది. పంచేంద్రియాల నుండీ వచ్చిన, ముఖ్యమని అనిపించిన సమాచారాన్ని దాచటం, కావాల్సి వచ్చినప్పుడు బయటికి తీసుకువచ్చి వాడుకోవటం కూడా దీని పనే. జీవికి అపకారం జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే దాని నుండి తప్పించటం కూడా దీని పనే. అందుకు spinal cord సహాయం తీసుకుంటుంది. అందుకనే వేడి గిన్నె తగలగానే చెయ్యి తీసేసాము. 

CNS లో లేని సమాచార వ్యవస్థని Peripheral Nervous System (PNS)  అంటారు. దీనిలో చాలా భాగాలున్నాయి. 
Enteric Nervous System(ENS) మన జీర్ణ వ్యవస్థని(gastrointestinal system) కంట్రోల్ చేస్తుంది.
Autonomous Nervous System (ANS) మన ప్రమేయము లేకుండా పనిచేసే భాగాల్ని కంట్రోల్ చేస్తుంది(ఉదా: గుండె, కాలేయము మొదలయినవి). అల్లాగే Sympathetic Nervous System : మనకి బయటి నుండి వచ్చే stress లను, భయాలు బాధలను, Parasympathetic Nervous System తో కలసి తగ్గించాలని చూస్తుంది. Parasympathetic Nervous System మనం ఎప్పుడూ  ప్రశాంతంగా హాయిగా ఉండాలని చూస్తుంది. 

CNS, PNS, ANS వీటిని న్యురల్ నెట్వర్క్స్ అంటారు. వీటిలో ఉండేవి న్యురోన్స్, glial cells. ఇవి ఒకదానికి ఒకటి గోలుసుకట్టుగా ఏర్పడి synaptic connections తోటి సమాచారాన్ని ఒకచోటు నుండి ఒకచోటుకు చేరవేస్తాయి. మన కండరాల కదలికలను కంట్రోల్ చేసే న్యురోన్స్ ని Motor Neurons అంటారు. ఇవి తెచ్చే సందేశాల మూలంగా చేతులూ కాళ్ళు వగైరా కదప కలుగుతాము. అల్లాగే Sensory Neurons, sensory receptors నుండి సమాచారం Nervous System కి పంపుతాయి. అందుకనే మన వంటిమీద ఏదన్నా పాకుతుంటే వెంటనే తెలిసిపోతుంది. ఈ రెండూ అవి పనిచేసే వాటి దగ్గరలో ఉంటాయి. (ఉదా: Sensory Neurons & Receptors , స్కిన్ దగ్గర, Motor Neurons, కండరాలు దగ్గర ఉంటాయి)

మళ్ళా Motor neurons రెండు రకాలు. Somatic and Autonomic. Somatic Neurons మన కంట్రోల్ లో ఉండే కండరాల్ని, Autonomic Neurons మన కంట్రోల్ లో లేని కండరాల్ని కంట్రోల్ చేస్తాయి ( హార్ట్ కండరాలు మొదలయిన involuntary శరీర భాగాలు).

Biological Neural Networks లో ఉండేవల్లా రకరకాల న్యురాన్స్. ఇవి చేసే పనల్లా శరీరంలో సమాచారాన్ని ఒకచోటు నుండి ఇంకొక చోటుకు చేరవేసి జీవత్వం కొనసాగేటట్లు చూడటం.

చివరిమాట: ప్రకృతి మనం జీవించాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మనము చెయ్యాల్సిందల్లా దానికి కావాల్సింది ఇవ్వటమే. వయసు పెరిగినకొద్దీ కావలసిన మూలపదార్ధాలలో కొరత ఏర్పడుతుంది. అది గ్రహించి వాటిని ఇవ్వటానికి ప్రయత్నించాలి. అంతేకానీ ఇవ్వకూడనివి ఇవ్వటానికి ప్రయత్నించ కూడదు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ క్రింద రెఫరెన్సు లతో మొదలు పెట్టండి. 

1. Nervous_system  http://en.wikipedia.org/wiki/Nervous_system

2. Cell Basics  http://cellbiology333.blogspot.com/

8 comments:

  1. బావుందండి ! బాగా రాసారు !

    ReplyDelete
  2. మీరు బ్రెయిన్ గురించి ఎన్నో విషయములు చెబుతున్నారు. అవన్నీ తెలుసుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందండి.
    అసలు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం వాటికవే ఎలా పనిచేస్తున్నాయో అనిపిస్తుంది. నిద్రలో కూడా శ్వాస ఆడటం, గుండె మరియు ,బ్రెయిన్ పనిచేయటం , తిన్న ఆహారం జీర్ణం అయ్యే పద్ధతి ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి కదా !. ఇది చాలు ఒక మహాశక్తి ఈ సృష్టినంతా నడిపిస్తోందని తెలుసుకోవటానికి.....

    ReplyDelete
  3. @Sravya Vattikuti గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. @anrd గారూ

    బ్రెయిన్ గురించి తెలుసుకుంటూ ఉంటే చిత్రం వేస్తుంది కదూ. ఓక విధంగా సృష్టిని సందర్సిస్తున్నాము. ఆ అందాల్ని చూస్తూ ఆనందించటమే. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  5. @మాధవరావు గారూ
    మీరు అన్నట్లు మూడింటికీ సమాధానాలు ప్రకృతి ప్రకృతి ప్రకృతి. దాన్ని మనము ఎదురించలేము. నాకు తెలిసినవి/చదివినవి కొన్ని వ్రాస్తాను. పురుషుల్లోనూ స్త్రీలలోనూ ఆడ హార్మోనులు (estrogens) మగ హార్మోనులు (androgens) ఉంటాయి. వాటి నిష్పత్తి బట్టే మగ ఆడ లక్షణాలు వస్తాయి. ఇంకో సంచలన వార్త చదివాను మగ హార్మోనులు ఆడ హార్మోనులనుండి తయారు అవుతాయి. ఎక్కడ చదివానో గుర్తు రావటల్లేదు. చాలా మంది పరిశోధనలు చేస్తున్నారు, రోజు రోజుకీ కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయి. Human Genome Project 2003 లో పూర్తి అయ్యింది. DNA నంతా sequence చేశారు. DNA లో ఉండేవి హార్మోనులు ఎల్లా తయారు చెయ్యాలో రెసిపీలు. switch on switch off mechanishs ద్వారా వాటి తయారు కంట్రోల్ అవుతుంది. ఉదా: బ్రెయిన్ ఉపయోగించే హార్మోనులు బ్రెయిన్ లో మాత్రమే తయారు అవుతాయి. వాటి తయారుకు పురి కొల్పే శక్తి (swithes) బ్రెయిన్ లోనే ఉంటాయి. నా ఉద్దేశంలో బయలోజికాల్ టైం కి ఈ Switches కి సంబంధం ఉంది. వ్రుద్ధత్వానికి కారణం అదే అనుకుంటాను.

    దేవి భాగవతంలోని చిన్న కధ చాలా బాగుంది. నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది మన పూర్వుల ఆలోచనా శక్తికి.

    రాను రాను ఇంకా బ్రెయిన్ గురించి ముఖ్యమయిన సంగతులు తెలుసుకొందాము. మన శరీరం మొత్తం కంట్రోల్ చేసేదదే కాబట్టి తెలుసుకుంటే మంచిది.

    మీ వ్యాఖ్యకు ధన్య వాదాలు.

    ReplyDelete
  6. నమస్కారములు. రావు గారూ !
    సుమారు నెల రోజుల తర్వాత నెట్ ముందు కూర్చుంటే ముందుగా ఆకట్టుకున్నది మీ " బుల్లి కధ లొ , పెద్ద సమాచారం. " బ్రెయిన్ గురించి చక్కగా వివరించారు. [ చిన్న నాడు సరిగా చదివీ చదవని చదువును మరల మననం చేసు కుంటున్నాం. .మీ పుణ్యమా అని ] ఇంకా ఇంకా ఇటువంటి ఉపయుక్త మైన సైన్స్ ని ఆందించ మని కోరుతూ ...మీ అభిమాని
    [ మొన్న గురువారం ఇండియా నుంచి వచ్చాము ]

    ReplyDelete
  7. మీ ఇండియా ట్రిప్ బాగా అయిన్దనుకుంటాను. వెల్కమ్
    బాక్. మీకోసం ఆగాను. వచ్చే నెల నుండీ మళ్ళా న్యురాన్స్ మీద. మద మాత్సర్యాలు ఎల్లా కలుగుతాయి వాటిమీద మాట్లాడుకుందాము. న్యురల్ నెట్వర్క్స్ పోస్ట్ మీకు నచ్చినందుకు థాంక్స్. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  8. నమస్కారములు.
    మా ఇండియా ట్రిప్ బాగా జరిగింది. ఒకసారి ఐన వాళ్ళందర్నీ కలిసి రావడంతో జీవితం మీద మరింత ఆసక్తి పెరిగింది. వచ్చాక మీ కధలు చదువుతుంటే ఎనలేని ఆనందం ,ఉత్సాహం కలుగుతున్నాయి. మీ రచనల్ని నాకోసం ఆపినందుకు కృతజ్ఞతలు + మరీ మరీ ధన్య వాదములు. మన అభిమానులే మన ఆరోగ్యానికి ఔషధాలు. ఔను కదా ?

    ReplyDelete