Monday, March 21, 2011

51 ఓ బుల్లి కథ 39 ---- సూర్యుని కోసం

"సూర్యుని కోసం ఒక ఆకు తపన"


లక్కరాజు శివరామకృష్ణ రావు








రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని


కళ్ళల్లో వత్తులేసి
వడగళ్ళ కి వంగిపోతూ


గాలి వానకి ఊగిపోతూ
పక్క గులాబీని తిట్టుకుంటూ


రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని


నీ కిరణాలని రంగరించి
నా పచ్చదనం కలిపేస్తే


అదేకదా ఆహారం
నా జీవిన ఆధారం


రోజంతా వేచివున్నా
నువ్వొస్తావని

**** నీలహంస సత్య గారికి కృతజ్ఞతలతో (వారి "ఆకు" గేయ పోటీతో నా భావాలని నిదురలేపి నందుకు).
వారి బ్లాగు ఇక్కడ: నీలహంస

2 comments:

  1. చాలా బాగుంది .మీ కవిత " నీ కిరణాలను రంగరించి ,నా పచ్చ ధనంతో కలిపేస్తే " ఎంత బాగుంది ఈ పదం ? ....కళ్ళల్లో వత్తు లేసి ...... వడ గ ళ్ళకి వంగి పోతూ ! నువ్వు వస్తావని " ఓహో ! ఎంత మధుర మైన మరపు రాని భావాలు ? హృదయాన్నికదిలించే ........ .

    ReplyDelete
  2. రాజేశ్వరి గారూ వ్రాసేటప్పుడు ఆ చరణం నాకూ బాగా నచ్చేసింది. థాంక్స్ ఫర్ ది కామెంట్. కెనడా వెళ్ళి వచ్చే వారం మళ్ళా చికాగో వస్తాను. తీరికగా వ్రాస్తాను. థాంక్స్ ఫర్ ది కామెంట్.

    ReplyDelete