Monday, December 7, 2015

120 ఓ బుల్లి కథ 108 --- రోజుకు ఉప్పు ఎంత వేసుకోవచ్చు

మన జీవితంలో  ఉప్పూ, తీపి లేకుండా భోజనం చేసే రోజులు చాలా తక్కువ. అవి మనం జీవించటానికి చాలా ముఖ్యం కూడాను.

 తీపిని  "షుగర్" అనే ఇంగ్లీష్ పేరుతో చెప్పగానే దాని ప్రాముఖ్యం తెలుస్తుంది. తీపి  మనం పంచదారగా తినకపోయినా, మనము తిన్న కార్బో హైడ్రేట్లు శరీరంలో  "షుగర్" గా మార్చబడి, రసాయనికంగా మనము పీల్చే "ఆక్సిజన్" తో కలపబడి మనకు శక్తి నిచ్చే పదార్ధం (ATP)  ఉత్పత్తి అవుతుంది.

అల్లాగే "సాల్ట్" (NaCl ) కూడా మనం జీవించటానికి చాలా ముఖ్యం. మన శరీరం "hydrated" గ ఉండటానికి ముఖ్య కారణం. మనం hydrate అవటానికి నీళ్ళు తాగినా, అది మన శరీర అంతర్భాగంలో కణజాలానికి అందటానికి ఇది కావాలి. చిన్న ప్రేవులలో మనము తిన్న ఆహారం జీర్ణ మవటానికి ఇది కావాలి. మన శరీరంలో నరాలు, బ్రెయిన్ పని చెయ్యటానికి ఇది చాలా ముఖ్యం. ఇంతెందుకు అలా చెప్పుకు పోతుంటే ఇంకా చాలా ఉన్నాయి.

సాల్ట్, షుగర్ లేక పోతే మనం జీవించటం చాలా కష్టం. "షుగర్" ని వ్యవసాయం ద్వారా సంపాదించ వచ్చు గానీ సముద్రం దగ్గర లో లేకపోతే "సాల్ట్" ని తయారు చెయ్యటం చాలా కష్టం . ఒకప్పుడు రోమన్ రాజులు సైనికులకి జీతంగా సాల్ట్ కొలిచి ఇచ్చే వాళ్ళుట. ఇంతెందుకు మన నెల జీతం పేరు (శాలరీ salary)  సాల్ట్ (salt) నుండే వచ్చిన దని చెప్తారు.

మనం తినే ఆహారం కొన్ని పరిమితులలోనే తీసుకుంటాము. మన బ్రెయిన్ సరీగ్గా పనిచేస్తుంటే పరిమితులు దాటుతుంటే, "పొట్ట పట్టదురా తినటం ఆపేయ్" అని చెబుతుంది. అది వినకుండా గారెలు చాలాబాగున్నాయి అని ఇంకో రెండు లాగిస్తే తరువాత వచ్చే బాధలు  అందరికీ తెలిసినవే. మరి అయితే ఈ షుగర్, సాల్ట్ లకు మనం తినటానికి పరిమితులు ఉంటాయా ?

పరిమితులు ఉండి ఉంటాయి కానీ పరిస్థుతులు మన చేతుల్లో నుండి జారిపోయే దాకా అవి తెలియవు. ఉదాహరణకి మనం రోజూ మూడు పూట్ల భోజనంతో జిలేబీలు, లడ్లు లాగిస్తున్నామనుకోండి. ఇదివరకు చెప్పినట్లు అవి షుగర్ (glucose ) గ మార్చబడి, శక్తి రూపంలో బయటకి వస్తాయి. తయారు ఐన శక్తి ని మనం ఉపయోగించటల్లేదు అని శరీరానికి అనిపిస్తే , శక్తి తయారు చెయ్యటం ఆపేసి, మనకి తిండి లేనప్పుడు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఆ గ్లూకోస్ ని fat  గ మార్చి fat cells లో దాచి పెడుతుంది. ఎప్పుడైనా ఆహారంలేక బాధ పడుతుంటే ఆ fat ని శక్తిగా మారుస్తుంది. అటువంటి అవసరం ఎప్పుడూ రాకపోతే, fat cells అన్నీ నిండిపోతే, భోజనం ఇంకా మూడు పూటలా చేస్తుంటే, గత్యంతరం లేక ఆ షుగర్ ని రక్తంలో వదిలేస్తుంది. దీనినే సూక్ష్మంగా diabetes అంటారు. రక్తంలో షుగర్ ఎక్కువగా ఉంటే శరీర అవయవాలు సరీగ్గా పని చెయ్యవు కనుక అప్పటినుండీ తగిన పరిమితుల్లో తినటం మొదలెడుతాము.

ఇక సాల్ట్ వేపు వస్తే అంత తేలికగా  చెప్పలేము. దీని మీద ఇంకా చాలా పరిశోధనలు చేస్తున్నారు. 2013 లో Brian Strom (Institute of Medicine ) అనే ఆయన తన నేత్రుత్వంతో,  అప్పటికి సాల్ట్  మీద చేసిన 34 పరిశోధనల ఫలితాలని క్రోడీకరించారు. వారు తేల్చిన ముఖ్య విషయం ఏమంటే తక్కువ సాల్ట్ తీసుకుంటే blood pressure తగ్గుతుందనేది నిజం కాదు అని.

అయితే రోజుకి సాల్ట్ ఎంత తీసుకోవాలి ? దీనిని నికార్సుగా చెప్పలేము కానీ రోజుకి 2,300 to 3000 మిల్లీ  గ్రాములు సరి అయినట్టుగా కనపడుతుంది అని తేల్చారు.  అంటే రోజు కొక  teaspoon సాల్ట్ సరిఅయినదని నిర్ధారించారు.

అయితే సాల్ట్ రకరకాల packages లో వస్తుంది, Table salt , Sea salt , Himalaya salt ఏ సాల్ట్ మంచిది ? వీటన్నిట్లోనూ మూల పదార్ధం NaCl ఒకటే.

అసలు సాల్ట్ వచ్చేది రెండు రకాలు గా వస్తుంది. సముద్రపు నీళ్ళ నుండి(sea salt)  మరియు సాల్ట్ గనుల నుండి (Utah mines ). ఈ రెండిటిలోనూ  trace minerals, micro -minerals zinc iron selenium calcium magnesium potassium ఉంటాయి. ఈ minerals మన శరీరం చక్కగా పనిచెయ్యటానికి దోహదం చేస్తాయి. Table Salt పై వాటి నుండి తయారు చేస్తారు. తయారు  చేసే విధానం (high heat high pressure bleaching additives oxidation ) మూలంగా దీనిలో ఈ minerals ఉండక పోవచ్చు. కాకపోతే table salt (కొన్ని బ్రాండ్స్ Sea salt లో కూడా ) తయారు చేసే టప్పుడు చాలా వస్తువులు (18 దాకా Glucose మొదలయినవి) దానిలో కలుపుతారు. అందులో Iodine ఒకటి. ఇది thyroid సరీగ్గా పనిచేసేటట్టు చూస్తుంది. Iodine కోసమే Table salt తినాలని కాదు, ఇది ఆహార పదార్ధాలలోనూ ఉంటుంది (eggs dairy fish seaweed).

చివరి చెప్పేదేమంటే మీకు ఏది నచ్చితే ఆ సాల్ట్ లేకపోతే రెండూ కలిపో రోజుకు కనీసం ఒక teaspoon మోతాదులోవాడటం మంచిది.

1.Salt is essential not a villain by Casey Seidenberg Washington Post

Sunday, November 8, 2015

119 ఓ బుల్లి కథ 107 --- వృద్ధాప్యం ఎందుకు వస్తుంది అంటే అన్నీ ప్రశ్నలే

మన శరీరం ఒక పెద్ద రసాయనశాల. మనలో జీవత్వం ఉన్నంతకాలం నిత్యం అనుక్షణమూ మన శరీరం లో కర్మ కాండ జరుగుతూనే ఉంటుంది.  సూక్ష్మంగా చెప్పాలంటే మనం రోజూ తీసుకునే ఆహారం రసాయనిక మార్పుడువల్ల షుగర్ గ మార్చబడి,  మనము పీల్చే గాలిలోని ఆక్సిజన్ తో కలిపి మండించటం మూలాన వచ్చే శక్తీ తో మనం జీవిస్తున్నాము. ఈ ప్రక్రియ మన శరీరం లో ఉండే ప్రతి కణం (ఎర్ర కణాలు, తెల్ల కణాలు మొదలయినవి) లోనూ జరుగుతుంది.అందుకనే మనం నడవకలుగుతున్నాం, పాడగలుగు తున్నాం, మన పనులు మనం చేసుకో గలుగు తున్నాము. 

ఇంకొంచెం ముందుకు పోతే ఈ శక్తి ఉత్పాదన ప్రక్రియ మన శరీరంలో ప్రతి కణంలో (cells లో ) ఉండే మైటోకాండ్రియా (mitochondria) లో జరుగుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ శక్తి తగ్గి పోతూ ఉంటుంది కనుక, మైటోకాండ్రియా శక్తి ఉత్పాదనలో లోపం ఏమన్నా ఉన్నదా అని పరిశోధిస్తున్నారు. ఇంకా ముందుకు పోతే మైటోకాండ్రియా కి శక్తీ ఉత్పాదన చెయ్యమని చెప్పే సంకేతాలు ( NAD ద్వారా ) సరీగ్గా అందటల్లేదా అనేది ఇంకో ప్రశ్న. 

మన శరీరం లో జరిగే ప్రక్రియలన్నీ రాసాయినకంగా (chemical) జరిగేవే.  మనం చదువుకునే టప్పుడు ప్రయోగశాలలో (laboratory) లో చాలా ప్రయోగాలు చేస్తాము. ఒక రసాయనం కావాలంటే, దేనితో ఏది కలపాలో, ఏంత ఉష్ణోగ్రతలో ఉంచాలో ఆయా ప్రక్రియలన్నీ చాలా శ్రద్ధతో చేస్తాం. కొత్త పదార్ధాలు ఏమీ కలపం. ఎందుకంటే మనం అనుకున్న ఫలితం రాదు కనుక. మనం పరీక్ష తప్పుతాం. కానీ అవే జాగర్తలు మన శరీర రసాయనిక శాలలో ఎందుకు ఉపయోగించము? లోపలికి  కొత్త పదార్ధాలను ఎందుకు తీసుకుంటాము? (ఉదా: పొగతాగటం, మద్యం స్వీకరించటం, కొత్త రసాయనిక పదార్ధాలతో (additives) కృత్రిమ ఆహారాలు సృష్టించి ఆరగించటం మొదలయినవి.)  ఈ కొత్త రసాయనిక పదార్ధాల కలయిక మన శరీర శక్తి ఉత్పాదనతో ఆటలాడుకుంటున్నాయా ? మన శక్తి తగ్గుదలకి ఇవి కారణమయ్యుంటయ్యా? అదో పెద్ద ప్రశ్న.    

అసలు మన శరీరంలో జరిగే రసాయనిక  ప్రక్రియలన్నిటికీ మూలం మన DNA కదా !  దానిలో ఏమన్నా ఈ రహస్యం దాగుందా? శాస్త్రజ్ఞులు ఈ కోణంలో కూడా పరిశీలించారు. మన శరీరం లో  ఒక క్రమం ప్రకారం పాత cells నుండి కొత్త cells పుట్టుకు వస్తాయి (cell duplication ). ఈ క్రమంలో పాత cells చచ్చి పోతాయి (cell death).  

ఈ cell duplication క్రమంలో కూడా ఒక పద్ధతి ఉంది. ఎక్కువగాను తక్కువగాను జరగదు. కావలసినంత మాత్రమే జరుగుతుంది. duplicated cell సక్రమంగా రాక పోతే ఆ cell కూడా తనంతట తాను చచ్చి పోతుంది. కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఈ duplicated cells సరీగ్గా (exact గ ) లేకపోయినా తప్పించుకుని అత్తెసరు మార్కులతో చావకుండా బయట పడుతాయి. ఈ పరిస్థితిని mutation అంటారు. ఈ mutated cells  మనలో  కొన్ని నివురు కప్పిన నిప్పు లాగా దాగి ఉంటాయి. అవి మన శరీరం బలహీనమయినప్పుడు విజ్రుంభించి వాటి చెడు గుణాలని బయటపెడుతాయి. ఉదా:  కొన్ని cancer (uncontrolled duplication of cells ) లాగా బయట పడుతాయి. ఎందుకు ఈ విధంగా (mutation ) జరుగుతుంది అనే దానికి సమాధానం లేదు. కాకపోతే ఒకటి చెప్పుకోవచ్చు. బహుశా  రసాయనిక ప్రక్రియలు జరిగే టప్పుడు రక్తంలో కొత్త పదార్ధాలు ఉండటము ఈ mutations కి కారణమయి ఉండచ్చు .  జీవించటానికి అవసరంలేని అలవాట్లు (smoking, drinking alcohol, Hard drugs, food additives) దీనికి కారణ మవ్వచ్చు. 

ఈ పరిశోధనల్లో ముఖ్యముగా గమనించినది cell duplication అయినప్పుడు కొత్త cell లోని telomeres  కుంచించుకు (shorten )పోవటం. దీని అర్ధం ఏమిటంటే Cell Duplication అయినప్పుడు దానిలోవున్న DNA కూడా duplicate అవుతుంది. అల్లాగే దానిలో ఉండే chromosomes కూడా duplicate అవుతాయి. ప్రతి chromosome కీ ఆ chromosome చివరలు సూచించే ఒక తోక లాంటిది ఉంటుంది. దానినీ  tolemere  అంటారు. cell duplication జరుగుతున్న కొద్దీ ఈ తోక (telomere ) పొడవు తగ్గటం గమనించారు. ప్రస్తు తం ఈ పొడవు తగ్గటానికీ వృద్ధాప్యానికీ సంబంధముందని అనుకుంటున్నారు. ఎంతవరకూ ఈ సంబంధమనేది ఇంకో ప్రశ్న. 

ఇంకో విధంగా చూస్తే, అసలు వృద్ధులలో ఉన్న ఆ ముసలి కణాలని (cells ) తీసివేసి బదులుగా యవ్వనత్వంతో ఉన్న కణాలని వేస్తే ఎల్లా ఉంటుంది? వేస్తే పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అనీ పోతయ్యి కానీ మన శరీరంలో 220 రకాల కణాలు ఉన్నాయి. అన్ని రకాల కణాలని ఒక్కసారి మార్చలేము కదా (హార్ట్ ట్రాన్స్ ప్లాంట్  లాగా). 

దీనికి ఒక మార్గం ఉంది. Stem Cells అని వున్నాయి. వాటి గుణ మేమిటంటే అవి ఎక్కడ పెడితే వాటి కణాలుగా మారుతాయి. అంటే వాటిని Liver లో పెడితే Liver Cells గ మారతాయి కానీ వచ్చిన గొడవ ఆ Stem Cells కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడే ఉంటాయి. అందుకని వాటిని తీసి ఇంకొక చోట పెట్ట టానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. 

కానీ పదిహేనేళ్ళ క్రిందట (year 2000) పెద్ద వాళ్ళల్లో కూడా ఆ Stem Cells ఉంటాయని కనుగొన్నారు (Adult Stem Cells). ఈ Adult Stem Cells,  బేబీ Stem Cells లాగానే  పనిచేస్తయ్యా?  వీటితో  పరిశోధనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. అందులో ఒక ప్రయోగ శాల McGowan Institute for Regenerative Medicine in Pittsburgh, PA USA లో ఉంది. వ్రుద్దత్వం నుండి యంగత్వం చెయ్యటం ఎప్పటికి అవుతుందో ! ఎంతకాలం వేచి ఉండాలో. అదో అంతులేని ప్రశ్న.

ఏమిటో ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను.  నేను ఇదంతా వ్రాయటానికి కారణం నిన్న చూసిన Hollywood Movie "The Age of ADALINE".ఇది telomeres కుంచించటం ఆగిపోయి వృద్ధాప్యం రాకుండా ఉన్న ఒక అమ్మాయి కధ. వీలయితే చూడండి వృద్ధాప్యం రాకపోతే జీవితంలో ఎంత గొడవ జరుగుతుందో . 

1. The enzymes that make and use NAD+ and NADH are important in both pharmacology and the research into future treatments for disease.[73] Drug design and drug development exploits NAD+ in three ways: as a direct target of drugs, by designing enzyme inhibitors or activators based on its structure that change the activity of NAD-dependent enzymes, and by trying to inhibit NAD+ biosynthesis.[74]

The coenzyme NAD+ is not itself currently used as a treatment for any disease. However, it is being studied for its potential use in the therapy of neurodegenerative diseases such as Alzheimer's and Parkinson disease.[2] Evidence on the benefit of NAD+ in neurodegeneration is mixed; some studies in mice have produced promising results[75] whereas a placebo-controlled clinical trial in humans failed to show any effect.[76]

2. Telomeres are the caps at the end of each strand of DNA that protect our chromosomes, like the plastic tips at the end of shoelaces.

3. Nicotinamide_adenine_dinucleotide (NAD )

4. Telomere

5. The ability of stem cells to differentiate into specific cell types means that they are a "renewable source of replacement cells and tissues to treat diseases," according to the National Institutes of Health (NIH) website.

When they put a stem cell in the brain, it became a brain cell. When they put it in the liver, it became a liver cell. When they put it in the pancreas, it became a pancreatic cell. This is why scientists have been able to grow human organs such as livers, kidneys and ears in labs using stem cells.

Tuesday, September 29, 2015

118 ఓ బుల్లి కథ 106 --- నాకు ఏదో ఏదో అయినది

రాత్రి ఇంటికొచ్చేటప్పటికి పన్నెండున్నర అయ్యింది. ఇక్కడ అమెరికా లో అన్నట్లు "hit the sack " ఒంటిగంట అయ్యింది. అరగంట నుండీ దొర్లుతున్నాను నిద్దర పోటానికి.   మనస్సు సరీగ్గా ఉండకపోతే నిద్రపట్టదని పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి ఈనాడు జరిగిన సంఘటలని సింహావలోకనం చేసుకుంటున్నాను. దానికి కారణం వల్లీ గారి ఆవడలు అవ్వచ్చు, రాజుగారి ఇంటి తోటలో కాసిన సొరకాయలవ్వచ్చు లేకపోతే నేను ఫోటో దిగుతుంటే అమాంతంగా దగ్గరకు లాక్కుని భుజం మీద చెయ్యి వేసి ఫోటో తీయించుకున్న లలనామణి అవ్వచ్చు.

శర్మగారింట్లో  భోజనం చేసిన తర్వాత పిచ్చాపాటీ లో వోక్స్ వాగన్ నమ్మకద్రోహం నుండి తెలంగాణాలో కల్లు చావుల దాకా మాట్లాడుకుని, వెళ్దా మను కుంటుంటే  కాఫీ తాగి వెళ్ళండి అన్నారు. వాళ్ళింట్లో కాఫీ బాగుంటుంది. వద్దనలేము తాగాను . అంతకు ముందే శనివారం ఫలహారం, నాలుగు ఇడ్లీలు రెండు ఆవడలు తిన్నాను. వాళ్ళింట్లో ఆవడలు చాలా బాగుంటాయి. తినటంలో ఇడ్లీ మోతాదు తగ్గించి  ఆవడల మోతాదు ఎక్కువ చేస్తే బాగుండేది కానీ టూ లేట్. నాకింకా ఒక ఆవడని సాంబారులో వేసుకుని తింటే ఎల్లా ఉంటుందో చూడాలని ఉంది.

వల్లీ చేసే "ఆవడలు", రాణీ చేసే "బాదుషాలూ", బాబాయి ఇడ్లీల్లా రోజూ దొరకవు. దొరికినప్పుడు ఆస్వాదించటమే. ఆవిడ కాఫీ పౌడర్ అప్పటికప్పుడు తయ్యారు చేసి కాఫీ ఇస్తుంది కాబట్టి, ఇస్తానంటే తాగక పోవటం కూడా బాగుండదు. తాగటం కూడా మంచిదయింది. అప్పుడే బార్ లు మూసేస్తున్నారల్లే ఉంది రోడ్డు మీద కార్లు వంద మైళ్ళ స్పీడ్లో మమ్మల్ని దూసుకు పోతున్నాయి. నేను తూలి పోకుండా మెలుకువగా ఉండి మా ఆవిడని జాగర్తగా డ్రైవ్ చెయ్యమని చెప్తూ వచ్చాను.

చలి మొదలయింది పెరటి తోటలు మాడిపోటం మొదలెడుతున్నాయి. శర్మగారింటికి తోటలోనుండి నలుగురితో పంచుకోటానికి బోలెడన్ని చిక్కుడు కాయలు బీరకాయలు తీసుకు వచ్చాము. రాజుగారు వారి పెరటి తోటలో పండిన సొరకాయలు తీసుకు వచ్చారు. అందరూ సొరకాయల గురించి మాట్లాడు కోవటమే. ఒకరు గిన్నీస్ బుక్ లో  పెట్టచ్చు అని, ఇంకొకరు farmer of  the year అనీ ఏమిటేమిటో అంటున్నారు. అర సంచీ చిక్కుడు కాయలు గొప్పా రెండు సొరకాయలు గొప్పా? ఆయన తెచ్చిన రెండు సోరకాయలూ కోయటానికి ఒక నిమిషం కూడా పట్టదు. మేము గంటసేపు కష్టపడి కోసిన చిక్కుడు కాయలగురించి ఎవ్వరూ మాట్లాడరు. నాకు కనీసం farmer of the day బిరుదు ఇవ్వాలి. నిజం చెప్పాలంటే మా ఆవిడే ఆ చిక్కుడు  కాయలు అన్నీ కోసింది. నాపని తోటకి నీళ్ళు పోయటం వరకే. కానీ ఆడవాళ్ళని farmer of the day అంటే బాగుండదు కదా ! రాజు గారికి ఈ సంవత్సరం తోటలో దోసకాయలు రాలేదుట. వచ్చే సంవత్సరం నేను దోస తీగలు వేసి పండించి farmer of  the year పేరు సంపాయించాలి.

ఇవాళ మధ్యాహ్నం ఇంకో సంఘటన కూడా జరిగింది. నేను Literacy Dupage లో వాలంటీర్ గ  పని చేస్తాను. వాళ్ళు ప్రతి సంవత్సరమూ అందర్నీ పిలిచి ఒక ప్రోగ్రాం పెట్టి సంవత్సరంలో బాగా చదువుకున్న వాళ్ళనీ,  వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళనీ గౌరవిస్తారు. ఈ సంవత్సరం దానికి మా గ్రూప్ లో నలుగురిని ఎంచుకున్నారు. నేను స్టేజి మీదికి ఎక్కి నా బహుమానం తీసుకున్నతర్వాత ఫోటో తీస్తాము ఒకచోట ఆగమన్నారు. సరే ఆగాను. నలుగురూ వచ్చిన తరువాత  ఫోటో తియ్యటానికి రెడీ అవమాన్నారు. నేను వెంటనే నా కళ్ళజోడు తీసి పెట్టుకున్నాను. ఫోటో తీయబోతూ ఉంటే నా పక్కావిడ నన్నుగట్టిగా దగ్గరకు లాక్కుని నా భుజం మీద చేయ్యివేసింది. వెంటనే ఫ్లాష్ వచ్చింది ఫోటో తీసేశారు. ఆ హాల్లో ఉన్న రెండువందల మంది కూడా దీన్ని చూసే ఉంటారు. హడావుడిగా వెంటనే మా టేబుల్ దగ్గరకి వచ్చి ఎందుకైనా మంచిదని జరిగిన సంగతి మా ఆవిడకి చెప్పేశాను. చెయ్యి వేయటం మా ఆవిడ చూసిందట, కానీ మా టేబుల్ లో కూర్చున్న చిన్నది అనుకుందిట. ఆ అమ్మాయి నాకు రెండో పక్కన ఉంది.

అసలు నా ప్రశ్న ఎందుకు ఆవిడ హఠాత్తుగా నా భుజం మీద చెయ్యేసి ఫోటో తీయించుకున్నది అని. నాకు ఆవిడ ఎవరో కూడా తెలియదు. తెలుసుకోకుండా ఏదో మునిగిపోతున్నట్లు పరిగెత్తుకు వచ్చేశాను. కళ్ళజోడు పెట్టుకోంగానే నేను అంత బాగున్నానా లేక నేను అసలు క్యుట్ గ ఉంటానా ? ఎప్పటినుండీ ఆవిడ నాతో ఫోటో తీయించుకోవాలని చూస్తోందో ! ఆ కళ్ళజోడు డాలర్ షాప్ లో కొన్న రీడింగ్ గ్లాస్ లని తెలిస్తే నాతో ఫోటో తీయించుకునేదా ? అంతులేని ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఈ మధ్య పోప్ గారు అమెరికా యాత్రలో (sept 25-26,2015) immigrants ని hug చెయ్యమని అన్నారుట. ఎందుకు ఆలోచిస్తారు నిద్రపోండి బహుశా పోప్ గారు చెప్పినట్లు హగ్ చేసుకుందేమో అని మా ఆవిడ అంది కానీ నాకు నమ్మకం కుదరటల్లేదు.

ఎప్పుడు నిద్ర పట్టిందో గుర్తులేదు. మా ఆవిడ  ఆఫీస్ కి వెళ్తున్నాను కాఫీ అక్కడ పెట్టాను తాగమని చెప్తూంటే మెలుకువ వచ్చింది. ఇంటర్నెట్ లో ఎక్కడయినా ఆ ఫోటో అదే ఆ ఫోటో బయటికి వచ్చి మీరు చూస్తే దానిలో నా ప్రమేయం ఏమీ లేదని మీరు తెలుసుకోండి అందరికీ చెప్పండి.   

Wednesday, August 26, 2015

117 ఓ బుల్లి కథ 105 --- అమెరికా లో ఓ సమ్మర్ వీకెండ్

టాంక్ యోధులు 
సమ్మర్ అయిపోవస్తోంది. సెప్టెంబర్ రాబోతోంది ఇంక చలికి స్వాగతం, మనం చెప్పినా చెప్పకపోయినా అది వస్తుంది. వెచ్చదనం వెళ్ళే లోపల మనం చెయ్యాలనుకున్న పనులు చేసెయ్యాలి. కాలం మనకోసం ఆగదు కదా. మేము ఈ వీక్ ఎండ్ లో మూడు పనులు సక్సెస్  ఫుల్ గ చేశాము.

 Rose Garden  గులాబీలు  
భోజన ప్రియులు 
మొదటిది కాన్టీని పార్క్ పిక్నిక్(contigny park ఇది ఫ్రెంచ్, పేరు లో ఉన్న "g" పలకదు). పై ఫొటో అక్కడ తీసిందే. పార్క్ చూడంగానే పెద్ద పిల్లలు చిన్న పిల్ల లవుతారు. ఈ కాన్టీని పార్క్ ఒకప్పుడు Colonel Robert R. McCormick ఎస్టేటు. ఇది అయిదువందల ఎకరాల విశాలమయిన స్థలం. ఆయన Chicago Tribune అనే పత్రికకి ఎడిటర్.  ఇక్కడే ఉండి ఆయన 40 మైళ్ళ దూరాన్నున్న చికాగో ఆఫీసు కి రోజూ వెళ్ళి వస్తూ ఉండేవాడు. పొద్దున్న 8 గంటలకి ఇంట్లో బయలు దేరి ఆఫీసుకి 8:15 కల్లా జేరుకునేవాడుట. మనలాంటి వాళ్ళకయితే ఇది కొంచెం కష్టం. కానీ ఆయనకి ఎస్టేట్ లో ప్లేన్ ఉండేది, రన్వే ఉండేది. ఆయన చనిపోయేటప్పుడు   ప్రజల కోసం ఈ ఎస్టేట్ ని ఉపయోగించమని చెప్పి పోయాడుట.
వైకుంఠ పాళీ ఆటగాళ్ళు 

పిల్లల కేక్ కట్టింగ్  

ఆయన దాయాదులు ఈ స్థలంలో ఒక పార్క్, ఒక గల్ఫ్ కోర్స్ కట్టి వాటికి ఆయన వరల్డ్ వార్ 1 లో ఫ్రాన్స్ లో పోరాటం చేసిన ఊరు పేరు పెట్టారు. అల్లాగే వార్ కి సంబంధించిన మ్యుజియంలు కట్టారు. పిల్లలు ఆడుకోవటానికి యుద్దం లో వాడిన టాంక్ లు తీసుకు వచ్చి పెట్టారు. పార్క్ చాలా పెద్దది (29 ఎకరాలు ). ఒకపక్క పిక్నిక్ లు చేసుకోవటానికి పెద్దస్థలమూ, పక్కన కార్ పార్కింగ్ కి స్థలమూ. ఇంకా ఈ పార్క్ లో ఉన్నవి పెద్ద Rose Garden, ఒక  పెద్ద సరస్సు (ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు). పార్క్ అంతా రకరకాల పూలు, చట్లతో కళకళ లాడుతూ కనువిందుగా ఉంటుంది. నడవలేని వాళ్ళకి ట్రాలీ లో ఎక్కించి పార్క్ అంతా తిప్పుతారు. ఇక్కడ ఉన్న ఆయన నివాసం కూడా ఒక మ్యూజియం లాగా చేసి టూర్స్ ఇస్తున్నారు.
పిక్నిక్ సూత్రధారులు 
మేము పార్క్ తెరవంగానే పొద్దున్న పది గంటలకల్లా వచ్చేశాము. ఒక చెట్టుకింద స్థలాన్ని చూసుకుని సామాను పెట్టేసి పార్క్ చూడటానికి వెళ్ళాము. ఒంటి గంటకి భోజనం. సామాన్యంగా ఇటువంటి వాటిల్లో మగవాళ్ళ జోక్యం ఉండదు. భోజనం లో  ఏమి పెట్టాలి ఎవరు ఏమి చేసి తీసుకు రావాలి అనేవి ఆడ వాళ్ళే నిర్ణయించుకుంటారు. భోజనం అయిన తరువాత ఆడవాళ్ళూ పిల్లలూ వైకుంఠ పాళీ ఆడారు. ఇంతలో పెళ్ళి కెళ్ళి లంచ్ మిస్ అయిన రమ, రాజు గారు కేక్ పట్టుకు వచ్చారు. ఆరోజు మా గ్రూప్ లో రెండు యానివార్సరీలు, ఒకళ్ళకి పెళ్ళయి 31 ఏళ్ళు  ఇంకొకళ్ళకి 15 సంవత్సరాలు. కేక్ ని మా గ్రూప్ లో ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు కట్ చేశారు. ఇంతలో సాయంత్రం అయిపొయింది ఎవరిళ్ళకి వాళ్ళం బయల్దేరాము. నాకయితే ఇన్ని గంటలు పార్క్ లో కూర్చోటం ఇదే మొదటి సారి.



రెండవ పని మా ఇంటి దగ్గరలో ఉన్న Fermi Lab కి స్నేహితులని తీసుకు వెళ్ళటం నాకొక అలవాటు.  నేను అక్కడకి  ఎన్ని సార్లు వెళ్ళానో చెప్పలేను. నేను చూసి నచ్చిన వాటిని అందరికీ చెబుతూ ఉంటాను. నాకు వీలయితే అక్కడికి తీసుకువెళ్ళి చూపెడతాను. మోహన్  Fermi కి వెళ్దాము వస్తారా అంటే తప్పకుండా అని బయల్దేరాము. నా కెందుకో Fermilab అంటే చాలా ఇష్టం. ప్రపంచం లో దేశ దేశాల నుండీ పరిశోధనలు చెయ్యటానికి వచ్చిన ఒక వెయ్యి మంది ఇక్కడ రాత్రిం బవళ్ళు పనిచేస్తూ  ఉంటారు.

Fermi అంటే Enrico Fermi, University of Chicago లో Atomic Chain Reaction ని సాధించిన ఆయన. చికాగో దగ్గర Batevia అనే ఊళ్ళో కట్టిన particle physics and accelerator laboratory కి ఆయన పేరు పెట్టారు. మోహన్ చెప్పినట్లు హైస్కూల్ ఫిజిక్స్ పుస్తకాల్లో దీనిని గురించి ఒక లైన్ ఉంటుంది. CERN వాళ్ళ The Large Hadron Collider (LHC) రాకముందు Fermilab Tevatron ప్రపంచెం లో చాలా పెద్ద Collider.

సూక్ష్మంగా చెప్పాలంటే Fermilab, మన ప్రపంచములో atom కన్నా చిన్నవాటిని కనుక్కోటానికి పెట్టిన పరిశోధనాలయం. ఇక్కడ  చేసే పని చాలా సింపుల్ గ కనపడుతుంది కానీ చాలా క్లిష్టమయినది. ఈ పరిశోధనల కోసం భూమి కింద ఒక సొరంగం తవ్వి paticles (atoms, protons మొదలయినవి ) పరిగెత్తటానికి ఒక పెద్ద enclosed racetrack లాంటిది కట్టారు. దీనిలోనికి కొంత స్పీడ్ లో protons ని పంపిస్తారు. ఒక రౌండ్ తిరిగిన తరువాత వాటిని magnetic field తో ఒక తన్ను తంతారు. అప్పుడు అవి ఇంకొంచెం ఎక్కువ స్పీడ్లో పరుగెడుతాయి. తన్ని నప్పుడల్లా స్పీడ్ పెరుగుతుంది. అల్లా తన్నులు తిని తిని మంచి స్పీడ్ వచ్చినప్పుడు వాటికి అడ్డంగా ఏదైనా పదార్ధం పెడుతారు. మాంచి స్పీడ్లో వస్తున్న protons తగిలే సరికి ఆ పదార్ధం ముక్కలు ముక్కలవుతుంది. ఇంక మిగిలింది  పగిలిన ముక్కల్లో చిన్న ముక్కని కనిపెట్టటం. ఆ ముక్కలలో atom కన్నా చిన్న ముక్కలున్నయ్యేమో నని వెతుకుతారు. atom కన్నా చిన్న వైన ఆరు quarks లో, top quark, bottom quark ఇక్కడ కనుగొన్నారు. ఇప్పుడు ప్రపంచం లోకల్లా పెద్దది, యూరప్ లో పెట్టిన, The Large Hadron Collider (LHC) లో protons పరిగెత్తే racetrack Fermilab Tevatron కన్న పెద్దది. అందుకని అవి ఎక్కువ స్పీడ్తో పరిగెత్తి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మ మైన ముక్కలని చెయ్యగలదు. మీరు వినే ఉంటారు, క్రిందటి సంవత్సరం boson అనే atom కన్న చిన్న పదార్ధాన్ని ఇక్కడ కనుగొన్నారు.

పిల్లలకి Fermilab లో జరిగే సంగతులు చెప్పటానికి Lederman Science Center అని ఒక దాన్ని కట్టారు. ఇక్కడ పిల్లలూ పెద్దలూ paricle ఫిజిక్స్ లో చిన్న చిన్న experiments చెయ్య వచ్చు. వీలయితే మీరు తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడండి.
The Leon M. Lederman Science Education Center houses hands-on exhibits for ages 10+, technology and science labs, a store and the K-12 Teacher Resource Center. Educators who have attended workshops may bring their students here for field trips. Science Adventures classes for all ages take place at the Lederman Science Center.

మూడవ పని మా ఇంటి తోటకి సంబంధించినది. మా తోటలో ప్రతి సంవత్సరం లాగా దిగుమతి రాక పోయినా మాకు కావలసిన దాని కన్నా ఎక్కువ పండాయి. అందుకని స్నేహితులని పిలుస్తాము. ఒకరకంగా Garden Party లాంటిది. Garden లో పండినవి పంచుకోవటం ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం తోటకూర చాలా వచ్చింది. Italian Beans, బీరకాయలు చాలా వస్తున్నాయి. బోలెడన్ని థాయ్ మెరపకాయలు కాశాయి. కీరా దోసకాయలూ టమేటాలు బోలెడన్ని. కానీ కొన్ని మొక్కలు చాలా తక్కువ కాశాయి. yellow squash రెండు కాయలు వచ్చాయి. వంకాయలు మూడంటే మూడు వచ్చాయి. జుకినీ కి ఉన్న పెద్ద పెద్ద ఆకులు వంకాయ చెట్టుకు ఎండ తగలకుండా మూసేస్తున్నాయి. అందుకని ఆకులు కట్ చేశాము. దానితో జుకినీ చచ్చి కూర్చుంది. హైస్కూల్ సైన్స్ మర్చిపొయాము. ఆకులలో ఉన్న పత్రహరితము సూర్యరస్మితో కలిసి కదా మొక్క తన ఆహారం తయారు చేసుకునేది. అందుకనే జుకినీలు నాలుగే వచ్చాయి. సొరకాయలు అసలు రాలేదు. కొత్తిమెర వేద్దామనుకున్నా గానీ డాలరికి నాలుగు కట్టలు వస్తుంటే ఎందుకులే అని వేయలేదు. మొన్నీ మధ్యన కట్ట రెండు డాలర్లయింది. నాలిక కరుచుకున్నాను. ఈ సమ్మర్ లో మెక్సికో నుండి వచ్చే కొత్తిమెరలో మలినాలున్నాయని అమెరికా లోకి రానివ్వ లేదు. మాకు మెక్సికో నుండి చాలా కూరగాయలు వస్తాయి.
మా నాన్నగారు ప్రతి రోజూ పోద్దునపూట పెరటి తోటలో కూరలు కోసుకు వచ్చేవారు. మా అమ్మ ఆ రోజు వంట వాటితో చేసేది. అదే మా ఇంట్లో చేద్దామని ప్రయత్నం. మా ఇంటిలో వంటలు ఈ సంవత్సరం వింటే మీకు నోరువూరుతుంది. అన్నీ తోటలోనుండి కోసుకువచ్చి చేసినవే. తోటకూర పప్పు, తోటకూర(ఎండ బెట్టి) కూర. నేతి బీరకాయ, జుకినీ, దోసకాయ(కీరా) లతో కూర, పప్పు, పులుసు, పచ్చడి.
పచ్చి గ్రీన్ టొమాటో లతో పచ్చడి, పులుసు. Italian Beans తో కూర, వంకాయ తో కలిపి చేస్తే చాలా బాగుంటుంది. లేత బీరకాయలతో కూర (నాకు చాలా ఇష్టం) చాలా సార్లు చేశాం. నేను చేసిందల్లా మొక్కలకి ప్రేమగా నీళ్ళు పోయటం. అప్పుడప్పుడూ వాటికి పాటలు పాడుతూ ఉండటం. మొక్కలకి మ్యూజిక్ చాలా ఇష్టంట. మా ఆవిడ చేసిందల్లా కూరలు కోసుకొచ్చి వంట చేయటం. నిజం చెప్పొద్దూ  వంటలన్నీ మంచి ఫ్లేవర్ఫుల్ గ వచ్చాయి. పెరటి తోట కూరగాయలతో ఎవరు చేసినా వంటలు బ్రహ్మాండంగా వస్తాయల్లె ఉంది.

1. http://www.cantigny.org/
2. Fermilab

Thursday, August 6, 2015

116 ఓ బుల్లి కథ 104 --- పోర్చ్ లైట్



వసంత కాలం వచ్చింది. వింటర్ లో స్నో కి చలికి తట్టుకోలేక వెచ్చదనం లోకి పారిపోయిన పక్షులన్నీ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నాయి. అవి ప్రతిరోజూ తెల్లవారు ఝామున 4:30 కి కిచ కిచలతో నిద్దరలేపు తాయి. ఆ కిచ కిచలు కొందరికి  మధుర గానం గా వినపడుతుంది కానీ మా ఇంట్లో కొందరికి దరిద్రపు రోదనలా వినపడుతుంది. ఏది ఏమయినా ఈ శబ్దాలు కిటికీలు వేసుకుని పడుకుంటే తప్ప తప్పవు . నా కయితే మాత్రం ఈ శబ్దాలు మేలుకొలుపుగా ఉంటాయి. నా చిన్నప్పుడు మా తాతయ్య రోజూ తెల్లవారు ఝామున లేచి పద్యాలూ పాటలూ పాడుతుండే వాడు. నాకు అటువంటి పరిస్థుతులు లేవు గనుక శబ్దం చెయ్యకుండా కదలకుండా పడుకుని మనస్సుకి ఏమన్నా మంచి ఆలోచనలు వస్తాయేమోననని ఎదురుచూస్తూ ఉంటాను, కాఫీ పెట్టేవాళ్ళు లేచేదాకా.

ఆరోజు పొద్దున్నే పేపర్ తీసుకుని వస్తుంటే బయట పోర్చ్ లైట్ వింతగా కనపడింది. ఏమిటా అని చూస్తే లాంప్ కి గోడకి మధ్యన పుల్లలు కనపడ్డాయి. ఇక్కడికి అవి ఎల్లా వచ్చాయా అని ఆశ్చర్య పోయాను. సరే చూద్దాంలే  అని వదిలేశాను. కానీ రోజురోజుకీ అవి పెరగటం మొదలెట్టి గూడు ఆకారం వస్తోంది. ఇంట్లో పక్షులు గూడు పెట్టబోతున్నాయని గ్రహించి ఇంకా ఊరుకుంటే లాభంలేదని పుల్లలన్నీ తీసేశాము. ఈ పక్షులు ఇంటి ముందరా ఇంటి వెనకాలా చెట్లు ఉంటే వాటి మీద గూడు పెట్టుకోక ఇంట్లోనే గూడు పెట్టాలా!

ఇంతలో వారంరోజులు ఇల్లు విడిచి న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది ( మా ఆవిడ వెకేషన్ తనతోపాటు నేనూను). తిరిగొచ్చి చూసేసరికి లాంప్ వెనకాల పూర్తి గా గూడు తయారయ్యింది. దానిలో గుడ్లు పెట్టిందేమో, పడగొట్టటానికి మనసొప్పలేదు. దానికి తోడు రోజూ వర్షం. ఎంత పక్షులనైనా వర్షంలో క్రూరంగా ఎల్లా బయటికి నెట్టేస్తాం ? ఇంక పక్షుల రాక పోక లని జాగర్తగా గమనించటం మొదలెట్టాము.

రోజూ ఎప్పుడూ ఒక పక్షి చెట్టు కింద కూర్చుని చూస్తూ ఉంటుంది. పొద్దున్న వాకిలి తలుపు తీయగానే చెట్టుకింద ఉన్న పక్షి  "గాయ్" మంటుంది. ఇంటి బయటికి రాంగానే "గాయ్ గాయ్"  మంటుంది. ఇలా రోజూ తలుపు తీసినప్పుడల్లా జరుగుతుంటే ఏమిటా ఇది అనే ఆలోచన మొదలయింది. ఒక రోజు  తెల్లవారు ఝామున పక్షుల కోడ్ ఒక మెరుపులా తట్టింది. మొదటి అరుపు "గాయ్" డేంజర్ అని చెప్పటం రెండో అరుపు "గాయ్  గాయ్" ఆల్ క్లియర్ అని. ఈ సమాచారం ఆ కాపలా కాసే పక్షి ఎవరికి  చేరవేస్తోందో తెలియదు. అందుకని చాలా జాగర్తగా మసులుకున్నాము. మా రాకపోకలు తప్పుగా అర్ధం చేసుకున్నాయంటే మా మీద ఎన్ని పక్షులు దండెత్తేవో !

ఇలా రోజులు గడుస్తున్నాయి. ఏవో శబ్దాలు, కిచ కిఛలు వినపడుతుంటాయి. ఒకరోజు కిటికీ లోనుండి చూశాను, పిల్లలు అమ్మ చుట్టూ చేరాయి, అమ్మ ఆహారం పట్టుకొచ్చి పిల్లలకి పెడుతోంది. ఫోటోలు తియ్యాలని ఉంది కానీ ఆ మధురమైన తల్లీ పిల్లల మధ్య మాధుర్యాన్ని శబ్దం చేసి చెదరగొట్టటం ఇష్టం లేక పోయింది. తల్లీ పిల్లల మధ్య ప్రేమ ప్రకృతిలో అన్ని జీవులలోనూ ఒకటే. వారం పదిరోజులయ్యింది. పిల్లలు పెద్దవయినాయి. మీరు క్రింద ఫోటోని పెద్దది చేసుకుని చూస్తే  బుజ్జి బుజ్జి పిల్లలు కనపడతాయి.


ఒకరోజు పొద్దున్న మా దివ్య మొక్కలకి నీళ్ళు పోస్తుంటే పక్షి పిల్లలు గబుక్కున రెక్కలు విదిలించుకుని ఎగిరిపోయాయి.


పక్షులు ఎగిరి పోయాక  రెండు రోజులు ఆగి గూడులో ఏమన్నా పిల్లలు ఉన్నాయేమో నని కుర్చీ వేసుకుని ఎక్కి చూశాము. అంతా ఖాళీ. "యమ్టీ నెస్ట్" అంటే ఇదే నెమో. లాంప్ చుట్టూతా శుభ్రం చేశాము. చిత్రంగా ఉంటుంది, పక్షులు గూడుని పకడ్బందీగా ఎంత జాగర్తగా అల్లుతాయో. ఫోటో తీసి దాచి పెట్టుకున్నాము.

మా అదృష్ట మేమిటో , ఈ వసంతంలో ప్రకృతిలో జరిగే మృదు మధురమయిన మహత్తర ఘట్టం మా పోర్చ్ లో జరిగింది.

Thursday, July 30, 2015

115 ఓ బుల్లి కథ 103 --- మగవాళ్ళ ఆరోగ్యానికి ఇవి ముఖ్యం

ముఖ్యంగా మగవాళ్ళకి  ఆరోగ్య విషయంలో ఈ క్రింది 9 న్యూట్రియంట్స్ చాలా ముఖ్యం అని కనుగొన్నారు. మనము తినే ఆహారంలో ఇవి మన శరీరానికి కావలసిన మోతాదులో అందకపోతే రోగగ్రస్తులు అవటానికి కారణం అవ్వచ్చు. దీనికి కారణం ఈ 9 న్యూట్రియంట్స్ కొన్ని అనారోగ్య (ఆల్జైమర్స్, డయ బెటీస్, కేన్సర్  లాంటి) పరిస్థుతుల నుండి మనలను రక్షించ కలవని పరిశోధనలలో కనుగొన్నారు. వీటిని సప్లిమెంటు లుగా తీసికోనుటం కన్నా ఇవి ఉండే ఆహారం తీసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. మీకు ఇంకా ఎక్కువ వివరాలు అవసరమయితే Webmd  సంప్రదించండి.

1. Magnesium
ఇది మన శరీరంలో జరిగే దాదాపు 300 పైన రసాయనిక చర్యలలో ముఖ్య పాత్ర వహిస్తుంది ముఖ్యంగా మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మనలో చాలా మందికి ఇది తక్కువగా ఉండవచ్చుఅని పరిశోధనలలో తేలింది.
మనకి ఎందుకు కావాలి: Magnesium is key for keeping your heart healthy and your sleep restful. It helps lower stress and makes muscles strong. Without enough of this mineral, you may suffer from insomnia, anxiety, and high blood pressure. It helps to regulate melatonin (a compound that helps you sleep), cortisol (too much of which causes anxiety), and blood pressure.
వేటిల్లో ఉంటుంది: Spinach, cashews, avocado, brown rice and black beans.

2. Vitamin D
ఇది calcium తో కలిసి పనిచేసి మన ఎముకలు గట్టిగా ఉండేటట్లు చూస్తుంది. సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో ఇది తయారు అవుతుంది.
మనకి ఎందుకు కావాలి: The main function of vitamin D is to promote calcium absorption in the gut. It also “maintains adequate serum calcium and phosphate concentrations to enable normal mineralization of bone,” according to the National Institutes of Health. In other words, the nutrient keeps bones strong. Deficiencies in this vitamin lead to obesity, diabetes, hypertension, heart attack, stroke, and muscle weakness.
వేటిల్లో ఉంటుంది: సూర్యరశ్మి, Salmon, eggs, fortified milk, fortified yogurt and fortified orange juice.

3. Vitamin B12
మన శరీరంలో Central nervous system సరీగ్గా పనిచెయ్యటానికి తోడ్పడుతుంది. అందుకనే ఇది తక్కువుంటే numbness, weakness and anemia కలగ వచ్చు. ఇది చాలా వరకు మాంసాహారం లలో ఉంటుంది. అందుకని శాఖాహారులలో ఇది తక్కువ ఉండటానికి ఆస్కారం ఉంది.
మనకి ఎందుకు కావాలి: This nutrient is essential for red blood cell formation, neurological function, and DNA synthesis. B12 is necessary for normal nerve activity, and like all of the B-complex group of vitamins, it helps with energy and metabolism. A deficiency can lead to anemia, or a lack of healthy, oxygen-providing red blood cells, as well as fatigue and shortness of breath.
వేటిల్లో ఉంటుంది: Yogurt, shrimp, chicken, fortified breakfast cereals and nondairy milks.

4. Niacin (Vitamin B3)
మనకి ఎందుకు కావాలి:The most important function of vitamin B-3 is its ability to lower blood cholesterol levels, and lower cholesterol means a lower risk of suffering from a stroke, heart attack, or another cardiovascular disease. According to WebMD, niacin also has been studied for the treatment of other diseases, and while more research still needs to be done, there is evidence that it might lower the risk Alzheimer’s disease, cataracts, osteoarthritis, and type 1 diabetes.
వేటిల్లో ఉంటుంది: వేరుశనగ కాయలు, ముడి బియ్యం.
5. Iodine
మనకి ఎందుకు కావాలి:Iodine is required by the body’s thyroid gland to produce the hormones T3 and T4, which help you efficiently burn calories, according to Men’s Health. Iodine may also play a role in immune response.
వేటిల్లో ఉంటుంది: ఆవు పాలు, పెరుగు. కోడి గుడ్లు, సీ ఫుడ్.

6. Zinc
మనకి ఎందుకు కావాలి:Zinc helps the immune system fight off bacteria and viruses. It is essential in making proteins and DNA. Zinc is also related to fertility, potency, sex drive, and long-term sexual health, and the mineral is critical to sperm production, according to Men’s Health.
వేటిల్లో ఉంటుంది: నువ్వులు, గుమ్మడి గింజలు, శనగలు, జీడిపప్పు.

7. Vitamin E
ఒకవిధంగా చూస్తే దీనిని బ్రెయిన్ ఫుడ్ అనవచ్చు. ఆల్జైమర్స్ బారి నుండి రక్షించగలదు. ఇది సామాన్యంగా కొవ్వు(fat) ఎక్కువున్న పదార్ధాలలో ఉంటుంది. అందుకని కొవ్వు తగ్గించి తింటున్న వాళ్ళకి ఇది తక్కువగా ఉండ వచ్చు.
మనకి ఎందుకు కావాలి: Vitamin E is actually a blanket term for eight different naturally occurring nutrients. But each is an essential antioxidant, and scientific research suggests they protect against heart disease and cancer. More specifically, these nutrients guard against the damaging effects of free radicals, molecules that have an unshared electron and might contribute to the development of cancer and cardiovascular disease. It is also used as a topical treatment for aging and sunburn.
వేటిల్లో ఉంటుంది: Sunflower seeds, almond,butter and hazelnuts.

8. Vitamin K
మనకి ఎందుకు కావాలి:Vitamin K boosts vascular health by preventing calcium build-up along blood vessel walls. It serves as a coenzyme — or a necessary ingredient for a protein’s biological activity — for an enzyme that’s needed for blood clotting and in bone metabolism.
వేటిల్లో ఉంటుంది: Spinach, Broccoli, Beans, Soybeans, eggs.

9. Chromium
మనకి ఎందుకు కావాలి:This may seem like a surprising entry for this list; after all, what it actually does and how much is needed for optimal health are not well defined. But it is known to enhance the working of insulin, the hormone critical to the metabolism and storage of carbohydrates, fats, and proteins by the body.
వెటిల్లో ఉంటుంది : తాజా కూరగాయలు పళ్ళూ. బంగాళా దుంపలు (స్కిన్ తోటి), స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో వంట చేసినా వస్తుంది.

******ఇదికూడా చదవండి
********ఆడవాళ్ళ ఆరోగ్యానికి
***********మనకు కావాల్సిన ముఖ్యమయిన విటమిన్స్, సప్లిమెన్ట్స్

దీని మాతృక:
1. 9 Nutrients That Men Do Not Get Enough Of 

Thursday, June 25, 2015

114 ఓ బుల్లి కథ 102 --- మా పెరటి తోటతో ఇక్కట్లు

అమెరికాలో మేముండే ప్రాంతంలో ఏప్రిల్ మొదటి వారంలో బయట చెట్లన్నీ ఆకులూ గట్రా లేకుండా భూతాల్లాగా ఉంటాయి. ఏప్రిల్ చివరి వారం వచ్చేసరికి అవే చెట్లు ఆకులతో పువ్వులతో పచ్చగా నవ నవ లాడుతూ వుంటాయి. మాకు పెరటితోట వేసుకుని ఆనందించే భాగ్యం సంవత్సరానికి సెప్టెంబర్ లో చలి వచ్చే దాకా, మహా అయితే నాలు గైదు నెలలు మాత్రమే. అందుకని ఇంట్లో పెరిగిన మొక్కల్ని గార్డెన్ లో వేస్తే త్వరగా పంటని అనుభవించ వచ్చు అని, విత్తనాలు కొని ఏప్రిల్ లో ఇంట్లో నారు మడిలాగా వేశాం. మేము ఇంట్లో పెట్టిన గింజలన్నీ, టమాటో బీన్స్ సొరకాయ వంకాయ బెల్ పెప్పర్ అన్నీ మొక్కలుగా వచ్చాయి. ఇంకేం ఆనందం పరమానందం. కానీ ఇంతలో మొక్కల్ని వదిలేసి రెండు వారాలు న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చి చూసే సరికి ఆలనా పాలనా లేకపోయినా  మొక్కలన్నీ పచ్చగా బాగున్నట్లే ఉండటంతో చాలా సంతోషం వేసింది.

ఇక్కడ మామూలుగా మే మొదటి వారం లో వచ్చే "మదర్స్ డే" తో మొక్కల్ని పెరటి తోటలో వెయ్యటం మొదలెడుతారు. మా పెరట్లో ఒక పెద్ద "maple tree" ఉండటంతో ప్రతి సంవత్సరం "మే" వచ్చేసరికి అది  బోలెడన్ని విత్తనాలు వెదజల్లు తుంది. తన జాతిని  అభివృద్ది చేసుకోవాలనే కోరికని మనము కాదన లేము కానీ మన మొక్కలు వేసే ప్రదేశంలో maple tree విత్తనాలుంటే ఇంతే సంగతులు. అందుకని పెరట్లో  మొక్కలు వేసేముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి తోడు వాతావరణం సహకరించటల్లేదు. పగలు కొద్దిగా వెచ్చగా ఉన్నా రాత్రి ఫ్రీజింగ్ వాతావరణం, లేకపోతే రోజంతా వర్షం. అటువంటి సమయంలో మొక్కలు పెడితే బతకటం చాలా కష్టం అందుకని చాలా రోజులు waiting mode లోకి వెళ్ళాల్సి వచ్చింది.

వాతావరణానికి తోడు, గార్డెన్ లో ఇద్దరం కలసి పని చెయ్యాలనే షరతు ఉండటం తోటి, త్వరగా గ్రౌండ్ ని ప్రిపేర్ చెయ్యటం కుదరలేదు. ఇంట్లో పెంచిన మొక్కలు పచ్చగా ఉన్నాయి గానీ చాలా బలహీనంగా ఉన్నాయి. మొత్తం మీద రెండు వారాలకి ఇంట్లో మొక్కలని తీసి గార్డెన్లో వేశాము. వేసేటప్పుడు కలుపు మొక్కలు రాకుండా "weed and feed " కూడా వేశాము. అంతే ఒక వారంరోజుల్లో వేసిన మొక్కలన్నీ కాలంలో కలసిపోయాయి.

ఇంక ఏమి చెయ్యటం? నీదంటే తప్పు, నీదంటే తప్పు అని వాదించుకున్నా సమస్య పరిష్కారం కాదు కాబట్టి వెంటనే వెళ్ళి కొత్త మొక్కలని కొనుక్కుని వచ్చి వేశాం. స్నేహితులు ఇచ్చిన  ఆనపకాయ, బీరకాయ  విత్తనాల గూడా గార్డెన్ లో పెట్టాము. ఈ తడవ  weed and feed వాడలేదు. మొక్కలు త్వరగా పెరగటానికి "Miracle Grow" కూడా వేశాం. వేసి రెండు వారాలయింది. ఇప్పుడిప్పుడే మొక్కలు బతికి బట్ట కడుతున్నాయి.

 పై ఫోటో ప్రస్తుతం మా పెరటి తోటది. మీకు ఒక సంగతి చెప్పటం మరిచి పోయాను. ఫోటోలో ఎక్కువగా కనపడుతున్న మొక్కలు క్రిందటి సంవత్సరం వేసిన తోటకూర సంతానం. ఈ సంవత్సరం వెయ్యకపోయినా బోలెడన్ని తోటకూర మొక్కలు వచ్చాయి. అడవిలా అంతటా పెరిగింది. ఇప్పటికి మూడు సార్లు ఆకులు కోసి స్నేహితులతో పంచుకున్నాము. చూద్దాం ఏమవుతుందో, ఈ సంవత్సరం పెరటి లో పండిన కాయ గూరలు తినే భాగ్యం ఉందో లేదో. 

ఈ సంవత్సరం అనుభవం మీద తెలుసుకున్నవి, ఏప్రిల్ నెలలో గార్డెన్ మీద ఒక పట్టా వేస్తే maple tree విత్తనాలు త్వరగా వేరెయ్య వచ్చు, రెండొవది weed and feed గార్డెన్ లో వాడకూడదు, మూడవది ఇంట్లో నారుమడి వెయ్యటం కుదరదు (రోజూ నారుకి నీరు పొయ్యాలి), నాల్గవది గార్డెనింగ్ చేసేటప్పుడు భార్యా భార్తల సహకారం చాలా ముఖ్యం (భర్త చెప్పిన మాట భార్య వింటే చాలా బాగుంటుంది ).  

Saturday, June 6, 2015

113 ఓ బుల్లి కథ 101 --- హమ్మయ్య! మెమోరియల్ డే గండం గడిచి పోయింది

వేసవి వస్తోందంటే నాకు కొంచెం గాభరాగా ఉంటుంది. ఇంట్లో సణుగుడు ప్రారంభ మవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే "మే" మొదటి వారంలో వచ్చే మదర్స్ డే తో ప్రారంభ మవుతుంది. అది ఒక రోజే కాబట్టి ఆ మదర్స్ డే ని ఎల్లా గోల్లా నెట్టెయ్య వచ్చు. కానీ ఈ మెమోరియల్ డే తో పెద్ద సణుగుడు ప్రారంభ మవుతుంది. "త్రీ డే వీకెండ్ వస్తోంది ఎక్కడికన్నా వెళ్దామా". రోజూ ఏదో ఒక సందర్భంలో ఇదే పాట. నా ఖర్మ కాలి ఈవిడకి ఈ తడవ నాల్గో రోజు కూడా సెలవ కలసి వచ్చింది దానితో ఇంకొంచెం ప్రెజర్.

ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంత సణుగుళ్ళు ఉండేవి కాదు. మా స్కె డ్యుల్సు అన్నీ వాళ్ళ స్కె డ్యుల్సు మీద ఆధారపడి ఉండేవి. వాళ్ళు మా ఇద్దరి మధ్యన ఒక  "బఫ్ఫర్"  గా ఉండే వాళ్ళు. దానితోటి సణుగుళ్ళు, కోపతాపాల వ్యవహారం చాలావరకు తగ్గేవి. కానీ ఇప్పుడు ఇంట్లో ఇద్దరే ఉండటంతో తప్పించుకు తిరగటం చాలా కష్టం. వరుసగా  అడిగిన దానికి "నో" అనే ఆన్సర్ తీసుకోని వాళ్ళు ఇంట్లో ఉంటే మాటల్లో మృదుత్వం దెబ్బతిని మూల కూర్చుంటుంది.

పోనీ పిల్లలతో ఎక్కడికన్నా వెళ్దామా అనుకుంటే ( వాళ్ళు వప్పుకుంటే), ఈ కాలంలో పిల్లలు చేసే పనులు మనకి కొంచెం ఇష్టంగా ఉండవు కష్టంగా ఉంటాయి.  స్విట్జర్లాండ్ లో "ఆల్ప్స్" పర్వతాల ఎదురుకుండా కాంప్ లో వారం పాటు గుడారము వేసుకుని పర్వతాల అందాలు వీక్షించే వ్యవహారం లేదు ( ఏదో పొద్దున్న కాఫీ తాగుతూ అలా పర్వతాల అందాలు చూడగలం గానీ రోజంతానా !). "పేరూ" దేశంలో ఉన్న "మాచు పీచు" నాగరికత చూడటానికి అంచెలంచలుగా గుడారాలు వేసుకుని కొండలు ఎక్క గలిగే వయసు కాదు. పోనీ బాక్ పాక్ వేసుకుని బస్ లొ వెళ్దామన్నా కుదరదు. "హవాయ్" లో బీచ్ వడ్డున అర్ధ నగ్నంగా కూర్చుని "డ్రింక్" లు సేవిస్తూ "చిల్" అవుతున్నామను కోవటం కూడా నా చేత కాదు. నేనెప్పుడు "హాట్" అయ్యాను గనుక "చిల్" అవటానికి. ఇంతెందుకు ఇక్కడ అమెరికాలో యాభై ఏళ్ళు ఉన్నా, "గ్రాండ్ కాన్యన్" కి  వెళ్ళటం కూడా పడలేదు. ముఖ్యంగా నాకు కొండ లోయ చూసే దేమిటిలే అనే చిన్న చూపు. ఇంతెందుకు పెళ్ళి అయిన కొత్తల్లో మా ఆవిడ  "నయాగరా ఫాల్స్" చూడా లనే కోరిక  వెలిబుచ్చింది. ఏముంది  "నయాగరా ఫాల్స్" లో, ఎత్తు అయిన కొండ మీదనుంచి నీళ్ళు పడుతుంటే, చూసేదేముంటుందిలే అన్నాను (అప్పటికే నేను ఏదో రూపేణా అయిదు ఆరు సార్లు అక్కడికి వెళ్ళాను. నాకు మళ్ళా అక్కడికి వెళ్ళాలని లేదు). తీసుకెళ్తానేమోనని ఇర్రవై ఏళ్ళు చూసి తనే పిల్లలని వేసుకుని వెళ్ళి చూసి వచ్చింది. నేను కర్కోటకుడి ననుకోవోకండి సమయం సందర్భం కలసి వచ్చినప్పుడు ప్రపంచంలో ముఖ్యమైన ప్రదేశాలన్నీ తిరిగాము. ప్రస్తుతం నాకెందుకో ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళాలనే కోరికల్లేవు. ఈ లాంగ్ వీకెండ్ లతో ఎప్పుడూ గొడవే.

వేసవిలో అమెరికాలో, శలవలు అందరూ ఆనందించే విధంగా సోమవారం వచ్చేటట్లు చేసి, దానిని శని ఆది వారాలతో కలిపి మూడు రోజులు గ శలవలు ఇస్తారు. దీన్ని లాంగ్ వీకెండ్ అంటారు. ఇది ప్రతీ సంవత్సరం మే నెల లో మెమోరియల్ డే తో మొదలవు తుంది. పార్కులూ బీచ్ లూ యమ్యూజ్మెన్ట్ పార్కులు, ఇంతెందుకు జనం సునాయాసంగా డబ్బులు ఖర్చు పెట్టటానికి వీలుండే వన్నీ సంవత్సరంలో మొదటిసారి ఇప్పుడు తెరుస్తారు. ఇంతవరకూ చలికాలంతో ఇంట్లో ముడుకుచు కూర్చున్న జనమంతా మొదటి రోజు మొదటి ఆట సినీమా వదిలితే బయట పడ్డట్లు, తండోప తండాలు గా వచ్చి తింటారు, తాగుతారు, సరదాగా తిరుగుతారు, సంబరం చేసుకుంటారు. అందరికీ తెలుసు, ఇవన్నీనాలుగు నెలలలో, సెప్టెంబర్ లో వచ్చే లేబర్ డే లాంగ్ వీకెండ్ తో మాయ మవుతాయని.  జీవితంలో ఎప్పుడో ఫుల్ స్టాప్ పడుతుందని జీవించ కుండా ఉంటామా ?

మేము సామాన్యంగా ఈ సమయంలో అమెరికాలో "సియాటిల్" అనే ఊరు వెళ్ళే వాళ్ళము. వాళ్ళ అక్కయ్య కూతురు ఉండేది అక్కడ. నా ప్రమేయం లేకుండానే అన్ని ఏర్పాటులు ఆవిడే చేసేది. నేను బుద్ధిమంతుళ్ళా మాట్లాడకుండా కారెక్కి ప్లేన్ ఎక్కి వాళ్ళని అనుసరించే వాణ్ని. సామాన్యంగా "సియాటిల్" నుండి అందరం ఇంకో చోటుకి కూడా వెళ్ళే వాళ్ళం. కెనడాలో  "వాంకూవర్" "విక్టోరియా" అలా చాలా చోట్ల తిరిగాము. నాకు చాలా బాగా నచ్చింది "సియాటిల్" దగ్గర ఒక ద్వీపం లో మకాం. బోటు లో కారు కూడా పెట్టుకుని తీసుకు వెళ్ళాము. మేము చిన్న పిల్లలతో సహా ఎనిమిది మంది. సముద్రపు వడ్డున ఒక పల్లెటూళ్ళో రెండు ఇళ్ళు అద్దెకు తీసుకున్నాము. నేనుంటే, నాకోసం రైస్ కుక్కర్ కూడా వెంట వస్తుంది. నా కెందుకో బయట తినటం ఇష్టం ఉండదు.  కమ్మటి గోంగూర ముద్దతో సవర్ క్రీమ్ ( మీగడ పెరుగు) నంచుకుంటూ తింటే వచ్చే ఆనందం ఎక్కడ ఏది తింటే వస్తుంది?.  ఆరోజు అందరూ ఎక్కడో రేస్టోరెంట్ కి వెళ్ళారు. సాయం సమయం. హాల్లో విండో లో నుండి సముద్రం మీద అస్తమించే సూర్యుడు కనపడుతున్నాడు. నేను అలాగే చూస్తూ కూర్చున్నాను. చూస్తుండగానే తెల్లటి సూర్య కిరణాలు రంగు రంగులు గా మారి, ఎర్రటి రక్త వర్ణంతో సముద్రంలో కలసి పోబోతున్నాయి. హాలు నిండా అస్తమించే సూర్యుని ఎర్రటి కిరణాలు!  ఏదో లోకంలో ఉన్నట్లు ఉంది. చిటికెలో అవి మాయమయిపోయి మళ్ళా ఈ లోకంలో పడేశాయి. ఆ అనుభవం కన్యాకునారి లో రెండుసార్లు సూర్యాస్తమయం చూసినా కలుగలేదు. ఆ మర్నాడు పొద్దున కాఫీ తాగుతూ ఇంటి బయట పచ్చికలో కూర్చుని మాట్లాడు కుంటూ ఉంటే, ఇంటి ఓనర్ వచ్చి హెచ్చరించేదాకా మాకు మద్యాహ్నం ఇల్లు ఖాళీ చెయ్యాలని గుర్తు రాలేదు.  ఏమిటో ఒక్కొక్కప్పుడు గంటలు నిమిషాలు గా గడచి పోతూ ఉంటాయి.

ఈ తడవ ఎక్కడకీ వెళ్ళే పరిస్థితి లేదు. క్రిందటి నెల న్యూయార్క్ వెళ్ళి పిల్లలతో రెండు వారాలు ఉండి వచ్చాము. శరీరం కూడా కొంచెం సహకరించటల్లేదు. వాతావరణం కూడా ఒక రోజు వేడి ఒక రోజు చచ్చే చలి. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలోకే వాళ్ళ తమ్ముడి కూతురు అమెరికా చూడటానికి వస్తోందని వార్త వచ్చింది. అంతే నా మీద ఎక్కడికి వెళ్ళాలనే ప్రెజర్ అంతా మాయమయింది. ప్రయాణ ఏర్పాట్లు  ఏవి చెయ్యాలి, ఎవరింట్లో ఎన్ని రోజులు ఉండాలి, ఏమేమి చూపెట్టాలి, అనుకున్నట్లు పనులు జరుగుతున్నయ్యా?. వీటితోటి ఆవిడ బిజీ బిజీ బిజీ. నాకయితే ఖుషీ ఖుషీ ఖుషీ . పుట్టింటి మమకారం ఎప్పటికీ తగ్గదు. ఆవిధంగా మెమోరియల్ డే వీకెండ్ గడిచిపోయింది.
"Time solves all the problems" అంటే ఇదే  నేమో ! 

Monday, May 25, 2015

112 ఓ బుల్లి కథ 100 --- మెమోరియల్ డే 2015



ఇవ్వాళ అమెరికాలో మెమోరియల్ డే శలవ. యుద్దా లలో చనిపోయిన వారిని తలుచుకునే రోజు. మనం సుఖంగా సంతోషంగా జీవితం గడుపుతున్నా మంటే చాలా వరకు కారణం ప్రపచం కోసం ప్రాణాలర్పించిన వీరే. ఇటు జర్మనీ అటు జపాన్ ప్రపంచాధిపత్యానికి కుమ్ముక్కై దేశాల మీద పడి మారణ హోమం చేస్తుంటే వాటి ఆట కట్టించటానికి తమ ప్రాణా లర్పించింది వీరే. ప్రపంచాన్ని నరక యాతన పెడుతుంటే చూస్తూ కూర్చోక రక్షించటానికి ప్రాణా లర్పించింది వీరే. వీరు అమెరికాలో ప్రతీ ఊరు లోనూ ఉన్నారు. భర్తలు లేని భార్యలూ , తండ్రులు లేని పిల్లలు, పిల్లలని కోల్పోయిన తండ్రులు ఎంత మందో. వారందరికీ నా అశ్రు తర్పణాలు. హిట్లరుని జర్మనీని జపాన్ నీ తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంటుంది. చంద్రుడికో నూలుపోగు లాగా నేను చెప్పుకుంటున్నాను. మీ రెప్పుడూ మా మనసుల్లో మెదులుతూనే ఉంటారు.



1. Memorial Day 2015

Sunday, May 10, 2015

111 ఓ బుల్లి కథ 99 --- ఆడవాళ్ళ ఆరోగ్యానికి

ముఖ్యంగా ఆడవాళ్ళకి, అందునా వయస్సు 55 పైబడిన వారికి ఆరోగ్య విషయంలో ఈ క్రింది 6 న్యూట్రియంట్స్ చాలా ముఖ్యం. మనము తినే ఆహారంలో ఇవి మన శరీరానికి కావలసిన మోతాదులో అందకపోతే రోగగ్రస్తులు అవటానికి కారణం అవ్వచ్చు. దీనికి కారణం ఈ 6 న్యూట్రియంట్స్ కొన్ని అనారోగ్య (ఆల్జైమర్స్, డయ బెటీస్, కేన్సర్  లాంటి) పరిస్థుతుల నుండి మనలను రక్షించ కలవని పరిశోధనలలో కనుగొన్నారు.
1. Potassium
మనలని stroke నుండి రక్షణ కల్పిస్తుంది.  దాదాపు అన్ని తాజా పళ్ళు, శాఖా హారాల్లో 300mg - 400mg దాకా ఉంటుంది.
మనకి రోజుకి ఎంత కావాలి: 4,700 mg daily.
వేటిల్లో ఉంటుంది: Swiss chard, Lima beans, sweet potatoes, bananas and cantaloupe.

2. Vitamin E
ఒకవిధంగా చూస్తే దీనిని బ్రెయిన్ ఫుడ్ అనవచ్చు. ఆల్జైమర్స్ బారి నుండి రక్షించగలదు. ఇది సామాన్యంగా కొవ్వు(fat) ఎక్కువున్న పదార్ధాలలో ఉంటుంది. అందుకని కొవ్వు తగ్గించి తింటున్న వాళ్లకి ఇది తక్కువగా ఉండ వచ్చు.
మనకి రోజుకి ఎంత కావాలి:  15mg daily.
వేటిల్లో ఉంటుంది: Sunflower seeds, almond butter and hazelnuts.

3. Choline
లివర్ చేసే పనిలో (detoxification ) ముఖ్య పాత్ర వహిస్తుంది. Breast cancer రిస్క్ తగ్గిస్తుందని కూడా పరిశోధనలలో తేలింది.
మనకి రోజుకి ఎంత కావాలి: 425mg daily.
వేటిల్లో ఉంటుంది: Eggs (particularly the yolks), salmon and Brussels sprouts.

4. Vitamin B12
మన శరీరంలో Central nervous system సరీగ్గా పనిచెయ్యటానికి తోడ్పడుతుంది. అందుకనే ఇది తక్కువుంటే numbness, weakness and anemia కలగ వచ్చు. ఇది చాలా వరకు మాంసాహారం లలో ఉంటుంది. అందుకని శాఖాహారులలో ఇది తక్కువ ఉండటానికి ఆస్కారం ఉంది.
మనకి రోజుకి ఎంత కావాలి: 2.4mcg daily.
వేటిల్లో ఉంటుంది: Yogurt, shrimp, chicken, fortified breakfast cereals and nondairy milks.

5. Magnesium
ఇది మన శరీరంలో జరిగే దాదాపు 300 పైన రసాయనిక  చర్యలలో ముఖ్య పాత్ర వహిస్తుంది ముఖ్యంగా మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మనలో చాలా మందికి ఇది తక్కువగా ఉండవచ్చుఅని పరిశోధనలలో తేలింది.
మనకి రోజుకి ఎంత కావాలి: 320mg daily.
వేటిల్లో ఉంటుంది: Spinach, cashews, avocado, brown rice and black beans.

6. Vitamin D
ఇది calcium తో కలిసి పనిచేసి మన ఎముకలు గట్టిగా ఉండేటట్లు చూస్తుంది. సూర్యరస్మి ద్వారా మన శరీరంలో ఇది తయారు అవుతుంది.
మనకి రోజుకి ఎంత కావాలి: 600 IU daily.
వేటిల్లో ఉంటుంది: Salmon, eggs, fortified milk, fortified yogurt and fortified orange juice.

*******ఇది కూడా చదవండి
************మనకు కావాల్సిన ముఖ్యమయిన విటమిన్స్, సప్లిమెన్ట్స్

దీని మాతృక:
1. Parade article by Marygrace Taylor Sunday, May 10, 2015



Thursday, March 19, 2015

110 ఓ బుల్లి కథ 98-- ఇటలీ లో ఓ వారం - మళ్ళా రోమ్

వెనిస్ నుండి రోమ్ వెళ్ళటానికి మేము ఎక్కిన ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. సీట్లో కూర్చుని ఉంటే పక్కనున్న పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ లో ఇళ్ళూ, పొలాలూ, పచ్చిక బయళ్ళూ, ఊళ్లూ, సినీమా లో లాగా పక్కనించి మెల్లగా జారి పోతూ ఉంటాయి. టాప్ స్పీడ్ 250 km. ట్రైన్ ఎంత స్పీడ్ లో పోతోందో ఎదురుకుండా కనపడుతుంది. మధ్యలో కొన్ని స్టేషన్ల లో ఆగటం వల్ల, ఎప్పుడో కొంత సేపు తప్ప 250 km స్పీడ్ రాలేదు.

సరీగ్గా మధ్యాహ్న సమయానికి రోమ్ చేరుకున్నాము. టాక్సీ కోసం క్యూ లో నుంచున్నాము. మా ముందర నుంచున్న అమ్మాయి చాలా exite అయిపోయి మాట్లాడుతోంది. 30 ఏళ్ళ క్రిందట ఆస్ట్రేలియా వెళ్ళి ఇప్పుడు మళ్ళా ఇటలీ వచ్చిందిట. ఏదో ఏదో మాట్ల్లడేస్తోంది. నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఇండియా వచ్చినప్పుడు అల్లాగే ఫీల్ అయ్యాను. మాతృ భూమి కదా! ఇంతలో మా టాక్సీ వచ్చింది అపార్ట్మెంట్ కి బయల్దేరాము.

అపార్ట్మెంట్ అమ్మాయి మాకోసం wait చేస్తోంది. వాళ్ళు మొదట అపార్ట్మెంట్ అంతా ఏవి ఎక్కడో చూపెట్టి, తాళాలు ఇచ్చి వెళ్తారు. ఇక్కడ బిల్దింగ్లన్నీ చాలా పాతవి. కొత్తగా రిమోడాల్ చేశారల్లె ఉంది, అపార్ట్మెంట్ చాలా కొత్తగా ఉంది. హై సీలింగ్స్, దానికి తగ్గట్లు పెద్ద పెద్ద ద్వారాలు, పెద్ద పెద్ద గ్లాస్ విండోస్. కొంచెం మేము జాగర్తగా చూసుకోవలసింది "కరెంట్" వాడకం అని చెప్పింది. "ఇటలీ" లో "కరెంట్ " ఉత్పత్తి చెయ్యరుట. వాళ్ళు కొనుక్కుంటారుట. అందుకని ప్రభుత్వం ఒక్కొక్క అపార్ట్మెంట్ కి ఇంతే వాడుకోవాలని చెబుతుందిట. పొరపాటున అంతకన్నా ఎక్కువ వాడితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంతా చీకటి. అప్పుడు ఏమి చెయ్యాలో కూడా చెప్పింది. ఇక్కడ పిక్ పాకెట్లు ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగర్తగా ఉండండి అని కూడా చెప్పింది. ఆ అమ్మాయి పక్క పల్లెటూరు లో ఉంటుందిట ప్రాబ్లం వస్తే పిలవచ్చు గానీ తను రావాలంటే రెండు గంటలు పడుతుందని చెప్పి వెళ్ళిపోయింది.

మేమందరం కాసేపు విశ్రమించిన తరువాత బయటికి వెళ్లాలని అనుకున్నాము. అప్పుడే కొంచెం కునుకు పడుతోంది. "మీది see through బాత్ రూం", "చ !" అని ఇంకో కంఠం. ఏమిటో అర్ధం కాలా. మా బాత్రూం గోడ లో షవర్ వైపు సగం పై భాగం గ్లాస్ తో ఉంది. ప్రస్తుతం చర్చిస్తున్నది దాని గురించి. మొదట అదేదో కొత్త ఫాషన్ అనుకున్నాను, కానీ అసలు సంగతి తెలిసిన తరువాత కొంచం గాబరా పడ్డాను. నిజంగా సంతోష ఆశ్చర్యాలతో గాభరా పడ్డాను. "మోడరన్ బెడ్ రూమ్ లో ఉన్నందుకు ఒక క్షణంలో సంతోషం ఇంకొక క్షణంలో ఇది దేనికి దారి తీస్తుందో అన్న గాభరా. ఎవరన్నా బాత్ రూం ఉపయోగిస్తుంటే ఇంకోళ్ళు గదిలో ఉండకూడదు అని ఒక రూల్ పాస్ చేసి, "సీత్రు" బాత్ రూం ప్రాబ్లం సాల్వ్ చేశాము. నేను ఇంతగా ఆశ్చర్య పోయింది ఒక సారి కాలిఫోర్నియాలో మా ప్రసాద్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది. బాత్ రూం షవర్లో రెండు వేపులా షవర్ హెడ్ లు చూసి ఆశ్చర్యపోయాను. ఇంటాయిన నడిగితే చెప్పినదేమంటే "ఇద్దరూ ఒకసారి షవర్ చేస్తే టైము కలసివస్తుంది" అని. మేము టెస్ట్ చేస్తే, మాకేమీ టైం సేవ్ అయినట్లు కనపడలేదు కాగా పోగా 10 నిమిషాల షవర్ అరగంట తీసుకుంది. అసలు ఉద్దేశం, షవర్ కోసం ఎవరు ముందర వెళ్ళాలి అని మొగుడూ పెళ్ళాం మధ్య  తగువులు రాకుండా ఉండటానికి అనుకుంటాను (విడాకుల రాజ్యంలో జాగర్తగా ఉండాలి మరి).

ఈ తడవ మేమున్న అపార్ట్మెంట్ పెద్ద సందులో ఆరవ అంతస్తులో ఉంది. మీరు అపార్ట్మెంట్ బుక్ చేసుకునే టప్పుడు ఎలివేటర్ ఉందొ లేదో తెలుసుకుని బుక్ చెసుకొండి. లేకపోతే ఈసురోమంటూ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఎదురుకుండా ఉన్న భవంతిలో మ్యూజిక్ స్కూల్ ఉంది. సందులో అడుగడుగుకీ ఒక రెస్టోరెంట్ ఉంది. రెస్టోరెంట్ అంటే ఒక రూం దానిముందర ఒక షామియానా దానికింద ఒక నాలుగు టేబుల్స్, కుర్చీలు.

ఒక కునుకు తీసి లేచి ఊరు చూడటానికి బయల్దేరాము. మొదట వెళ్ళింది "లేవి ఫౌంటెన్". టాక్సీ వాడు చెబుతూనే ఉన్నాడు  "అక్కడ ఏమీలేదు చూడటానికి దాన్ని బాగు చేస్తున్నారు" అని. కానీ వెళ్ళాము. ఫౌంటెన్ బాగు చేస్తున్నారు పనిచేయ్యటల్లేదు. దాని చుట్టూతా నడవటానికి వాక్ వే కట్టారు. మాలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. క్యూ లో నుంచుని  వెళ్తుంటే "ఫౌంటెన్ పని చేయకున్నా మీరు డబ్బులు వెయ్యచ్చు" అనే బోర్డ్ కనపడింది.. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. ఒక కోరిక కోరుకుని వెనక్కి తిరిగి ఫౌంటెన్ లో డబ్బులువేస్తే ఆ కోరిక తీరుతుందని. చాలా ఇంగ్లీష్ సినీమాలలో ఇక్కడ అమ్మాయిలు వెనక్కి తిరిగి డబ్బులు వేసి వాళ్ళు కోరిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు.

సాయం సంధ్య నెమ్మదిగా నడుచుకుంటూ, సోవనీర్స్ అమ్మే బడ్డీ కొట్లు, రెస్టోరెంట్ లు దాటుకుంటూ దగ్గరలో ఉన్న ప్లాజా వేపు వెళ్ళాము. మన ఊళ్ళల్లో రోడ్డు పక్క వేరుశనగ కాయలు పొయ్యిమీద వేయిస్తూ అమ్మినట్లు, ఇక్కడ పొయ్యిమీద వేయిస్తూ చెస్ట్ నట్స్ అమ్ముతున్నారు. నాకెందుకో తినాలని అనిపించింది. కొనుక్కుని తిన్నాము. ఎప్పుడూ అవి తినలేదు కానీ రుచి ఎప్పుడో తిన్నట్లు గా ఉంది. తరవాత ఎవరో చెప్పారు అవి పనస గింజల రుచిట.

ప్లాజా అంటే ఒక పార్క్ లాంటిది కాకపోతే పచ్చిక ఉండదు సిమెంట్ నేల. మధ్యలో ఒక పెద్ద ఫౌంటెన్. ఫౌంటెన్ చుట్టూతా నగ్న శిల్పాలు. నగ్న శిల్పాలు చూడకుండా రోమ్ లో తిరగటం చాలా కష్టం. ఇక్కడ బోలెడంత మంది జనం. చాలా మంది మాలాగా టూరిస్టులు.
 దొంగలున్నారు మీ వస్తువులు జాగర్త అని చాలా చోట్ల వ్రాసి ఉంది. పక్క పోలిస్ వాన్ కూడా ఉంది. మేము జిలాటో ఐ స్క్రీం కొనుక్కుని తింటూ కూర్చున్నాము. ఇంతలోకే కరెంట్ పోయింది. అయిదు నిమిషాల్లో మళ్ళా వచ్చింది కానీ ఏదో గలాటా మొదలయింది. పోలీసులు కూడా వచ్చారు. ఎవ్వరో అమ్మాయిది పర్స్ పోయిందిట.

అక్కడి నుండి నడుచుకుంటూ డిన్నర్ కి ఒక రెస్టోరెంట్ కి వెళ్తూ

 దారిలో ఒక సోవ నీర్ బడ్డీ కొట్టు దగ్గర ఆగాము. కొట్టు మూసెయ్యబోతున్నాడు అందుకని ఇదివరకు 5 యురోలు చెప్పినది ఒకటిన్నర యురోలకే ఇచ్చేశాడు. దాదాపు ఈ సావోనీర్స్ అమ్మే చాలా మంది మన దగ్గర దేశాల నుండి వచ్చిన వాళ్ళే. రెస్టోరెంట్ దగ్గర సీటింగ్ కోసం కొంచెం సేపు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.
ముందరే ఈ రెస్టోరెంట్ బాగుంటుందని మా కోడలు సెలక్ట్ చేసింది. అనుకున్నట్లు మా వాళ్ళు రెస్టోరెంట్ లో పీజ్జా, పాస్తా చాలా బాగున్నాయని లొట్టలేస్తూ తిన్నారు. నేను మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ తో సరిపెట్టుకుకున్నాను. ఇక్కడ అన్ని పిజ్జా లు Thin Crust  Pizzas  అంటే చాలా పల్చగా పెద్ద చపాతీ ల్లాగా ఉంటాయి. మీరు రోమ్ కి వెళ్తే ఇక్కడ తప్పకుండా తినండి. ధరలు తక్కువ, పదార్ధాలు చాలా రుచికరంగా ఉంటాయి. మీరు తాగకుండా ఉంటే, తక్కువ బిల్లుతో బయటికి రావచ్చు. తాగితే బిల్లు మోపెడవుతుంది. అక్కడనుండి టాక్సీ లో ఇంటివేపు మళ్ళాము.

మర్నాడు పొద్దున్న చక్కటి  తియ్యటి సువాసనల తో మెళుకువ వచ్చింది. క్రింద రెస్టోరెంట్ లో  "క్రోసాంట్ లు " బేక్ చేస్తున్నారల్లె ఉంది. కాల కృత్యాలు తీర్చుకుని చూస్తే పిల్లలు ఇంకా లేవలేదు. బయటికి వెళ్ళాలని నిర్ణయించు కున్నాము.

అప్పుడే జనసంచారం మొదలవుతోంది. ఎదురుకుండా ఉన్న "సెయింట్ లూ ఇస్ మ్యూజిక్ స్కూల్" కి విద్యార్ధులు వాళ్ళ వాళ్ళ వాయిద్యాలు తీసుకుని  వస్తున్నారు. కొందరు ఎదురుకుండా నుంచుని సిగరెట్లు కాఫీ తాగుతున్నారు. ట్యూనప్ చేసుకుంటున్నా రల్లె ఉంది, కొన్ని వాయిద్యాల శబ్దాలు వినపడుతున్నాయి. కుడివేపు వెళ్దామా ఎడమవేపు వెళ్దామా అని ఆలోచిస్తున్నాను ఇంతలోకే మా ఆవిడ కుడి వైపు వున్న షాప్ లోకి వెళ్ళింది. వెల్, ఎటువెళ్ళాలో క్షణంలో తేలిపోయింది. ఆ షాప్ చూస్తే Internet Cafe షాప్. ఇంట్లో IPAD, Computer, WIFI ఉన్నాయి ఎదుకు వెళ్లిందో అర్ధం కాలేదు. ఎంతసేపటికీ రాక పోతే నేను కూడా లోపలికి  వెళ్ళాను. ఎదురుకుండా కౌంటర్ మీద ఒక పది చిన్న కత్తెరలు పోసి ఉన్నాయి. ఆవిడ ఏది తీసుకోవాలో ఆలోచిస్తూ ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చిందో అసలు సంగతి గుర్తుకు వచ్చింది. కస్టమ్స్ తో ప్రాబ్లం అనుకుని ఈ తడవ నేను కత్తెర తెచ్చుకోలేదు, మీసాలు పెరిగినాయని రోజూ కంప్లైంట్ చేస్తోంది కానీ ఇంత అర్జెంట్ అని నేను అనుకోలేదు. అయినా Internet Shop లో కత్తెరలు ఎలా ఉంటాయని ఊహించిందో. ఆ షాప్ ఓనర్ కూడా మన భాయే. కాకపోతే పక్క దేశం పాకిస్తాన్ నుండి వచ్చాడు. సరే కత్తెర కొనుక్కుని బయటపడ్డాము.

కుడివేపు నడవటం మొదలెట్టాము. చిన్న చిన్న రెస్టోరెంట్లు చాలా ఉన్నాయి. ఒక చోట మొగుడు పెళ్ళాం కూర్చొని బోర్డ్ మీద ఆరోజు మెన్యు వ్రాస్తున్నారు. ఇక్కడ రెస్టోరెంట్ ముందర ఆరోజు మెన్యు, వాటి ధరలు ఉంటాయి. ఒక షాప్ డిస్ప్లే లో కేక్ లు ఉంటే దానిలోకి వెళ్ళాము. చిన్న కేక్ ఇరవై యురోలు చెప్పారు. ఆర్గానిక్ షాప్ ట. అక్కడ ఒక శాంపిల్ చాకొలేట్ ముక్క తిని కాఫీ తాగి బయటపడ్డాము. వీధి చివరికి వచ్చాము. అక్కడ కూరగాయల షాప్ ఉంటే లోపలి వెళ్లి ఒక పెరుగు డబ్బా, బంగాళ దుంపలు కొనుక్కుని ఇంటికి బయల్దేరాము. ఈ షాప్ ఓనర్ కూడా మన భాయే. కాకపోతే పక్క దేశం బంగ్లాదేష్ నుండి వచ్చాడు. నడుస్తుంటే వెనకాలనుండి "యువర్ డ్రెస్ ఈస్ బ్యూటిఫుల్" అనే మాట వినపడింది. నేను పాంట్ షర్టు వేసుకున్నాను అంత ఆకర్షణీయంగా ఏముందా అనుకుని మాట్లాడకుండా ముందరికి వెళ్తున్నాము. ఇంతలోకే ఒక ఆవిడ పరిగెత్తుకు వచ్చి మా ఆవిడతో "ఓహ్ క్యుట్ డ్రెస్" అంది. మా ఆవిడ సాదా చీర కట్టుకుంది. ఇది రెండో సారి బజారులో ఆవిడకి పొగడ్తలు రావటం. సరే థాంక్యు  చెప్పి గబగబా నడుచుకుంటూ ఇంటికి జేరాము. అప్పటికి ఇంట్లో అందరూ లేచారు. ఇవ్వాళ చాలా హేక్టిక్ షెడ్యుల్. ఫుల్ డే రోమ్ లో తిరగటం.

అందరం రోమ్ లో ఆకర్షణలన్నీ చూడటానికి బస్ టూర్, Big Bus దగ్గరకి జేరుకున్నాము. వీళ్ళు క్రెడిట్ కార్డులు తీసుకోరు (ఫోనులో తీసుకుంటామని చెప్పినా సరే). అందరి దగ్గరా ఉన్న చిల్లర ఉపయోగించి టిక్కెట్లు తీసుకున్నాము. వీళ్ళ బస్సులు రోమ్ చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. చూడటానికి ఒక చోట దిగి, అది చూసిన తరువాత ఇంకో బస్ లో ఎక్కచ్చు.

మా మొదటి స్టాప్ కోలీజియం (colleseam). రోమన్ సామ్రాజ్యంలో వందల ఏళ్ళ క్రిందట రాజులు, ప్రజలకోసం దీనిని కట్టించారు. ఇది ఒక విధంగా కమ్యునిటీ సెంటర్ లాంటిది. దీని శిధిలాలు చూడటానికి జనం తండోప తండాలుగా వస్తారు. ఆనాడు ప్రజలకోసం ఇంత పెద్ద కట్టడం కట్టా రంటే మెచ్చుకో తగిందే . పక్కనున్న ఫొటోలు, కట్టినప్పుడు ఎల్లా ఉండేది, శిధిలాలు గ ఇప్పుడెల్లా ఉన్నాయో చూపుతాయి. అక్కడ ఎప్పుడు  ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో ముందరే చెబుతారుట. అందరూ పిల్లా జేల్లాతో వచ్చి పిక్నిక్ చేసుకుంటారు.



 ఇక్కడ వంటలు చేసుకుని తినటానికి పెద్ద స్థలం. వినోద కార్యక్రమాలు జరపటానికి పెద్ద సభా స్థలం. దాని ముందర కూర్చుని చూసి ఆనందించటానికి తగిన సౌకర్యాలు. ప్రేక్షకులు సభా ప్రాంగణం లోకి రావటానికి వారి వారి హోదాలని బట్టి ముఖ ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల ఆనందంకోసం ప్రొద్దుటనుండీ సాయంత్రం దాకా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఏరోజు ఏమి జరుగుతుందో ముందరే చెప్పే వాళ్ళుట . కొన్ని కొన్ని కార్యక్రమాలు చూడటం సంగతి అలా ఉంచి, అసలు వినటానికి గూడా చాలా కష్టంగా ఉంటాయి. ఇద్దరికి కత్తులిచ్చి కొట్టుకోమని ఎవరు గెలిస్తే వారిని వీరుడు అనటం (మన కోడి పందాలు గుర్తుకు వస్తాయి). ఖైదీలని తీసుకు వచ్చి క్రూర మృగాలతో పోరాడించటం. వగైరా వగైరా. ఇక్కడ ఒక అంతస్తు మొత్తం ఆనాటి నాగరికతని ప్రతిభింబించే ప్రదర్సన శాల ఉంది. ఆనాటి రాజులూ, శిల్పకళ ప్రాముఖ్యాలూ. ఆనాటి
రచయితలూ వారు వ్రాసిన రచనలూ. ఆ ప్రతుల్ని ఒక చోట పెట్టి అందరికీ అందుబాటు లో ఉంచాలనే ఆలోచనా. గ్రంధాలయ మనే దాని ఆవిష్కరణ. మొదటి గ్రంధాలయంలో రచనలని చదవటానికి అందరికీ అందుబాటులో ఎల్లా ఉంచే వాళ్ళు. చాలా అబ్బురమైన సమాచారం. చూడటం అయిపోయిన తరువాత బస్సుకోసం ఆగకుండా దగ్గరలో ఉన్నవి చూడటానికి నడుచుకుంటూ బయల్దేరాము.

మా నెక్స్ట్ స్టాప్ దగ్గర పెద్ద క్యూ ఉంది అందుకని మేము ఆగలేదు. ఇక్కడ నోరు తెరిచిన ఒక శిల్పం ఉంది. ఆ శిల్పం నోట్లో చెయ్యి పెడితే, అబద్దాలు చెప్పే వాళ్ళయితే చేతిని కరుస్తుంది. ఇక్కడ చాలా మంది దంపతులు క్యూ లో నుంచున్నారు. బహుశా ఎవరు అబద్దాలు కోరో నిర్ణయించు కోటాని కేమో .

ఇక్కడ మళ్ళా బస్సు ఎక్కాము. ఊరంతా తిప్పింది. ప్రతి ఊళ్లో లాగా అంతా మామూలే. ధనవంతులు ఉండే చోటు ధనవంతులు తినే చోటూ వగైరా వగైరా.
 నాకు బాగా ఆకర్షించింది ఒక రాజు స్థూపం. దేశాన్ని చిట్ట చివర పరిపాలించిన రాజు. చిన్న చిన్న సామ్రాజ్యాలన్నీ కలిపి ఇటలీ అనే దేశాన్ని ఆవిర్భ వించటానికి కారకుడు. అక్కడ దిగి ఆ పాలెస్ చూశాం. ఇంతటితో టూర్ అయిపొయింది. బస్సు దిగి ఇంటికి బయల్దేరాము.

నా కేందోకో ఇంటికి వెళ్ళేటప్పుడు సబ్వే లో వెళ్లాలని అనిపించింది. ఇక్కడ భూమి క్రింద రెండస్తుల్లో రైళ్ళు వెళ్తాయి. నడుచుకుంటూ స్టేషన్ కి జేరాము. ఆ రోజు ఆదివారం పెట్టెలు తక్కు వేస్తారు. జనం. జేబులు కొట్టే వాళ్ళు ఎక్కువ అని ముందరే చెప్పారు. ట్రైన్ ఎక్కడో ఆగింది. పరిగెత్తుకు వెళ్లి ఎక్కాల్సి వచ్చింది. రెండు స్టేషన్ల తరువాత మా స్టేషన్ వచ్చింది. సెంట్రల్ స్టేషన్ లో ఎలివేటర్స్ ఉన్నాయి కానీ మేము దిగిన స్టేషన్ లో రెండంతస్తులు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చివరికి ట్రైన్లో ఎందుకు వచ్చామా అనిపించింది. మీరు ఇటువంటి కోరికలు పెట్టుకో వోకండి.

రాత్రికి అన్నం, చింతకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడు, పెరుగు. పొద్దున్నే చికాగో వెళ్ళటానికి టాక్సీ తీసుకున్నాము. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వాడితో కొంచెం వాగ్వివాదం అయ్యింది. మేము రెండు నిమిషాలు, క్రిందకి లేటుగా వచ్చాముట అందుకని డబ్బులు ఎక్కువ ఇవ్వాలిట. సరే పెద్దగా గొడవ పెట్టుకోకుండా అడిగినది ఇచ్చి ఏర్పోర్ట్ లోకి వెళ్ళాము. ఇండియాలో రిక్షా వాళ్ళతో గొడవ గుర్తుకు వచ్చింది. ప్రపంచమంతా ఒకటే. ప్లేన్ ఎక్కి పదిగంటల్లో చికాగో జేరుకున్నాము.

(మీరు Roman Holiday అనే ఇంగ్లీష్ సినిమా చూస్తే, రోమ్ లో మేము చూసినవన్నీ మీరూ చూడవచ్చు.దీనిలో  కధ:  రోమ్ రాజకుమారి పాలస్ నుండి తప్పించుకుని బయటపడి అదృష్టవశాత్తూ ఒక అమెరికన్ రిపోర్టర్ ని కలుస్తుంది. సినిమా అంతా వాళ్ళు ఆ రోజు రోమ్ లో ఎలా సరదాగా తిరిగారో చూపెడుతుంది. అసలు మా ఇటలీ ట్రిప్ కి మూలకారణం మా ఆవిడ్ ఆ సినీమా చూడటం. చూసిన తరువాత రొమ్ ని తప్పకుండా చూడాలనే కోరిక ఆవిడకి కలగటం. మేము ఆవిడని వెంటేసుకు రావటం. ఏమిటో అంతా మాయ.)

మా ఇటలీ ట్రిప్ మీద నేను వ్రాసిన పోస్ట్ లు క్రింద ఇస్తున్నాను. వీలయితే చదవండి.
105 ఓ బుల్లి కథ 93 -- ఇటలీ లో ఓ వారం - పారిస్
106 ఓ బుల్లి కథ 94 -- ఇటలీ లో ఓ వారం - రోమ్
107 ఓ బుల్లి కథ 95 -- ఇటలీ లో ఓ వారం -- పీసా
108 ఓ బుల్లి కథ 96 -- ఇటలీ లో ఓ వారం -- ఫ్లారెన్స్
109 ఓ బుల్లి కథ 97 -- ఇటలీ లో ఓ వారం -- వెనిస్
110 ఓ బుల్లి కథ 98-- ఇటలీ లో ఓ వారం - మళ్ళా రోమ్