Monday, December 26, 2011

78 ఓ బుల్లి కథ 66 --- మనకు కావాల్సిన ముఖ్యమయిన విటమిన్స్, సప్లిమెన్ట్స్

ముందుమాట: మనకి ఏ విటమిన్స్ సప్లిమెన్ట్స్ ముఖ్యంగా కావాలి, మనము ఏ ఆహారం తీసుకుంటే అవి వస్తయ్యో చెప్పటానికే ఈ పోస్ట్.

ఈ క్రింది సమాచారం Nissa Simon గారు AARP Bulletin  (Oct 2010) కి వ్రాసిన వ్యాసం నుండి సేకరించినది. వారు వ్రాసిన దానికి మూలం USDA Human Nutrition Research Center on Aging at Tufts University Boston (USA).


1. Vitamin B6
ఏ ఆహారాల్లో ఉంటుంది:  బీన్స్, నట్సు, కోడి గుడ్లు, ముడి పదార్దములు (whole Grains).


2. Vitamin B12
ఏ ఆహారాల్లో ఉంటుంది:  Fish, Shell fish, meat, dairy products.


3. Vitamin C
ఏ ఆహారాల్లో ఉంటుంది:  Citrus Fruits, Tomatoes, Kiwi, Strawberries


4. Vitamin D
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D ( D 3) ముఖ్యంగా కావాలి. 

ఏ ఆహారాల్లో ఉంటుంది:  Fatty Fish. రోజుకి 15 నిమిషములు ఎండలో ఉన్నా వస్తుంది.


5. Vitamin E  
దీనిని రోజుకు 2000 IU తీసుకుంటూ ఉంటే "Alzheimer's" ఉదృత 19% వరకు తగ్గించ వచ్చని  పరిశోధకులు తేల్చారు.
ఏ ఆహారాల్లో ఉంటుంది:  Vegetable oils, nuts, vegetables.


6. Folic acid
ఏ ఆహారాల్లో ఉంటుంది:  dark leafy vegetables,  ముడి పదార్దములు (whole Grains) తో చేసిన రొట్టెలు.


7. Vitamin K    
ఏ ఆహారాల్లో ఉంటుంది: Plant oils, green Vegetables, Cabbage, Cauliflower.

8. Calcium       
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D ( D 3) ముఖ్యంగా కావాలి. 

ఏ ఆహారాల్లో ఉంటుంది: Dairy products, green leafy vegetables, bok choy.

9. Magnesium   
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D ( D 3) ముఖ్యంగా కావాలి. 

ఏ ఆహారాల్లో ఉంటుంది: Whole grains, nuts, green vegetables.

10. Omega-3 fatty acids
ఏ ఆహారాల్లో ఉంటుంది: Fatty fish such as salmon, tuna, herring and sardines; walnuts, flax seed, tofu and canola oil.

11. Potassium 
ఏ ఆహారాల్లో ఉంటుంది: Cantaloupe, bananas, yogurt, sweet potatoes and leafy green vegetables.

12. Selenium   
ఏ ఆహారాల్లో ఉంటుంది: Red meat, fish, chicken, vegetables.

పైన సమాచారాన్ని క్రోడీకరిస్తే:
మన ఆరోగ్యానికీ, రోగ నివారణ శక్తీ పెంపొందటానికి క్రింద వాటిని తరచుగా తినటం మంచిది. :
ముడి ధాన్యాలు, వృక్షముల నుండి (Plant based) కూరగాయలు, నూనెలు వాడటం చాలా మంచిది .

1. రోజుకి పదిహేను నిమిషాలు ఎండలో పనిచేయటం (నడవటం కూడా పనే).
2. వాడవలసిన ధాన్యాలు: హోల్ గ్రైన్స్, ముడి ధాన్యాలు (దంపుడు బియ్యము, రాగులు, సజ్జలు మొద..)
3. తినవలసిన కూరలు: బీన్సు, కాబేజీ, కాలీఫ్లవరు, చిలకడ దుంప, టొమాటోలు.
4.  తినవలసిన ఆకు కూరలు: తోటకూర, బచ్చలి కూరా, కొతిమెర, గోంగూర.
5.  తినవలసిన పళ్ళు:  అరటి, కరబూజ, కీవీ, స్ట్రా  బెర్రీస్, మామిడి, నారింజ, నిమ్మ.
6. తిన వలసిన నట్స్: ఫ్లాక్స్  సీడ్, వాల్ నట్సు, బాదం పప్పు (Almonds ). 
7. తాగవలసినవి: పాలు, పెరుగు, మజ్జిగ, టోఫు.
8. వాడవలసిన నూనెలు: కనోల ఆయిల్, ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్.

చివరి మాట: మనము రోజూ తీసుకునే శాఖాహారంలో vegetables, green leafy vegetables, whole grains, dairy products, vegetable oils, nuts, citrus fruits వుండటం చాలా మంచిది.


మీకు వీటిగురించి ఇంకా తెలుసుకోవాలంటే గూగుల్ చెయ్యండి లేక క్రింద రిపోర్ట్ చదవండి :
Essential Vitamins and Nutrients

1. Vitamin E and Alzheimer's

Monday, December 19, 2011

77 ఓ బుల్లి కథ 65 --- మళ్ళా న్యూఇయర్ వస్తోంది


"What we have done for ourselves alone dies with us; what we have done for 
others and the world remains and is immortal." ~ Albert Pike

ముందు మాట: మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.

ఇక్కడ అమెరికా లో మామూలుగా ప్రతీ సంవత్సరం ఈ సమయములో జరిగేది; వచ్చిన డొనేషన్ రిక్వెస్ట్ లను ముందర వేసుకుని కూర్చుని చెక్స్ వ్రాయటం. నేను చాలా లేటు, కానీ ఆపని ఈవేళ పూర్తి చేశాను. ఎంతో తృప్తిగా ఉంది.

మనం సంఘ జీవులం. కొట్టుకున్నా తిట్టుకున్నా మనము మన సంఘాన్ని వదలలేము. దీనికి కారణం వంటరి బ్రతుకు దుర్భరం అని మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చుట్టూతా మన కిష్టమయిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో సుఖంగా ఉందామని చూస్తాం. ఈ ఇష్టా ఇష్టాలు కాల క్రమేణా మారుతూ ఉంటాయి కాబట్టి మన చుట్టూతా ఉన్న వాళ్ళని కూడా మారుస్తూ ఉంటాము. ఇది రోజూ మనము అనుకోకుండా చేసే ప్రక్రియే. కానీ మనకు ఇష్టమయినా లేకున్నా మన అసలు ప్రకృతి మారదు. మనం ఒంటరిగా ఉండలేము వాళ్ళ తో తప్ప.

మనం అందరి జీవితాలనీ తీర్చి దిద్దలేము. సుఖవంతమూ చెయ్యలేము. కానీ ఏతా వాతా సహాయం చెయ్యాలనే చూస్తాం. ఎందుకంటే ఎవరయినా బాధ పడుతుంటే మనం చూడలేము. సంవత్సరానికి ఒక రోజు మనం, కూర్చుకున్న ఆ "మనం" లో మనకన్నా బాధపడుతున్న వాళ్ళని మన వాళ్ళుగా జేర్చుకుందాం. మన ఆనందాన్ని పంచుకుందాం. హైతీ లో భూకంపాలయినా, జపాన్లో  సునామీ లయినా  అవి వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న బాధలు కావు. అటువంటి దురదృష్టాలు ప్రపంచం లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం సంఘజీవులం. మనం మనం సహాయం చేసుకోవాలి. అందుకనే కనీసం సంవత్సరానికి ఒకరోజు మనం కూర్చుకున్న ఆ "మనం" లో వీళ్ళని చేర్చుకుందాం. మీకు డొనేషన్ రిక్వెస్ట్ లు వస్తే తోచినంత వెంటనే పంపండి.

స్టాంపులు అతికిచ్చి డొనేషన్ కవర్లు అన్నీ పోస్ట్ చేశాను. ఈ సంవత్సరానికి స్టాంప్ లన్నీ అయిపోయాయి. కొత్త బుక్ కొనుక్కోవాలి.

చివరిమాట: క్రిస్మస్ కి ఇంకా నాలుగు రోజులుంది. మనమిచ్చే  ఈ చిన్న సహాయాలతో  వచ్చే సంవత్సరాంతం వరకూ వాళ్ళు ఎవర్నో ఎప్పుడో ఎక్కడో ఈ ప్రపంచంలో ఆదుకుంటారు. మన చుట్టూతా లేని మన వాళ్ళందరికీ మనం సహాయం చేయకలుగుతాము. అది ఎనలేని త్రుప్తి.

Monday, December 12, 2011

76 ఓ బుల్లి కథ 64 --- బ్రెయిన్ - జీవాత్మలో పరమాత్మ

ముందుమాట: పరిణామ క్రమం (Evolution) గురించి చదివిన తరువాత నాకు రెండు ప్రశ్నలు మనస్సుని కెలుకుతున్నాయి. వీటి గురించి వ్రాయక పోతే ముందుకి సాగలేక పోతున్నాను. వాటిని ఇక్కడ వ్రాశాను. ఇక చదవండి. నా సందేహాలు తీర్చండి.


1. మిలియన్ల సంవత్సరాలు పట్టినా, ఓపికగా ఏక కణ జీవి నుండి కణ రూపంతరములు చెంది కొత్త కణములు సృష్టించుకొని, మానవుడి సృష్టి జరిగింది. మానవుని సృష్టించే పనిలో మధ్య మధ్య  ఎన్నో అవతారాలు (చెట్లు, జలచరాలు, జంతువులూ,పక్షులు) సృష్టించ బడ్డాయి.  శాస్త్రజ్ఞులకు తెలిసినంత వరకూ ఇది ఒక ఎడతెగకుండా ముందుకు పోయే పరిణామ క్రమం. రాబోయే కాలంలో ఇంకా ఎన్ని అవతారాలు సృష్టిలోకి వస్తాయో మనము ఊహించలేము.

కణాలకి జీవించ గల శక్తి ఉంది. ఆ జీవ శక్తికి ఒక మొదలు ఉంది ఒక చివర ఉంది. ఆ మధ్య కాలంలో దాని జాతిని పెంపొందించుకునే జీవ శక్తి ఉంది (duplication).  దీనినే జీవాత్మ అంటామా?. ఆ జీవాత్మను మనము సృష్టించ గలమా? కణాలకి ఆ జీవశక్తి ఇచ్చిన దెవరు? దానిని ఇచ్చిన వారిని పరమాత్మ అంటామా?. ఈ రెండు శక్తులనీ సృష్టించటం నాకు తెలిసినంత వరకూ మన చేతులో లేదు . ఈ  అపురూప శక్తి కారకుడిని మనము దేముడు అంటామా?

2. ఈ అనంతమయిన సృష్టిలో ఏ ఒక్కటి ఇంకొక దానితో పోలి ఉండదు. కారణం వాటిల్లో జన్యువు (DNA) ఒక్కటిగా ఉండదు. ( DNA టెస్టింగ్ చేసే కారణము ఇదే. కొద్దో గొప్పో మనలో కలిసి ఉండేది అమ్మ నాన్నల DNA .)

మానవుల తత్వాలని నిర్ధారించేది DNA  అయినప్పుడు, మన అందరిలో  DNA  ఒకటి కానప్పుడు, ఏపని కలిసి చేసినా మన అందరిలో సమానత్వం ఎక్కడనుండి వస్తుంది? మనలో సామరస్యం ఎక్కడ ఉంటుంది?

చివరిమాట: అసమత్వాల మనుషులతో సమానత్వాలని చూసికుని జీవించా లంటే కష్టమే. ఏ అడ్డంకులు లేకుండా ఏదీ ప్రశాంతంగా జరగదు. గుంపు ఎక్కువయిన కొద్దీ గుద్దులాట తధ్యం.

ఈ పోస్ట్ పాత పోస్ట్ కి ఉప భాగము (Continuation) :
75 ఓ బుల్లి కథ 63 --- బ్రెయిన్ - సృష్టిలో న్యురాన్ పుట్టుక

Sunday, October 30, 2011

75 ఓ బుల్లి కథ 63 --- బ్రెయిన్ - సృష్టిలో న్యురాన్ పుట్టుక

ముందుమాట: మనకి ఒక మనస్సు ఉన్నదని తెలిసికోవటం, దాని తర్వాత అది ఎల్లా వచ్చింది అని దానినే ఉపయోగించి పరిశోధించటం అనేది మానవుడికే చెల్లు. మన బ్రెయిన్ పని చెయ్యటానికి మూల కారణం మన శరీరం లోని న్యురోన్ కణాలు. సృష్టిలో న్యురాన్ ఎల్లా వచ్చిందో తెలుసుకోటానికే ఈ పోస్ట్.

ఒక పదార్ధములో జీవత్వము ఉన్నదని తెలిపేది దానిలో చలించే తత్వమున్న అణువు. దానినే మనము కణము (Cell) అంటాము. దానిలో జీవత్వం ఉన్నంత వరకూ , అది జీవించటానికి ఆహారం తీసుకుంటుంది, మలమును విడిచిపెడుతుంది, తనజాతిని పెంపొందించు కుంటుంది (reproduction).  Cell-Wikipedia.

ప్రకృతి పరముగా జీవత్వమున్న ప్రతీ కణమూ తన జీవిత కాలంలో తనలాంటి దాన్ని ఇంకొకటి తయారు చెయ్యటానికి ప్రయత్నిస్తుంది. దీన్ని Mitosis అంటారు. ఈ మైటోసిస్ లో జన్యు పదార్ధముకి కూడా మారు ప్రతి తయారవుతుంది. కానీ ఈ జన్యు పదార్ధ మార్పిడిలో కొద్ది మార్పులు కలగ వచ్చు. దానిని DNA Mutation అంటారు. అందరు మనుషులూ ఒకే విధంగా ఉండకపోవటానికి కారణం ఇదే. ఈ duplication ( reproduction cycle) లో జీవించలేని కణ మార్పులు జరిగితే, ఆ కణములు తమంతట తామే  చంపుకుంటాయి (Apoptosis).

ఏక కణ Microorganisms మూడు నాలుగు బిలియన్ ఏళ్ళ క్రిందట నుండి ఉన్నాయని పదిహేడవ శతాబ్దములో కనుగొన్నారు. కానీ ఇవ్వి ఉండచ్చు అని ఆరవ శతాబ్దము లోనే జైనిజం పవిత్ర గ్రంధాలలో మహావీర్ గారు వ్రాశారు. భారతీయ మేధా శక్తికి ఇది ఒక గొప్ప గర్వ కారణం. Amoeba, Baker's yeast, Sponges, unicellular organisms కి ఉదాహరణలు.( Microorganism -- Wikipedia).

సృష్టిలో రెండు కణములు ఉన్న జీవులు కూడా ఉన్నాయని పరిశోధనలలో తేలింది. అవి ఒకటి రెండు బిలియన్ ఏళ్ళ క్రిందట నుంచీ ఉండవచ్చు అని నిర్ధారణ చేశారు. ఏక కణ జీవుల reproduction లో జరిగిన తప్పుల మూలంగా ద్వి కణ జీవులుగ వచ్చి ఉండవచ్చు అని కూడా తీర్మానించారు. సామాన్యంగా ఒక కణం నుండి ఇంకొక కణం జన్మించేటప్పుడు తప్పులు జరిగితే, జన్మించిన కణం దానంతట అది చనిపోతుంది. కానీ తప్పులు చిన్నవైనప్పుడు, జీవించగల శక్తి ఉన్నప్పుడు అవి జీవిస్తాయి. ఈ విధంగా బహు కణ జీవులు ఉద్భవించాయని చెపుతారు.   

ఒక జీవిలో రెండు జీవ కణములు ఉంటే జీవించటం కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఒక కణం ఒక వేపు పోదామంటే ఇంకొక కణం ఇంకొక వేపు లాగుతుంటే జీవించటం కష్టం అవుతుంది కదా. ఆ రెండు కణాలు మాట్లాడుకుంటే బాగుండి సామరస్యంగా ఉంటాయి అని ప్రకృతి నిర్ధారించి, రెండిటి మధ్యా మాటలు చేర వెయ్యటానికీ న్యురాన్ ( Nerve cell) అనే కణమును సృష్టించటం జరిగింది. జీవిలో ఉన్నరెండు కణములను న్యురాన్ కు కలుపుటవలన ఒక సూక్ష్మమైన కణ సమాచార మార్గానికి అంకురార్పణ జరిగింది. దీనినే  nerve net అంటారు. ఉదా: simple sea creatures Jelly fish and Corals.

రాను రాను ఈ జీవులలో తప్పొప్పుల కలయిక వలన కణ సాంద్రత పెరిగింది. దానికి తోడు ప్రత్యేక పనులు మాత్రమే చేసే కొన్నికణములు రూపొందినాయి. కణములు ఎక్కువయిన కొద్దీ వాటిమధ్య సమాచార పంపకము క్లిష్ట మవగా ప్రకృతి, nerve నెట్ లో కొన్ని మార్పులు చేసి కొత్తగా nerve cord ని రూపొందించినది. ఇది శరీరము ముందరి భాగములో మొదటి నుండి చివరి దాకా వ్యాపించి మధ్య లోనున్న న్యురాన్ ముడుల సహాయముతో వివిధ కణముల మధ్య సమాచార వ్యాప్తికి దోహదము చెయునదిగా రూపొందెను. ( నామాట: బహుశ జీవుల్లో Spinal Cord లాంటిది ప్రారంభం ఇక్కడేనేమో.) ఈ న్యురాన్ ముడులను nerve ganglion అంటారు. ఉదా: వాన పాములో (earthworm) ప్రతి భాగములోను ఇవి ఉండటము మూలంగా అది పాక గలుగు తున్నది. దానికి తోడు తన తలలో ఉన్న న్యురాన్ ముడి  (cerebral ganglion) మూతికి కలప బడింది. చూశారా సృష్టి విచిత్రం, జీవి బ్రతకటానికి ఆహారం తీసుకునే ఏర్పాటు తయారయింది. ఇప్పటి నుండీ జీవిలో తల ప్రాముఖ్యత పెరిగి, కళ్ళు ముక్కు చెవులు ఏర్పడ్డాయి. అందుకనే సృష్టిలో కుక్క (వాసన ప్రాధాన్యత), గబ్బిలం (శబ్దము ప్రాముఖ్యత) మొదలగునవి జీవించ కలుగు తున్నాము.

కణ విభజన లో (self replicating ) జరిగిన చిన్న చిన్న తప్పులు, ఒప్పులుగా మారి జీవులు uni cellular నుండి multi cellular జీవులుగా సృష్టి లోకి వచ్చి ఉండ వచ్చుఅని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ  multi cellular జీవ కణములు మాట్లాడు కోవాలంటే న్యురాన్స్ కావాలి. జీవిలో ఉన్న కణజాల వృద్ధిని బట్టి న్యురాన్స్ సంఖ్య  కూడా వృద్ది చెందింది. బిలియన్ల సంవత్సరాల నుండీ  జరిగిన మార్పులను మనము ఇప్పుడు uni cellular Amoeba నుండి multi cellular మనిషి దాకా ఉన్న జీవ రాసులలో చూడగలుగు చున్నాము. కాల క్రమంలో కొన్నిజీవులు బతికి బయటకట్టితే కొన్నిజీవులు బతకలేక హరించుకు పోయాయి (ఉదా: Dinosaur, List of extinct Animals, Wikipedia ). ఏ జీవిలో ఎన్నిన్యురాన్సు ఉన్నయ్యో, (List of animals by number of neurons, Wikipedia), నుండి చూడచ్చు.

సృష్టి లో మానవుని దగ్గరకు వచ్చేసరికి వివిధ కణముల సంఖ్య పెరుగుట వలన (ఉదా: ఎర్ర కణములు, తెల్ల కణములు మొదలయినవి) వాటిని సక్రమంగా పని చేయించటానికి ఎక్కువ న్యురాన్స్ అవసరము కలిగింది. మళ్ళా ఆ న్యురాన్స్ అన్నీశరీరములోని కణములతో కలిసికట్టుగా పని చెయ్యటానికి న్యురల్ నెట్వర్క్ ఏర్పరచ వలసి వచ్చింది. ఇవి అన్నీసరీగ్గా కలిసి పని చేయించ టానికి మానవునిలో మెదడు (Brain) నెలకొల్ప వలసి వచ్చింది. ప్రకృతికి ఎంత ఓపిక ఉందో, ఇదంతా నిర్మించటానికి మూడు బిలియన్ సంవత్సరాలు పట్టింది. 

Amoeba నుండి మానవుడి దాకా జరిగిన పరిణామ క్రమము: 
 3 Billion years ago Uni cellular organisms
    1 Billion  Years ago ---- Multi Cellular Organisms started
400 Million Years ago ---- Fish (Simple Brain)
300 Million Years ago ---- Life on land started (Complex Brain)
180 Million Years ago ---- Jurassic, the Dinosaur age
  30 Million Years ago ---- Monkey Line started
    4 Million Years ago ---- Human Line started
    2 Million Years ago ---- Skillful Human Line Started (Using Tools)
    1 Million Years ago ---- Human Line Started moving out of Africa

చివరిమాట: ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మన మనుగడకు ముఖ్యమయినవి, ప్రకృతి పరమయినవి, వాతావరణం (weather), భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు మన కంట్రోలులో లేవు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనము ఒక భాగము మాత్రమే అని మనము గ్రహించ గలగాలి. అంతే కానీ మన చుట్టూతా కనపడేవన్నీ మనవి అనుకుని మన స్వలాభం కోసం నాశనము చెయ్యటం ప్రకృతి పరంగా మంచిది కాదు. 

మాతృకలు :


2. Your Brain by Tabitha M. Powledge, Macmillan Publishing, New York NY 10022


Monday, October 24, 2011

74 ఓ బుల్లి కథ 62 --- అందేనా ఈ చేతుల కందేనా

ముందుమాట: వైయరమణ (Yaramana) గారి పోస్ట్ "కల్లోల చిత్రాలు" చదివిన తరువాత మనస్సు అల్ల కల్లోలమై గూగుల్ లో అటూ ఇటూ పరిగెడుతుంటే ఈ పాట నాకు యుట్యుబు (youtube) లో తారస్యం అయ్యింది. నా బ్లాగ్ లో పోస్టులు వ్రాయకుండా ఈ పాట నాకు నచ్చి రోజూ వింటూ కూర్చుంటున్నాను. ఇంట్లోవాళ్ళకి పాత గ్రామఫోను రికార్డు లా ఈ పాట రోజూ వినటం బాధగా ఉంది. నేను చెప్పాను  "నా చేతుల్లో ఏమీ లేదు, పోస్ట్ రాద్దామని కూర్చున్నప్పుడల్లా ఈ పాటని అనుకోకుండా క్లిక్ చేస్తున్నాను. పాట విన్న తరువాత ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తోంది"  అని. మా ఆవిడ మొదట నాకు బద్దకం పెరిగిపోతోందని అనుకున్నది కానీ అది నిజం కాదు అని తర్వాత తెలుసుకుంది. (రోజూ కూరలూ అవీ సమయానికి తరిగిస్తూనే ఉన్నాను కదా మరి). సమస్యా పరిష్కారం ఆవిడకే అప్పగించాను. చాలా "మెంటల్ మధనం"  తర్వాత ఈ "సావిత్రి ఎఫ్ఫెక్ట్" పోవటానికి ఆవిడ నుండి ఒక విరుగుడు బయటికి వచ్చింది.  సావిత్రి మీద ఒక పోస్ట్ వ్రాసెయ్యండి మీకు పట్టిన జాడ్యం పోతుంది అని ఆవిడ చెప్పింది. ఏవిధంగా పోతుందో నాకు తెలియదు. అప్పటికీ ఇది మహానటి గారి జయంతీ కాదు పుట్టినరోజూ కాదు బాగుండదేమో అని దాట వెయ్యటానికి ప్రయత్నించాను. "అందాలోలికే చందమామలని ఎప్పుడైనా పలకరించవచ్చు" అని వాదించటం మూలంగా పోస్ట్ వెయ్యక తప్పలేదు. అయినా మన దగ్గర సొల్యుషన్ ఏమీ లేనప్పుడు ఇచ్చిన సలహాని పాటించటమే మంచిది. అందులో భార్య సలహా వినకపోతే ఏమి జరగవచ్చునో నాకు 

Yaramana గారు వ్రాసిన "ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి!!"  అనే పోస్ట్  చదవటం మూలాన తెలిసింది.  *సాంబారు.తో. ఒక చెరగని ముద్ర"    వేసి    "మిర్చి బజ్జీలు -తో- ఒక దారుణ హత్యాకాండ" జరుగు తుందే మోనని భయమేసి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. దీనిలో పెట్టిన వీడియో, "పూజాఫలం" లో "సావిత్రి" పాడిన కమ్మని పాట విని ఆనందించండి. 

కల్లోల చిత్రాలు 

సంగీతం విని ఆనందించటం తప్ప నాకు సంగీత జ్ఞానం లేదు. ఏవి పల్లవులో, ఏవి చరణాలో తెలియవు. అందుకు క్షంతవ్యుణ్ణి. 


పాట ఇలా మొదలవుతుంది:

సుందర సురనందనావనా మల్లీ
జాబిల్లీ

అందేనా ఈ చేతుల కందేనా
అందేనా ఈ చేతుల కందేనా

చందమామ ఈ కనులకు విందేనా 
అందేనా ఈ చేతుల కందేనా

*************************************************
ఆ నోట్లోనుంచి ఆ వాక్యాలు వినంగానే నాలో నేను మైమరచిపోతాను.
ఐహిక జ్ఞానం ఉండదు. 
*************************************************

ఆ మడుగున కనిపించీ
నా మనసున నివశించి 

అంతలోనే ఆకాశపు 
అంచుల విహరించే 

చందమామ ఈ కనులకు విందేనా

తలపు దాట నీక  
మనసు తలుపు వేయ గలను గాని 

నింగి పైకి ఆశలనే 
నిచ్చెనేయ గలను గానీ  

కొలనులోన కోకిలనే
అలల పైన ఊగే 

కలువ పేద బ్రతుకులోన 
వలపు తేనె నింపేనా 

చందమామ ఈ కనులకు విందేనా

ఇదిగో వీడియో:








Monday, October 3, 2011

73 ఓ బుల్లి కథ 61 --- మీ కళ్ళ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ముందుమాట: మన శరీరంలో అవయవాలు సరీగ్గా పని చెయ్యాలంటే  వాటికి తగిన పోషక పదార్ధాలు ఇవ్వాలి. అన్నిఅవయవాల లోకీ నయనం ప్రధానం అంటారు. వాటిని జాగర్తగా చూసుకోవటం జీవితంలో చాలా ముఖ్యమయిన విషయం. కళ్ళకి కావాల్సిన పోషక పదార్ధాలు ఇవ్వటానికి మనం తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించే ఈ పోస్ట్.

వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. దానికి తోడు పొగత్రాగుట, స్థూలకాయం కూడా ఉంటే ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ సమస్యలు, macular degeneration (చుట్టూతా కనపడుతుంది కానీ చూపులో మధ్య భాగం కనపడదు), Cataracts (కంట్లో lens మసక బారుతుంది), Glaucoma (కంట్లో నీటి వత్తిడి పెరిగి optic nerve చెడిపోయి చూపు సన్నగిల్లు తుంది.).

ఆహార నియమాలలో ముందుగా కొన్నిజాగ్రత్తలు పాటిస్తే కళ్ళ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు Steven Pratt, M.D, the author of Super Health.  మనం తీసుకునే ఆహారంలో, lutein, omega-3 fatty acids, vitamin C, - Vitamin E, ఉంటే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు వారు.

ఆ పోషక పదార్ధాలు ఉన్న కూర గాయాలు :

1. Spinach. బచ్చలి కూర, దుంప బచ్చలి. Kale, Swiss chard, Turnip, Mustard and Collard Greens.
అసలు పచ్చటి ఆకు కూరలేవయినా మంచివే. వీటిల్లో ఉండే lutein, cell damage ని అరికట్టుతుంది. అందుమూలంగా macular degeneration, cataracts రాకుండా ఆపవచ్చు.

2. Salmon. sardines, herring, mackerel and albacore tuna. 
వీటిని Cold-water fish అంటారు. వీటిల్లో DHA అనే omega-3 fatty acid ఉండటం వలన cell damage లేకుండా చూసి macular degeneration రాకుండా ఆపటం జరుగుతుంది.

3. Walnuts, Pistachios
వీటిల్లో omega-3 fatty acids, anti oxidants, Vitamin E ఉంటాయి. ఇవి వాపు(inflammation) ను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, cardio vascular ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.

4. Berries. Blue berries, Black berries, Straw berries, Mul berries, Cherries and Grapes.
ఇవన్నీ cardiovascular health కి చాలా మంచివి. బ్లడ్ ప్రెజర్, వాపులు (inflammation) తగ్గించటానికి మంచివి.  macular degeneration రావటానికి బ్లడ్ ప్రెజర్ కూడా ఒక కారణం.

5. Orange bell peppers. gogi berries pumpkin, squash, sweet potatoes and carrots.
వీటి ప్రత్యేకత అన్నీఆరెంజ్ రంగులో ఉండటం. వీటిల్లో vitamin-A, vitamin-C, lutein, zeaxanthin ఉండటం మూలంగా Cataracts, macular degeneration, night vision (రేచీకటి) మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండా రక్షణ ఉంటుంది.

6. Broccoli.  Brussels sprouts and Cabbage.
వీటిల్లో broccoli చాలా మంచిది. మన దేహంలో Anti-inflammatory enzymes ని ఉసికొలిపి detoxification (చెడ్డ వాటిని బయటికి పంపటం) కి దోహదం చేస్తుంది. Brussels sprouts, Cabbage ఆ ennzymes ని ఎక్కువ చేస్తాయి.

7. Tea. Green tea, black tea and oolong tea. 
ఇవి Cataracts, macular degeneration, రాకుండా కాపాడుతాయి.

8. Soy. Soy milk, soy sauce, miso and tempeh.
వీటిల్లో powerful antioxidant properties ఉన్న isoflavones, కళ్ళకి వచ్చే dry eye syndrome, cataracts రాకుండా కాపాడుతాయి.

9. Eggs.
వీటిల్లో ఉన్న omega-3 fatty acid DHA, lutein and zeaxanthin కళ్ళకి చాలా మంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తినే ముందు డాక్టర్ ని అడగటం మంచిది.

10. Avocados.
వీటిల్లో ఉన్న lutein, macular degeneration రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగతా పోషక పదార్ధాలు కూడా కంటికి చాలా మంచివి. (beta-carotene, vitamin C, vitamin B6, vitamin E).

చివరిమాట:  మీ కళ్ళ ఆరోగ్యం కోసం పైన చెప్పిన వాటిల్లో మీకు ఇష్టమయిన మీకు దొరికే వాటిని మీ దైనందిన ఆహారంలో వాడండి. రోజూ  leafy green vegetables వాడటం కూడా చాలా మంచిది.

మాతృక:
  
10 super foods to protect Vision
The fight glaucoma, macular degeneration, cataracts
Steven Pratt, M.D.,
Super Health
Penguin Group (USA) Inc.
375 Hudson Street, New York NY 10014 USA

Monday, September 26, 2011

72 ఓ బుల్లి కథ 60 --- పరంధామయ్య పెళ్ళి

                       పరంధామయ్య పెళ్ళి
                                                     రచన: లక్కరాజు శివ రామకృష్ణ రావు

     పరంధామయ్య కోసం అరగంట నుండీ ఎదురు చూస్తున్నాను. పెళ్ళి గురించి చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. సమయం తక్కువ. పెద్దలు ఏ విషయంలో ఆలేస్యం చేసినా పెళ్ళి విషయంలో చెయ్యవద్దంటారు. మా పెళ్ళి ముహూర్తానికి ఖచ్చితంగా మంగళసూత్రం కట్టక పోతే జీవితం ఎల్లా ఉండేదా అని నేను అప్పుడప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మా ఇంటావిడ గ్రహాలూ నా గ్రహాలూ కూడబలుక్కుని సామరస్యంగా ఉండే ముహూర్తం కుదరటానికి నేను నెల రోజులు శలవ పొడిగించి తెల్లవార్జామున నాలుగు గంటలకు లేవ వలసి వచ్చింది. ఇప్పటికీ నాకు ఇంకా అనుమానం వస్తూ ఉంటుంది, మాకు పెళ్ళి  చేయించిన అయ్యవార్ల గడియారం నిమిషమో అరనిమిషమో తప్పని. ఈ తెలివి నా కప్పుడు ఉంటే  పెళ్ళి ముందర ఒక మంచి స్విస్ గడియారం అయ్యవార్లకి బహుమతిగా తెచ్చే వాణ్ణి.

పరంధామయ్య మా ఆవిడని అడిగాడుట "నేను పెళ్ళిచేసుకోటానికి ఇండియా వెళ్తున్నాను ఏ విధంగా పెళ్ళి కూతురిని సెలెక్టు చేసుకోవాలి" అని. మా ఆవిడ  ఊరుకుండ లేక , "మొగవాళ్ళు ఆడవాళ్ళలో ఏమిచూసి పెళ్ళి చేసుకుంటారో నా కెల్లా తెలుస్తుంది, ఆ మహరాజునే అడుగు" అందిట. ఇంకా బాధ్యత నా మీద పడింది. "పరంధామయ్యా ఇది చాలా జాగర్తగా ఆలోచించ వలసిన విషయం. రేపు ఇంట్లో వాళ్ళందరూ టప్పర్వేర్ పార్టీకి వెళ్తారు. తప్పకుండా ఆరు గంటలకి వచ్చావంటే తీరిగ్గా మాట్లాడుకుందాము" అని చెప్పి పంపించాను.

పరంధామయ్య మెల్లిగా తలుపు తీసుకు వచ్చాడు. నేను ముభావంగా కూర్చున్నాను. నాలో అసంతృప్తి మోహంలో  కనపడుతున్నదల్లెవుంది  "క్షమించండి మాస్టారూ కొంచెం ఆలేస్యం అయ్యింది" అని చేతిలో ఉన్న డూనట్ బాక్సు ఎదురుకుండా పెట్టాడు. దానిలో నాలుగు ఫ్రెంచ్ కర్లర్స్ కనపడేసరికి నాకు ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. వెంటనే క్షమించేసాను. కుర్రవాడికి ఎదుటి వాణ్ని ఎల్లా మంచి చేసుకోవాలో తెలుసు. బాగుపడతాడు. మంచి లక్షణం.

"పరంధామయ్యా అసలే ఆలేస్యం అయ్యింది. త్వరగా నేను చెప్పెవేవో చెప్పేస్తాను. నువ్వు మాత్రం నా ధోరణికి అడ్డురాకు. నీకేమన్నా సందేహాలు ఉంటే అంతా అయ్యే దాకా ఆగు" అని వెంటనే మొదలు పెట్టాను.

" ఏ విధంగా చెప్పాలో రాత్రి నుండీ ఆలోచిస్తున్నాను. సూక్ష్మంగా  సింపుల్ గ చెప్తాను. మూడే మూడు సూత్రాలు గుర్తుపెట్టుకో. మొదటిది భోజనం. రెండొవది చదువు. మూడొవది  అందం" అని ఒక ఫ్రెంచ్ కర్లర్ నోట్లో వేసుకున్నాను. వీళ్ళు ఎల్లా చేస్తారో గానీ ఒకసారి రుచి చూస్తే మళ్ళా మళ్ళా తినాలని అనిపిస్తుంది. పాలకొల్లు పూత రేకుల్లా నోట్లో వేసుకుంటే కరిగి పోతాయి.

"నాయనా పరంధామయ్యా జాగర్తగా విను. భోజనం అనేది చాలా ముఖ్యమైనది. భోజనం లేనిది జీవించలేము. జీవితం లేక పోతే భార్యా పిల్లలు, ఇల్లూ వాకిళ్ళూ, అందం చందం, డబ్బూ గిబ్బూ, సెక్సూ గిక్సూ ఇవన్నీ ఉండవు. కావాలంటే రెండు రోజులు పస్తు పడుకొని చూడు జీవితంలో ఏది ముఖ్యమో తెలుస్తుంది. మొగుడూ పెళ్ళాలలో ఎవరో ఒకరికి వంట రావాలి. నీకు ఎల్లాగూ వంట రాదు. నీవు వంట బాగా చేసే అమ్మాయిని చేసుకున్నావంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది నాయనా" అని చెప్పి రెండో ఫ్రెంచ్ కర్లర్ నోట్లో వేసుకున్నాను. దాని తస్సాదియ్యా ఏమి రుచి. ఫ్రెంచ్ వంటకాలు బ్రహ్మాండంగా ఉంటాయని వినటమేగానీ ఫ్రెంచ్ కర్లర్ తినేదాకా ఇంత మహదానందం కలగచేస్తాయని   అనుకోలేదు.

"రెండవది చదువు నాయనా. భార్యా భర్తలు మాట్లాడుకోటం చాలా ముఖ్యం. నువ్వు సైన్సు చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే --- బ్యురెట్ల గురించి పిప్పెట్ల గురించీ మాట్లాడుకోవచ్చు. లేకపోతే పక్కింటావిడ మొన్నీ మధ్య చేయించుకున్న నగల గురించి మాట్లాడవలసి వస్తుంది. అది డేంజర్. ఆ తరువాత మూగ చూపులూ మూగ భాషలూ వస్తాయి. వాటి అర్ధం ఏమిటో తెల్సా !. నీకు ఇష్టం లేకపోతే నువ్వే వంట చేసుకో. నీ బట్టలు నువ్వే ఉతుక్కో. నీ అంట్లు నువ్వే తోముకో అని". 

"ఇంకా నీకు ఇష్టమయితే కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళని చేసుకున్నావంటే ఇంకా మంచిది. కట్నం గిట్నం కోసం బలవంతం చేయ్యబోకు. మనింటికి రాంగానే పనిలో పెట్టచ్చు. అక్షయ పాత్ర లాంటిది నాయనా. నెల నేలా పది రూకలు వస్తూ ఉంటాయి" అంటూ మూడో ఫ్రెంచ్ కర్లర్ నోట్లో వేసుకున్నాను. తస్సాదియ్యా వీటి మాజిక్ ఏమిటో.

"మూడోది అందం నాయనా. అందానికి అర్ధం లేదు. ఏ రంభని చేసుకున్నా చూస్తూ కూర్చునేది మొదటి నాల్గు రోజులే. ఆతర్వాత ఏమిటలా చూస్తూ కూర్చున్నారు? --- ఆ గార్బెజీ బైట పెట్టండి. బట్టలు మాసినట్లున్నాయి ఉతకకూడదూ! ఈ వంట ఎంత సేపటికీ అవటల్లేదు, పార్టీకి టైము అవుతోంది. ఆ బాత్రూం కొంచెం క్లీన్ చెయ్యకూడదూ --- ఇటువంటివన్నీ వింటావు నాయనా. అందుకని ఏదో సింపుల్ గ చూపులకి నచ్చిన అమ్మాయిని చేసుకున్నావంటే జీవితం బాగుపడుతుంది" అంటూ చివరి ఫ్రెంచ్ కర్లర్ తినేశాను.

పరంధామయ్య ఏమీ మాట్లాడే పరిస్థితి లో లేడు. మంచి దీర్ఘాలోచనలో ఉన్నాడు. నా మాటలు పెద్ద నచ్చలేదని మోఖంలోనే కనపడుతోంది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగమన్నాను. 

"మీరు చెప్పినవి బాగానే ఉన్నాయి కానీ బోజనానికి మొదటి ఇంపా ర్టేన్సు ఇవ్వటం అంత బాగా లేదండి. ఈ మైక్రోవేవ్ కాలంలో నీకు వంటవచ్చునా అని ఎల్లా అడిగేదండీ" అన్నాడు.

"నాయనా నేను చెప్పవలసినదేదో చెప్పాను. మైక్రోవేవ్ తిండి నువ్వు తినలేవు. నేను తినలేను. మనకి చింతకాయ ముద్దో, కందిపచ్చడి ముద్దో ముందు పడితే కానీ ముద్ద గొంతు నుంచి దిగదు. నేను ఆఫీస్ మూయగానే ఇంటికి ఎందుకు పరిగెత్తుకు వస్తానంటావు?" అని ఎఫెక్ట్ కోసం ఆగాను. పరంధామయ్య ముఖంలో ఏమీ మార్పు కనపడలేదు. చెప్పేవాళ్ళు అల్లా ఆగినప్పుడు వినేవాళ్ళు చప్పట్లు కొట్టడం ధర్మం. లేదా కనీసం మీరు చెప్పేది నిజం అనాలి. లేదా కనీసం భళిరే అంటూ తల అన్నా ఊపాలి. నాకు కొంచెం బాధగానే ఉంది. నా మాటలు దున్నపోతు మీద వర్షం లాగా అవుతున్నాయి. 

కుర్రవాడి ప్రశ్నకు నేను సరీగ్గా సమాధానం చెప్పినట్లు నాకు అనిపించలేదు. నాకూ బాధ గానే ఉంది. ఎదుటి వారు వంట సరీగ్గా చెయ్యగలరో లేదో వారిని అడగకుండా తెలుసుకోవటం ఎట్లా? అందులో పెళ్లి చూపుల్లో !. దీనికి సరియిన సమాధానం నాకే తోచలేదు. అందుకనే వెంటనే ప్రారంభించాను కర్మ సిద్ధాంతం తోటి. వారానికి ఒకసారి గుడికెళ్ళి ఉపన్యాసాలు వినటం భలే పనిచేసింది. 

"నాయనా మన ప్రయత్నం మనం చెయ్యాలి. చివరికి మన ఖర్మ ఎల్లా ఉంటే అలా అవుతుంది. నీకు ప్రయత్నం చేసినా వంట చేసే భార్య దొరక లేదనుకో. నీవు బాధ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పాట్లక్ సంఘంలో చేర్పిస్తా.  నెలకోసారి తృప్తిగా భోజనం చెయ్యొచ్చు. ఆచార్లు గారింట్లో కొబ్బరి పచ్చడి ఉంది చూసావ్. అదేమిటోనోయ్ ఏవిధంగా చేస్తారోగానీ ఆ రుచి ఎక్కడా రాదు. శాస్త్రి గారింట్లో కందిపచ్చడి! నువ్వు తప్పకుండా తినాలి." అన్నాను.

"మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ" అంటుండగానే కారు శబ్దం వినపడింది. వెంటనే మాటకి అడ్డుపడి " పరంధామయ్యా ! ఆడంగులు వచ్చారల్లె ఉంది ఇంకా ఆపేద్దాము. నేను చెప్పిన ఆ మూడు సూత్రాల గురించీ కొంచెం ఆలోచించు" అని చెప్పి "ఇదుగోనేవ్, పరంధామయ్య నీ కోసం డూనట్లు తెచ్చాడు" అని మాట మార్చేశాను. మొగవాళ్ళు ఏం మాట్లాడు కుంటున్నారో ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ రోజు తరువాత పరంధామయ్యతో తీరిగ్గా మాట్లాడటం పడలేదు. ఇవ్వాళే ఇండియా వెళ్ళిపోతున్నాడు. నేనే స్వయంగా కారులో ఎయిర్పో ర్టుకి తీసుకు వచ్చాను. నా సూత్రాలు ఆచరణలో పెట్టించాలిగా మరి. మనస్సులో ఏదో బాధగా ఉంది. ఏదో చెప్పాలని అనిపిస్తోంది. ఇద్దరం మౌనంగా ఉన్నాము. మూగభావాలు మా ఇద్దరి మనస్సుల్లో ఏవో మెదులుతూనే ఉన్నాయి.

పరంధామయ్య తో గేటు దాకా వచ్చాను. చివరి గూడ్బై చెప్పాను. ఇంకొక క్షణంలో కనుమరుగవుతాడు. ఇంక నేను ఆగలేక పోయాను. "పరంధామయ్యా ఆ మూడు సూత్రాలూ మర్చెపోబోకు" అని పెద్దగా అరిచాను. చుట్టూతా ఉన్న జనం నా కేసి వింతగా చూస్తున్నారు. ఎవ్వరేమనుకుంటే నాకేం కుర్రవాడు జారిపడకుండా నేను చెప్పవలసినది చివరిదాకా చెప్పాను అనుకుంటూ తృప్తిగా ఇంటి దోవ పట్టాను.

(స్వగతం: అప్పుడప్పుడూ నేను వ్రాసిన పాత కధలు చదువుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాను.ఈ నా చిన్న కథ ఆగుస్టు 1992 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు. అచ్చుతప్పులు సవరించి పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా ముసి ముసి నవ్వులు తెప్పిస్తుంది అని అనుకుంటాను.)


Monday, September 19, 2011

71 ఓ బుల్లి కథ 59 --- కేన్సర్ గురించి అవి ఇవి అన్నీ


ముందు మాట:జీవన విధాన మార్పులతో కేన్సర్ను కంట్రోల్ చెయ్యవచ్చును అని పరిశోధనలు తెలుపు తున్నవి. దానికే ఈ పోస్ట్.

1. అమెరికాలో మొదట హృద్రోగము తరువాత మనుషులను బలికొనేది కేన్సరు .
It is estimated that one out of three persons will have cancer in their lifetimes. About one in six persons will die of cancer.

2.  కేన్సర్ ఒక రోజులో రాదు చెడ్డ లక్షణాలు కనపడటానికి సంవత్సరాలు పట్టవచ్చు.
Usually, initiation by itself is not enough to produce cancer. The altered cells go through more changes that may require an additional substance called a promoter. A period of many years usually exists between the initiation of the cancer process and the onset of the symptoms.

3. జీవన విధానము కేన్సర్ కి కారణము అవ్వచ్చు. పొగ త్రాగుట, మధ్యము సేవించుట, కృత్రిమ జీవితము. 
Cigarette smoking is the leading cause of cancer. Cigarette smoke contains more than 3,800 individual chemicals, and more than 40 are carcinogenic (cancer causing).

Portions of the diet, especially fatty foods and alcoholic beverages, also are linked to cancer.

Skin exposure to ultraviolet radiation in sunlight is the primary cause of melanoma, a skin cancer.

Sexual behavior that helps spread sexually transmitted infections is closely linked to cervical cancer in women.

Environmental pollution by chemicals in drinking water, air, food and in the workplace may contribute to cancer. The harmful health effects of chemicals depend on the dose, strength of the chemical compound and the length of exposure. Outside the workplace, very few cases of cancer are believed to be caused by exposure to chemicals in the environment.

4. సమస్య పరిష్కరణకు మార్గము జీవన విధానమును సవరించు కొనుటయే. రోగ నిరోధక శక్తిని (immunity) పెంచుకొనుటవలన శరీరము తనంతట తానే చెడువస్తువులను బయటకి పంపి ఆరోగ్యవంత మగును.
Most cancers may be prevented through the identification and control of external factors. Approximately 30 percent of cancers are linked to cigarette smoking. The remaining 70 percent are likely the result of interaction among various factors.

Cancer development is a complex process, that occurs over a long period of time, and is influenced by many factors. The good news is that if exposure to carcinogens is stopped soon enough, the body can stop or reverse the cancer process.

5. పరిష్కరణకి ప్రస్తుత మార్గములు కేన్సర్ కణములని నాశనము చేసి శరీరము నుండి పంపించి వేయుట.
Chemo therapy, Radiation Therapy, Surgery. And a combination of them.

6. కేన్సర్ రాకుండా ఉండాలంటే: పొగత్రాగుట, పొగాకు సేవించుట మానేయ్యండి. మధ్యము త్రాగుట తగ్గించండి లేక మానేయ్యండి. మొక్కల నుండి వచ్చిన ఆహార పదార్దములు ఎక్కువగా వాడండి. కొవ్వు పదార్ధాలు, ముఖ్యముగా జంతువుల నుండి వచ్చినవి, తినుట తగ్గించండి . మీ ఎత్తుకు తగిన బరువులో ఉండి చకచకా పనులు చేస్తూ ఉండండి.
Scientific evidence shows that lifestyle choices, a healthy diet, good nutrition and physical activity can reduce cancer risk. It is never too late to make these changes, but changing long-term behavior can be difficult. You must be persistent over time to reduce your risk of getting cancer. The American Cancer Society recommends the following –

Avoid using tobacco products, such as cigarettes, snuff and chewing tobacco.
This is especially important for individuals who drink alcoholic beverages. Cancer risk of tobacco and alcohol combined is greater than the sum of their individual effects.

Choose most of the foods you eat from plant sources. Eat five or more servings of fruits and vegetables each day. Eat other foods, such as breads, cereals, grain products, rice, pasta or beans, several times each day. Wash fresh fruits and vegetables before eating.

Limit your intake of high-fat foods, particularly from animal sources. Choose food low in fat and limit consumption of high-fat red meats. Choose baked and broiled meats, seafood and poultry, rather than fried food.

Be physically active and achieve and maintain a healthy weight. Be moderately active for at least 30 minutes on most days of the week. Stay within your healthy weight range. Be aware that many fat-free cakes, cookies, snack foods and other desserts are high in calories.

Limit consumption of alcoholic beverages. Men should have no more than two drinks a day. Women should have no more than one drink a day because they absorb alcohol more readily and are usually smaller in body size.

Avoid or reduce exposure to sunlight, particularly in childhood. Reduce your sun exposure by avoiding sun during the middle of the day, wearing protective hats and clothing, seeking shade while outdoors and applying sunscreen on uncovered skin.

Follow safety rules and regulations at your workplace. If possible, carcinogens should be replaced with safer substitutes. Workers should handle hazardous materials in a ventilated area and be trained to protect themselves. Personal protective clothing and respirators may be required.

7. కొత్త ప్రయోగాలు --  Nano technology ఉపయోగించి కాన్సెర్ సెల్స్ కి మాత్రమే మందులు వెళ్ళేటట్లు చూసి వాటిని హతమార్చటం. Nanomedicine అంటారు.
http://nano.cancer.gov/learn/impact/treatment.asp

8. కొత్త ప్రయోగాలు --  పసుపులో ఉండే కర్కుమిన్ పదార్ధముతో కేన్సర్ సెల్స్ ని హతమార్చటం.
Curcumin is thought to have antioxidant properties, which means it may decrease swelling and inflammation.
Laboratory and animal research suggests that curcumin may slow the spread of cancer and the growth of new tumor blood vessels. It may also cause cancer cells to die. In the lab, curcumin has been studied for use in treating or preventing a number of cancers, including colon, prostate and breast cancers.
http://www.mayoclinic.com/health/curcumin/AN01741

చివరిమాట:  జీవిత నియమాలు పాటిస్తే కేన్సర్ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.


మాతృక:
Cancer and your environment
http://www.idph.state.il.us/cancer/factsheets/cancer.htm



కేన్సర్ మీద నా ఇతర పోస్టులు:
1.69 ఓ బుల్లి కథ 57 ---- కేన్సర్ -- అంటే ఏంటి? ఎందుకొస్తుంది? రాకుండా చూడచ్చా?
 http://mytelugurachana.blogspot.com/2011/09/69-57.html

2. 70 ఓ బుల్లి కథ 58 --- కేన్సర్ -- రిస్క్ తగ్గించే మంచి కూరలు
 http://mytelugurachana.blogspot.com/2011/09/70-58.html


Monday, September 12, 2011

70 ఓ బుల్లి కథ 58 --- కేన్సర్ -- రిస్క్ తగ్గించే మంచి కూరలు


ముందుమాట: మన జీవించే విధానంలో కొద్ది మార్పులు చేసుకుని కేన్సర్ రాకుండా కాపాడుకోగాలమా అనేది తెలిసికోటానికే ఈ పోస్ట్.

సంవత్సరాల బట్టీ చేసిన పరిశోధనల ఫలితంగా తేలిన దేమిటంటే కేన్సర్ బారి నుండి తప్పించు కోవచ్చని. దానికి రెండే రెండు సూత్రాలు అని.

1. మొదటిది క్లుప్తంగా చెప్పాలంటే మనం తినే ఆహారం లో మూడు వంతులు ప్రకృతి పరంగా చెట్ల నుండి (plant based) వచ్చినవి అయి ఉండాలి.

2. రెండవది కృత్రిమంగా తయారు చేసినవి తిన కూడదు, తాగ కూడదు, పీల్చ కూడదు. అంటే దేహము లోకి ఎక్కించ కూడదు. (నా మాట: మన శరీరం ఒక పెద్ద రసాయన శాల. ప్రకృతి పరంగా సృష్టించిన వాటితో రసాయనిక ప్రక్రియలు చేయకలదు కానీ మానవ సృష్టి తో రూపొందిన వాటి నుపయోగించుట శరీరమునకు కష్టము, క్లిష్టము కూడా. )

పై రెండు సూత్రాలనీ విశదీకరించి చూస్తే:

చేయరానివి: పొగత్రాగుట, మధ్యము సేవించుట, స్థూలకాయం (మీ BMI తో గమనించండి), ఫిజికల్ యాక్టివిటీ లేకపోవుట.

తిన కూడనివి: processed meats, salty foods, sugary drinks, huge helpings of red meat .

చేయవలసినవి:  Plant based foods వాడుట. వాటిలో వ్యాధులు రాకుండా సంరక్షించే పదార్దములు ఉన్నాయి.ఈ క్రింద చెప్పిన కూరలకు కేన్సర్ నిరోధక శక్తీ ఉన్నదని పరిశోధనలలో తేలింది.

Broccoli :BERKELEY — An anti-cancer compound found in broccoli and cabbage works by lowering the activity of an enzyme associated with rapidly advancing breast cancer, according to a University of California, Berkeley, study appearing this week in the online early edition of the journal Proceedings of the National Academy of Sciences. That compound is indole-3-carbinol.
Broccoli anti - Cancer .

Cabbage: దీనిలో కేన్సర్ ను రూపుమాపే anticarcinogenic  glucosinolates  ఉన్నవి. sauerkraut, రూపంలో తేంటే ఇంకా మంచిది. Carcinogens ని శరీరంలోనుండి బయటకు పంపించగలిగే indole-3-carbinol (I3C) తయారు చేయగలదు.

సూచన: కనీసం వారానికి మూడు అర కప్పులు వండినది కానీ పచ్చి కాబేజీ  కానీ తినటం మంచిది.

దొరకకపోతే: Any cruciferous vegetable, including brussels sprouts, cauliflower, kale and broccoli. Kimchi, a Korean pickled dish that is similar to sauerkraut, also is a good choice.

Flaxseeds: వీటిలో lignans (a weak form of estrogen)ఉన్నాయి.Breast cancer రాకుండా కాపాడుతాయి. Flaxseeds also contain omega-3 fatty acids, which appear to inhibit colon cancer in both men and women.

సూచన: రోజుకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ ల flax seed powder  వాడండి.

దొరకకపోతే: For more lignans: Eat Walnuts, and cook with canola oil.

Mushrooms: వీటిల్లో బటన్  మష్రూమ్స్ Breast Cancer ని ప్రోద్భలం చేసే aromatase అనే యం జై ము ని నిరోధించే శక్తి ఉన్న పదార్ధాలు ఉన్నాయి. బటన్ మష్రూమ్స్ లో ఉన్న పదార్ధాలు prostate cancer cells ని కూడా హతమార్చ గలవు.

సూచన: అరకప్పు బటన్ మష్రూమ్స్ వారానికి మూడు సార్లు.

దొరకకపోతే: Porcinis or Chanterelles, wild mushrooms with a nuttier taste.

Olives: వీటిలో ఉన్న maslinic acid and oleanolic acid కేన్సర్ సెల్స్ పెరుగుదలను ఆపి వాటి అంతట అవే చంపుకునేటట్లు (apoptosis) చేస్తాయి.

సూచన: రోజుకు ఎనిమిది నల్ల లేక పచ్చ ఆలివులు తినటం మంచిది.

దొరకకపోతే: రోజుకి ఒకటి లేక రెండు టేబుల్ స్పూనుల వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడండి.

Onions(ఉల్లిపాయలు): వీటిలో శక్తి వంతమయిన కాన్సర్ ను హతమార్చే phenolic compounds ఉన్నాయి. వీటిలో ఉన్న Quercetin, liver, colon, and lung cancer  వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

సూచన: వారానికి మూడు సార్లు ఒక అరకప్పు ఉల్లి ముక్కలు తినటం మంచిది. Red or Yellow Onions cooked or raw half a cup three times a week is good.

దొరకకపోతే: Garlic, Apples, Capers, Green and Black Tea have the same Quercetin.

Pumpkin (గుమ్మడి): దీనిలో beta-carotene తో పాటు చాలా Carotenoids ఉండటం మూలంగా ఇది తిన్న వారికి కొన్ని కేన్సర్లు వచ్చే రిస్క్త తగ్గుతుంది. అవి gastric, breast, lung and colorectal cancers. గుమ్మడి గింజలు తింటే prostate cancer వచ్చే రిస్క్ తగ్గు తుందని కనుక్కున్నారు.

సూచన:  వారానికి కనీసం మూడు అర కప్పులు వాడటం మంచిది.

దొరకకపోతే: Carrots, broccoli and all of the winter squashes, including acorn, butternut and spaghetti squash.

Raspberries: బెర్రీస్ అన్నీ, cherry blueberry strawberry, అన్నిటిలోనూ cell damage ని తగ్గించే anti-inflammatory పదార్ధాలు ఉన్నాయి. Raspberries లో ellaginic acid, selinium ఉండటం మూలంగా oral and liver cancer cells పెరగటానికి అవరోధం కలిపిస్తుందని కనుగొన్నారు.

సూచన: ఒకటిన్నర కప్పులు వారానికి రెండు మూడు సార్లు.

దొరకకపోతే: Cherries and Cherry juice, frozen berries and cherries.

చివరిమాట: దీనిమాత్రుక:
7 Foods Proven to Fight Cancer, David Grotto, RD, LDN
http://www.bottomlinesecrets.com/article.html?article_id=45566

Thursday, September 8, 2011

69 ఓ బుల్లి కథ 57 ---- కేన్సర్ -- అంటే ఏంటి? ఎందుకొస్తుంది? రాకుండా చూడచ్చా?

ముందుమాట: కేన్సర్ -- అంటే ఏమిటో తెలుసుకొని, ఎందుకొస్తుందో తెలుసుకొని, ఆ వ్యాధి రాకుండా ఉండటానికి మార్గాలు వెతకటమే ఈ పోస్ట్ లక్ష్యం.

కేన్సర్ అంటే: మన శరీరం సరీగ్గా  పనిచెయ్యాలంటే వాటిలో ఉన్న వివిధ అవయవాలు  సరీగ్గా పని చెయ్యాలి. ఆయా  అవయవాలని సరీగ్గా  పనిచేయించేవి వాటిలో ఉండే కణాలు (Cells). వాటిల్లో కొన్ని కణాలు, చెయ్యవలసిన పని చెయ్యకుండా, అవలక్షణాల మూలంగా అడ్డూ ఐపూ లేకుండా ఇష్టం వచ్చినట్లు తమ సంతతిని పెంచుకుంటూ ఉంటాయి (uncontrolled growth). దానితో కొంతకాలానికి మంచి చేసే కణాల కన్నా చెడు చేసేవి ఎక్కువయ్యి శరీరంలో జరగవలసిన పనులు సక్రమంగా జరగవు. అవయవాలు పనిచెయ్యటం మానేస్తాయి. దీన్నే కేన్సర్ అంటారు.

ఏవిధంగా వస్తుంది?: మన శరీరం అంతా కణాల పుట్ట. వాటి వాటి జీవిత చక్రం ప్రకారం పాత కణాలు చచ్చిపోతూ  కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలు దైనందినమూ మన శరీరమనే రసాయనిక శాలలో జరిగేవే. ఈ పాత వాటి నుండి కొత్తవి జన్మించే ప్రక్రియలో తప్పులు జరగవచ్చు. పుట్టించిన తరువాత జీవించటం ముఖ్యం కాబట్టి, ప్రకృతి, ఆ తప్పులున్న కణాలు వాటంతట అవే చంపుకునేటట్లు చేసింది.  దానిని అపోప్తోసిస్ (Apoptosis) అంటారు. కానీ కొన్ని చెడ్డ కణాలు అన్నిలక్షణాలూ సరీగ్గానే ఉన్నట్టు కనపడి, ప్రకృతి పరిశీలనలో చిక్కకుండా తప్పించుకుని  బయటపడుతాయి. ఈ అవలక్షణాలతోటే వాటి సంతానం  పెరిగించుకుంటూ పోతాయి (uncontrolled growth). ఇవి సరీగ్గా పనిచెయ్యవు సరికదా మంచి కణాల ఆహారానికి కూడా పోటీకి వస్తాయి. దీనితో శరీరంలో అవి ఉన్న చోట ఆ అవయవానికి అవసరమయిన పని జరగదు. అవయవాలు పనిచెయ్యటం మానేస్తాయి.

ఒక మంచి కణం కేన్సర్ కణంగా ఎందుకు మారుతుంది?: సంత్సరాల బట్టీ పరిశోధనలు చేస్తున్నా గట్టిగా ఏదీ తేలలేదు. కాకపోతే కొంత పరిజ్ఞానం ఏర్పడింది. ఈ పరిశోధనలు కొన్ని దృక్కోణాల్లో జరుపుతున్నారు.

1. జన్మతహా జీన్స్ ద్వారా వస్తుండవచ్చు (Genetics). It is running in the family.

2. cells లో శక్తి కోసం జరిగే రసాయనిక కలయికలలో ఉద్భవించే free radicals మూలాన ఉద్భవించిన సమస్య. ద్రుఢమైన  anti-oxidants కోసం గాలింపు.

2. కణ విభజన జరిగి కొత్త కణములు తయారగు నపుడు కొత్త  రసాయనికల ప్రవేశం మూలాన వచ్చిన చెడు లక్షణం కావచ్చు. అందుకని పరిశోధనలు చేసి కేన్సర్ ఇచ్చే పదార్ధాలను (Carcinogenic Chemicals)  కనుగొనుట.

దీనికి విరుగుడేమిటి?: కేన్సర్ ఇచ్చే చెడ్డ కణాలను రూపు మాపి శరీరం లోనుండి పంపివేయటం. శస్త్ర చికిత్సద్వారా మందుల ద్వారా  ఆపని చేయవచ్చు. ఇది కొంచెం కష్టమైన పని ఎందుకంటే కేన్సర్ కణాలని రూపుమాపే శక్తులు కేన్సర్రావటానికి దోహదం చేస్తయ్యి కూడా. ఉదా: రే డి యే షన్ రెండు పనులూ చేస్తుంది.

1. శరీర వ్యాధి నిరోధక శక్తిని (Immune Response) పెంచటం. తెలిసిన కేన్సర్  ఇచ్చే పదార్ధాలను తినటం మానటం.

2. Free radicals చేసే హానిని తగ్గించటానికి anti-oxidants వాడటం.

వ్యాధి రాకుండా చెయ్యగలమా?: చెయ్యొచ్చు. జీవితంలో ఆహార విహారాదులాలో నియమాలు పాటించాలి.

చేయరానివి:  పొగత్రాగుట, మధ్యము సేవించుట, స్థూలకాయం (మీ BMI తో గమనించండి), ఫిజికల్ యాక్టివిటీ లేకపోవుట.

తిన కూడనివి:  processed meats, salty foods, sugary drinks, huge helpings of red meat .

చేయవలసినవి:    పిండి పదార్ధము  (starch) తక్కువగా ఉన్న పండ్లు కాయ గూరలు ఎక్కువగా తినుట.

A comprehensive review of thousands of studies on diet, physical activity, and weight conducted for the World Cancer Research Fund and the American Institute for Cancer Research pointed to the benefits of eating mostly foods of plant origin. Foods such as broccoli, berries, and garlic showed some of the strongest links to cancer prevention.

మాతృక:
WebMD
http://www.webmd.com/cancer/features/seven-easy-to-find-foods-that-may-help-fight-cancer

Monday, August 29, 2011

68 ఓ బుల్లి కథ 56 ---- ఇష్టమైనవి మితంగా తినటం ఎట్లా?

ముందుమాట: మనలో చాలా మంది "సీ ఫుడ్ ఈటర్స్". ఇక్కడ "సీ" అంటే  "see ". ఎదురుకుండా ఫుడ్ ఉంటే చాలు తినటం మొదలెట్టేస్తాము. అందులో కొంచెము రుచికరంగా నోటికి కనిపిస్తే ఇంక ఆగలేము. అల్లా బొక్కేసిన  తరువాత బాధ పడతాం. అలా ఎందుకు జరుగుతుందో దానిని ఆపటం ఎట్లాగో తెలిపేదే ఈ పోస్ట్.

అమెరికాలో ఇండియానా స్టేట్ యునివర్సిటీ లో జీన్ క్రిస్తేల్లెర్ (Jean Kristeller, PhD)  అనే ప్రొఫెసర్ గారు "బుద్ధిగా తినటం" (Mindfulness-Based Eating Awareness Training (MB-EAT)) అనే కోర్సు ని మొదలు పెట్టారు. దాని సారంశం ఇక్కడ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను.

పరిశోధనలలో తేలింది: మనకు రుచి తెలిసేది మొదటి ముద్దలోనే. తరువాత తినే ముద్దల్లో రుచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాకపోతే మనం ఆ మొదటి ముద్ద రుచి మనసులో మెదులుతుంటే ఆ జ్ఞాపకం తోటే మళ్ళా మళ్ళా లాగిస్తాము. దానితో ఎక్కువ తినటం అవుతుంది. (నా మాట: పదార్ధం రుచి ఎక్కడికీ పోదు. మనం తిన్నకొద్దీ ఆ పదార్ధంలో మన రుచి గ్రహింపు తగ్గుతూ వస్తుంది. ఈ ప్రక్రియ మన శరీరం తనకు తాను రక్షించుకోవటములో ఒక మార్గం అవ్వచ్చు. లేకపోతే అలా పొట్ట పగిలేదాకా తింటూనే ఉంటాము.)

పరిష్కారం: మీ మనస్సు మొదట  అనుభవించిన(గ్రహించిన) రుచినే పట్టుకుని మిమ్మల్ని తినమని నిర్దేశిస్తోంది కాబట్టి మీ మనస్సుని ప్రతీ రెండు ముద్దలకీ రుచి ఎల్లా ఉందో అడుగుతూ ఉండండి. అంటే మీరు మీ మనస్సు లోని " పదార్ధ రుచి" సమాచారాన్ని తాజాగా (update) చేస్తున్నారు అన్నమాట. దీనివల్ల మీకు రుచి తగ్గినట్లు అనిపించటం మూలంగా మీ మనస్సు లో ఇంకా తినాలనే కోరిక తగ్గి పోతుంది.

ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రొఫెసర్ గారు ఇంకొక సలహా కూడా చెప్పారు. మీ మనస్సులో ఒక కొలమానం (Meter ) తయారు చేసుకోండి. మీరు భోజనం మొదలు పెట్టి నప్పుడు 1 తో ప్రారంభించి, మీ మనస్సుకి  మీరు సుష్టుగా తిన్నాను అని అనిపించినప్పుడు ఆ కొలమానం 10 చూపించే  టట్లు చెయ్యండి. అంటే మీరు మీ "Meter " ని calibrate చేస్తున్నారన్నమాట. ఇంక మీరు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు నా కడుపు ఎంత నిండింది అని మీలో మీరు ప్రశ్నించుకొని మీ కొలమానం, 5 లేక 6 దగ్గరకు రాంగానే తినటం ఆపేయ వచ్చు.(సూచన: మీలో మీరు ప్రశ్నించు కొనే ముందర మీరు ఈ విధంగా భోజనం చేసేటప్పుడు మనస్సు తో మాట్లాడతారని ఇంట్లోవాళ్ళకి చెప్పండి.)


చివరిమాట: ఈ పద్ధతి డూయబుల్. మీరు చేయవలసిందల్లా భోజనము చేసేటప్పుడు మీ మనస్సుని అప్పుడప్పుడూ పొట్ట నిండినదో లేక ఎంతవరకు నిండినదో అడగటం. అది చెప్పినట్లు నడుచుకోవటం. లేకపోతే కుమ్మేసిన తరువాత బాధపడాల్సి వస్తుంది. మనకి కడుపు నిండే సంకేతం మనస్సు నుండి కొంచెం ఆలేస్యంగా (Delay తో ) వస్తుంది. అందుకని మనము చేస్తున్నదల్లా "కడుపు ఎంతవరకు నిండింది" అని మనకి తెలిపే సమాచారాన్నిమనస్సు నుండి రియల్ టైములో రాబట్టు కొని దాని ప్రకారం నడవటానికి ప్రయత్నిస్తున్నామన్నమాట.




Monday, August 22, 2011

67 ఓ బుల్లి కథ 55 ---- డయాబెటిస్ - మా ఇంటి వంటలు

ముందు మాట: డయాబెటిస్ ఉన్నప్పుడు, ఆరోగ్యానికి ఏవి మంచివో తెలిసినప్పుడు అవి ఏ విధంగా రోజూ వారీ వాడచ్చో తెలపటానికే ఈ పోస్ట్. ముందు జాగ్రత్తగా ఆ వ్యాధి రాకుండా ఆహార నియమాలు మార్చుకోవటం మంచిది. ఈ పోస్ట్ లో నేను చెప్పే వంటకాలు అన్నీసూచనలు మాత్రమే. 

కిందటి రెండు పోస్టులలో డయాబెటిస్ వ్యాధి కంట్రోల్ లో ఉండటానికి ఏవి అనుకూలిస్తయ్యో తెలుసుకున్నాము. కూరలు అన్నీఇండియన్ మార్కెట్ లో దొరుకుతయ్యో లేదో తెలియదు. నాకు తెలిసిన అక్కడ దొరికే కూరల పేర్లతోటి ఉదాహరణలు ఇస్తున్నాను. మనము రోజూ తీసుకునే ఆహారములో తగిన మార్పులు చేసి వాటిని దైనందిన జీవితంలో వాడితే వ్యాధి తగ్గుదలకు దోహదం చెయ్యవచ్చు. ఇవన్నీ సూచనలు మాత్రమే. 

Break Fast: మీకు తోచిన షుగర్ లేని స్నాక్స్ (ఇడ్లీ, దోస, వడ మొదలయినవి).
కాఫీ తాగే వాళ్ళు పాలూ చక్కెరా కలపకుండా కాఫీ లో కొద్దిగా cinnamon (క్వార్టర్ స్పూన్ కన్నా తక్కువ) కలిపి పుచ్చు కొంటే బాగుంటుంది.

భోజనానికి కూరలు: కాబేజీ, కాలిఫ్లవర్, కీరా దోసకాయ, కాకర కాయ, అరిటికాయ, బెల్ పెప్పర్, మొదలగు వాటితో కూరలు.

భోజనానికి పచ్చళ్ళు: కాబేజీ, మెరపకాయ, టొమాటో, కొతిమెర, కీరా దోసకాయ, ఉల్లిపాయ, జుకినీ బీరకాయ లతో పచ్చళ్ళు.

భోజనానికి పప్పు: టమాటో, కీరా దోసకాయ, కొతిమెర, వాటర్ క్రేస్స్, జుకినీ బీరకాయ, బచ్చల కూర లతో పప్పు. కాబేజీ కూటు.

భోజనానికి పులుసు/సాంబార్: టొమాటో, కాకర కాయ, అరిటికాయ, ఉల్లిపాయ, బెల్ పెప్పర్, జుకినీ బీరకాయ లతో పులుసు.

వంకాయ, బీట్స్, కారేట్స్, కంద, పెండలం, బటాణీలు, బీన్సు ల తోటి చేసిన పదార్ధాలు అప్పుడప్పుడూ తినవచ్చు.

బంగాళా దుంప, గుమ్మడి కాయ, చిలకడ దుంప, మొక్కజొన్న తినటం చాలావరకు తగ్గించటం మంచిది.

పాలు, పాలనుండి వచ్చిన పదార్ధాలు, మజ్జిగ వగైరా షుగర్ ను ఎక్కువ చెయ్యవచ్చును. కారణం పాలల్లో Lactose ఉంటుంది. అదికూడా షుగరే. షుగర్ substitute వాడకం కూడా అంత మంచిదికాదు. అందుకని వీటిని తగ్గించటం మంచిది. అల్లాగే కార్బో హైడ్రేట్సు ఎక్కువగా ఉన్న పదార్దములు కూడా మంచివి కావు. అవి కూడా షుగర్ను పెంచుతాయి. కనుక తగ్గించటం మంచిది

చివరిమాట: నాకు తెలిసిన తెలుగు కూరల పేర్లతో వివిధ పదార్ధాలతో చేసే వంటకాల ఉదాహరణలు ఇచ్చాను. మీమీ అలవాట్లను బట్టి వాడి, మీ ఆరోగ్యం గమనించుతూ ఉండండి.

డయాబెటిస్ మీద నా పోస్టులు:

Tuesday, August 16, 2011

66 ఓ బుల్లి కథ 54 ---- డయాబెటిస్ - ఆరోగ్య మిచ్చే కూరగాయలు

ముందుమాట: కూరగాయలు ప్రకృతికి దగ్గరలో ఉంటాయి కాబట్టి అన్నీఆరోగ్య ప్రదాయినులే కాకపోతే కొన్ని మన శరీర పరిస్థుతులను బట్టి మనకు సరిపడవు. వాటి గురించే ఈ పోస్ట్.

స్థూలకాయం చాలా అనారోగ్య పరిస్థుతులకు కారణం. ఉదా: డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, హృద్రోగం మొదలయినవి. మన శరీరంలో తిన్న ఆహారము నుండి షుగర్ తయారవుతుంది. మనకి జీవించ టానికి కావలసిన శక్తి కొన్ని రసాయనిక మార్పులతో ఈ షుగర్ నుండి వస్తుంది. ఈ శక్తి ప్రదాయిని, షుగర్, మన శరీరం వాడుకునే దానికన్నా ఎక్కువయితే, క్రోవ్వుగా (fat) మార్పు చెంది శరీరంలో దాచబడుతుంది. ఆహారము లభ్యము కానప్పుడు ఈ క్రొవ్వు శక్తిగ మార్చ బడి మనకి ఉపయోగ పడుతుంది. రోజూ మూడుపూట్లా సుష్టుగా భోజనం చేస్తూ ఉండి (కావాల్సిన దానికంటే ఎక్కువగా) ఉంటే రాను రానూ ఈ క్రొవ్వు శరీరంలో పేరుకు పోతుంది. ఇంకా శరీరానికి fat దాచి పెట్టే చోటు కనపడదు. ఈ రసాయనిక equilibrium చెదిరిపోతే అనారోగ్యాలు రావటం మొదలవుతాయి. ఉదా: రక్తంలో ఉపయోగించ బడని షుగర్ ఎక్కువగా ఉండటం డయాబెటిస్ కి కారణం. 

మన ఆచారాల్లో ఉపవాసాలు చెయ్యమనటానికి కారణం ఇదే అనుకుంటాను. మన శరీరంలో పేరుకున్న క్రోవ్వుని తగ్గించి మనం ఆరోగ్యంగా జీవించటానికి.

మనము స్థూలకాయులమో కాదో తెలుసుకోవటం చాలా మంచిది. దీనికి BMI అనే కొలమానం ఉంది. మీ BMI , 25 కన్నా తక్కువ 18 కన్నాఎక్కువా ఉండాలి. అలా లేకపోతే మీ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ BMI తెలుసుకోవటానికి  ఇక్కడ క్లిక్ చెయ్యండి.

రక్తంలో షుగర్ చేరటానికి రెండు కారణాలు. మొదటిది షుగర్, షుగర్ తో చేసిన పదార్ధాలు తినటం. రెండవది  మనము తినిన ఆహారంలో ఉన్న కార్బో హైడ్రేట్స్(Carbohydrates) శరీరంలో రసాయనిక మార్పిడితో ఏర్పడిన షుగర్.

అందుకని తీపిగా ఉన్నపదార్ధాలు, కార్బో హైడ్రేట్స్ ఉన్న పదార్ధాలు తినటం తగ్గించటం (లేక మానెయ్యటం) చేస్తే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.  మనము రోజూ తినే కూరగాయలు కూడా కొన్నినియమాలతో వాడితే షుగర్ కంట్రోల్ చెయ్యవచ్చు.ఈ క్రింద మనము తినే కూరగాయలు తినటంలో గమనించ వలసిన జాగ్రత్తలు ఉదహరిస్తున్నాను.

1. ఈ క్రింది వాటిని తినటం మానేస్తే మంచిది :
Potatoes, Parsnips, Pumpkin, Rutabaga, Sweet Potatoes, Corn (actually a grain)
బంగాళా దుంప, గుమ్మడి కాయ, చిలకడ దుంప, మొక్కజొన్న 

2. ఈ క్రింది వాటిని మితంగా తినటం మంచిది :
Beets, carrots, Green Beans, Eggplant  (వంకాయ ), Jicama, Peas (actually a legume బటాణీ), Squashes, 
New Potatoes, Taro, Yams (కంద, పెండలం) .


3. ఈ క్రింది వాటిని తినటం మంచిది :

Artichoke
Asparagus
Avocado
Beet greens

Bitter Melon
(కాకర కాయ)
Bok Choy
Broccoli
Brussel sprouts
Cabbage (green and red)
Cauliflower
Celery
Chicory
Chinese cabbage
Chives
Collard greens
Cucumber
Dandelion greens
Endive
Escarole
Fennel
Garlic
Kale
Kohlrabi
Lettuce (avoid iceberg)
Mushrooms
Mustard greens
Onions


Parsley
Peppers(all kinds)
Purslane
Plantain
Radish
Seaweed
Spinach
Swiss chard
Tomatillos
Tomatoes
Turnips greens
Turnips
Watercress
Zucchini


చివరిమాట: ఆరోగ్యానికి మితంగా తినటం చాలా మంచిది. అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉండటం కూడా ఇంకా మంచిది

మాతృక: 
Rachelle S. Bradley, N.D.


Tuesday, August 9, 2011

65 ఓ బుల్లి కథ 53 ---- డయాబెటిస్ తో ఆరోగ్య జాగ్రత్తలు

ముందుమాట: అమెరికాలో ప్రతీ ౩౦ సెకనులకు ఒకరికి డయాబెటిస్ వ్యాధి ఉందని నిర్ధారిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవాళ్ళు కొన్ని జాగర్తలు తీసుకుంటే దాని ప్రభావాన్ని తగ్గించ వచ్చు. అందుకే ఈ పోస్ట్.

డయాబెటిస్ వ్యాధి తగ్గటానికి మందులు వేసుకోవచ్చు గానీ అవి రోగాన్నిపోగొట్టవు. కాకపోతే ప్రతీ నేలా బోలెడంత మందులకి పెట్టాలి. University of California Los Angeles ( UCLA) పరిశోధకులు తేల్చినదేమంటే మనము ఆహార నియమాలు కొన్ని పాటించి రోజూ ఎక్సరసైజు చేస్తే Type-2 డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్ చెయ్య వచ్చు. అంతే కాకుండా నియమాలు పాటిస్తే సగం మందికి ఈ వ్యాధిని మూడు వారములలో నిర్మూలించవచ్చు అని కనుగొన్నారు. వారు అనుసరించిన నియమాలు వరుసగా:

1. మీరు తినే వాటిల్లో HCFS (High Fructose Corn Syrup) లేకుండా చూడండి.
ఎందుకని: HCFS,  leptin ని ట్రిగ్గర్ చెయ్యక పోవటం మూలంగా మనము ఎప్పుడు తినటం ఆపాలో మర్చి పోతాము. దానికి తోడు HCFS, fat గ మారటానికి వీలుంటుంది. డయాబెటిస్ వ్యాధికి స్థూల శరీరము ఒక కారణము.
ఏమిచెయ్యాలి: చాలా soft drinks, Baked goods లో HCFS ని తీపి పదార్ధముగా ఉపయోగిస్తారు. Diet Soft Drinks జోలికి కూడా పోవద్దు. ఇవి insulin production ఎక్కువ చేసి మీ బరువును పెంచుతాయి. అందుకని food labels తప్పకుండా చదవండి. 

2. బార్లీ తినండి. ప్రకృతి సహజత్వానికి దగ్గరలో ఉన్న ఆహార పదార్ధాలు తినటం మంచిది. Whole grain cereals and breads, brown rice etc.  ఈ "slow carbohydrates"  లో ఫైబర్ ఉండటం మూలాన అది షుగర్, ఇన్సులిన్ లను  హఠాత్తుగ  పెరగకుండా చూస్తుంది. డయాబెటిస్ వ్యాధికి కారణములు అవియే కదా.

3. Season with Cinnamon: రోజుకి ఒక quarter spoon తింటే చాలు, మీ బ్లడ్ షుగర్ తగ్గుతుంది, insulin sensitivity improves, reduces inflammation in arteries reducing the risk of heart disease. "Diabetes Care "  అనే పరిశోధన పత్రికలో పడ్డ వ్యాసం ఆధారంగా cinnamon తినటం మూలంగా fasting glucose levels 29% తగ్గటం, 29% triglycerides తగ్గటం , 27% LDL cholesterol తగ్గటం జరిగింది.

4. Eat protein at breakfast. Protein at breakfast stabilizes blood sugar and makes people feel satisfied. Lean protein includes eggs, chicken and fish.
  
5. Eat more meat (the good kind). Processed meats మానెయ్యండి.

6. Snack on nuts. రోజుకి ఒక గుప్పెడు almonds, pecans etc. తినండి.  వీటిలో ఉన్న ఫైబర్, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. వీటిలో ఉన్నప్రోటీన్, ఆకలిని ఆపుతుంది. దానికి తోడు వీటిలో పోషక పదార్ధాలు, వ్యాధులను అడ్డుకొనే antioxidants ఉంటాయి. నూనెతో వేయించినవి ( roasted ) మాత్రము మంచివి కావు. 

7. Supplement with vitamin D: ఈ విటమిన్ శరీరంలో బాగా ఉంటే డయాబెటిస్ వ్యాధి రావటం చాలా తక్కువ. రోజుకి కనీసం పది నిమిషాలు అయినా  సూర్య కాంతి లో ఉండాలి. సూర్యకాంతి వీలుకాని దేశంలో ఉంటే, రోజుకి 1,000 నుండీ 2,000 IU(International Units)   D-3 తీసుకోవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగు పరుస్తుంది.

8. Remember to exercise: రోజుకి కనీసం 17 to 30 minutes నడక మంచిది. అదీ సూర్యకాంతి లో అయితే మరీ మంచిది, విటమిన్ D కూడా వస్తుంది.

చివరి మాట: ఈ చిన్న చిట్కాలు అనుసరించి డయాబెటిస్ వ్యాధిని కంట్రోలులో ఉంచి ఆరోగ్యముగా ఉండండి. వ్యాధి లేకపోయినా కొన్ని అలవాట్లు ఇప్పటినుండీ అలవాటు చేసుకుంటే ఆరోగ్యముతో ఉండవచ్చును.

దీని మాత్రుక: 

30-Day Diabetes Cure
You may even be able to throw away your meds!
Stefan Ripich, ND
Special from Bottom Line/Personal
June 15, 2011

30-day Diabetes Cure 
http://www.bottomlinesecrets.com/article.html?article_id=౧౦౦౦౦౩౯౮౭


Thursday, August 4, 2011

64 ఓ బుల్లి కథ 52 ---- జీవితంలో ముందుకి దూసుకి పోదాం అనుకుంటున్నారా

ముందుమాట: మనమందరం జీవితంలో ముందుకి దూసుకు పోదాం అనుకుంటాము. దానికి చదువులు చదువుతాం ప్రయత్నాలు చేస్తాం. కానీ మనలో కొందరికే ఆ వరం సిద్ధిస్తుంది. మనము అనుకోవచ్చు మన కర్మ ఇదే, మన ప్రాప్తి ఇదే, దేముడు ఇల్లా రాసిపెట్టాడు అని. అంతేనంటారా ? కానీ సైకాలజిస్టులు అదికాదు కారణం, మనమీద మనకి పేరుకుపోయిన అపనమ్మకం(Doubt) అంటారు.

మనమీద మనకి ఎందుకు అపనమ్మకం వచ్చింది ?: మీలో ఉన్న బలాలకన్నా (Strengths) బలహీనతల్ని (Weaknesses) ని ఎక్కువగ చూసుకుంటున్నారు. దీనితో వచ్చే చికాకు ఏమిటంటే మీ బలహీనతలు మిమ్మల్ని కంట్రోల్ లోకి తీసుకుని మీరు చేసే పనుల్లో అడ్డు వస్తూ ఉంటాయి.

ఉదా: మీరు ఒక కాన్ఫరెన్సు లో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. మీరు పనిచేస్తున్న సబ్జెక్టు మీదే. కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీలో మీకే గందరగోళంగా ఉంది ఏదో చెడిపోతుందని(mess up), మాట్లాడలేక  పోతామేమో అని.

మీరు మాట్లాడే విషయంలో మీకు నైపుణ్య ముంది. ప్రసంగించటం ఇదే మొదలు కాదు. మీరు అనుకునేది నిజంగా చింతించాల్సిన (Realistic Concern) కాదు. మీ ఉపన్యాసానికి ఒక గంటముందు మీరు వ్రాసుకున్న నోట్సు కనపడకపోతే, అది చింతించాల్సిన విషయం అంతేకానీ మెస్సప్ చేస్తామేమో అని విచారించటం కాదు. అది మీ అపనమ్మకం(doubt).

ముఖ్యమయిన సంగతేమిటంటే, మీకు ఆత్మ విశ్వాసం పెంపొందటానికి మీ అనుమానాలు,  అపనమ్మకమో లేక నిజంగా చింతించాల్సిన విషయమో తేల్చుకోవాలి.మీలో మీకు ఆత్మ విశ్వాసం పెరగాలంటే, "నాకు ఈ పని చెయ్యటానికి తగిన నైపుణ్యం ఉందా?", అని మీలో మీరే ప్రశ్నించుకోండి. ఉంటే మీలో మీకు అపనమ్మకం కలగాల్సిన అవుసరం లేదు. లేక పోతే ఆ నైపుణ్యం తెచ్చుకోటానికి ప్రయత్నించాలి.

దేనిమూలాన మనలో మనకి అపనమ్మకం కలుగుతుంది: 
మొదటిది మనం అనుకుంటాము మన  గొప్పదనాన్ని అందరూ మెచ్చుకోవాలని, తిరుగులేదని. ఎవరన్నా మన పనితనాన్ని ప్రశ్నిస్తే మనకి మనసులో బాధగా ఉంటుంది. వారు అమాయకంగా ఈ ప్రాజెక్ట్ ఎల్లా చేస్తావు అన్నాకూడా. మన నైపుణ్యాన్ని శంకించి నట్లు చూస్తాము. ఇది మొదటి ట్రిగ్గర్ పాయింట్. దీన్నే Competency doubt అంటారు.

రెండవది మనమంటే అందరికీ ఇష్టంగా ఉండాలని అనుకుంటాము. మనము వాళ్ళు మంచి స్నేహితులు అనుకుంటే, వాళ్ళింట్లో పార్టీ పెట్టుకుని మిమ్మల్ని పిలవలేదు. వెంటనే మీకు అనుమానం వస్తుంది. నేనంత desirable కాదేమోనని. ఇది రెండోవ ట్రిగ్గర్ పాయింట్. దీన్నేdesirability doubt  అంటారు. ఇంకొక ఉదాహరణ మీ (భర్త) భార్య కో ఆఫీసు కి ఫోన్ చేస్తారు. ఒకమాట మాట్లాడి మిమ్మల్ని పెట్టేయ మన్నారనుకోండి. మీకు బాధగా ఉంటుంది. నేను తనకి తగనా, నాతో మాట్లాడటం టైం వేస్టా అనే అనుమానం వస్తుంది. ఇదే ఓ రెండు సార్లు జరిగితే ఇంకా బాధేస్తుంది. 

మీరు చెయ్యాల్సిందల్లా ఎందుకని ఆ పరిస్థితి వచ్చిందో నిజం తెలుసుకోవటం. అంతేగానీ మీమీద మీరే అపనమ్మకం సృష్టించు కోవటం కాదు.

మీ అపనమ్మకాన్ని ఎదుర్కోండి: మన  చిన్నప్పుడు మనపెద్ద వాళ్ళో లేదా మనతో తిరిగే క్లాస్ పిల్లలో "you are dumb" అని ఉండవచ్చు. మనలో కొందరం ఎప్పుడో ఒకప్పుడు డంబ్ అనిపిచ్చుకోవలసి రావచ్చు. అలాగే మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా(విడాకులు, ఉద్యోగం పోవటం ఇత్యాది ) ఇల్లానే అనుకుంటూ ఉంటాము. self-doubt మూలాన ప్రయోజనం లేదు. అవన్నీ తాత్కాలికం. జీవితంలో మీ విజయాల్ని గుర్తు తెచ్చు కొండి. బాధలు తాత్కాలికమే నని గ్రహించి మీ మీద మీకే అపనమ్మకము రాకుండా చూసుకోండి.

ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి: మీ success stories, మీకొచ్చిన పొగడ్తలు ఒక పుస్తకంలో వ్రాసుకోండి. మీమీద మీకు అపనమ్మకము కలిగినప్పుడల్లా అవి నెమరువేసు కోండి. అపనమ్మకపు ట్రిగ్గర్ పాయింట్స్ తెలుసుకొని పరిష్కరించటానికి ప్రయత్నించండి. రోజు రోజుకీ మీలో మార్పు వస్తుంది మీ శక్తీ, నైపుణ్యము మీద మీకు నమ్మకము కలుగుతుంది..

తుదిమాట: చూశారా మన బ్రెయిన్ ఎంత మంచిదో. చెప్పే విధంగా చెప్తే వింటుంది.

దీనికి మాతృక:

Secrets to Being More Self-Confident
Leslie Sokol, PhD
Marci G. Fox, PhD

Secrets to Being More Self Confident

Monday, August 1, 2011

63 ఓ బుల్లి కథ 51---- మన శరీరంలోని న్యురల్ నెట్వర్క్స్

ముందుమాట:  మన శరీరంలోని న్యురల్ నెట్వర్క్స్ చేసే పనల్లా సమాచారాన్ని ఒక చోటు నుండి ఇంకొక చోటుకి చేర్చటం. మన మనుగడ అంతా ఈ సమాచార సేకరణ, దానిని సరియిన చోటికి సరయిన సమయంలో పంపిణీ మీదే ఆధారపడి ఉంటుంది. ఏవిధంగా ఆ పని జరుగుతుందే చూచాయగా చూపటమే ఈ పోస్ట్ ఉద్దేశం.

మన శరీరంలో పనిచేసే న్యురల్ నెట్వర్క్స్ పనితనానికి నిదర్శనాలు చూడండి :

1. స్టవ్ మీద చిన్న సెగతో నెయ్యి కాగుతోంది. పొరపాటున చెయ్యి గిన్నెకు తగిలింది. గబుక్కున చెయ్యి తీసేస్తాము.
2. డాక్టర్ ఆఫీసు కి వెళ్ళాము. టెస్టుల్లో మోకాలు మీద రబ్బరు సుత్తి తో కొట్టారు. వెంటనే కాలు జెర్క్ ఇస్తుంది.

 పై రెండు ఉదంతాలలో  జరిగింది ఒకటే. Reflexive response.చర్మము నుండి వచ్చిన sensory signal, spinal cord దగ్గరకు రాగానే దాని తీవ్రతను తెలుసుకొని spinal cord కండరాలకి ఆదేశాలు ఇచ్చి వెంటనే బ్రెయిన్ కి కూడా తెలియపరుస్తుంది. రెండవ దాన్ని knee jerk reaction అంటారు.

3. నిరంతరమూ  (continuous) జరిగే పనులను బ్రెయిన్ ఉపేక్ష చేస్తుంది. ఉదా: మనము సముద్రపు ఒడ్డున నివసిస్తున్నామనుకోండి. మొదటే రెండురోజులూ సముద్రపు హోరు వినిపిస్తుంది. తరువాత అది మామూలే అని బ్రెయిన్ మనకి వినిపించ నివ్వదు.

4. మనం నడుస్తూ ఉంటాము. కాలులో ముల్లు గుచ్చు కుంటుంది. ముల్లు ఇంకా లోపలికి దిగకుండా వెంటనే కాలు ఎత్తుతాము. తరువాత చేత్తో ముల్లు తీసి వేస్తాము. మొదటి రియాక్షన్ spinal cord నుండి వచ్చింది. రెండోవ రియాక్షన్ బ్రెయిన్ నుండి వచ్చింది. ఏళ్ళనాడు అమ్మ చేసిన పని బుర్రలో గుర్తుకొచ్చి ముల్లు తీసేశాము.

5. ఏదో మూవీ చూస్తూ ఉంటాము. ఆ యాక్టర్ ని ఎక్కడో చూసినట్టు ఉంది. నోట్లో మెదులుతోంది కానీ బయటకి రావటల్లేదు. ఆ ఇమేజ్ పట్టుకుని మన బ్రెయిన్ వెతుకుతోంది. ఆహా తెలిసింది.  స్టీవర్ట్  షో లో ఉండేవాడు కదూ.

6. పెళ్ళిలో అమాంతంగా ఎవరో "ఏమండీ సుబ్బారావు గారూ" అని పలకరిస్తారు. మనిషి గుర్తు రావటల్లేదు. మాట తీరు విన్నట్టుగా ఉంది. గుర్తు పట్టలేక పోతున్నాము. ఆహా తెలిసింది "ముకుందరావు కదూ" "ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ". మాట తీరుని, మనిషి  ఇమేజ్ ని కలిపి వెతికి మన బ్రెయిన్, "ముకుందరావు" పేరు పట్టుకుంది.

మన శరీరంలో బ్రెయిన్, spinal cord కలిసి పనిచేసే సమాచార వ్యవస్థని Central Nervous System (CNS) అంటారు. బ్రెయిన్ ఒక ముఖ్య సమాచార కేంద్రం. మన శరీరంలో ఏమూల ఏమి జరుగుతున్నదో,  బ్రెయిన్కి ఎల్లప్పుడూ సమాచారం అందుతూ ఉంటుంది.శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఏపని ఎప్పుడు చేయాలో అప్పుడు సంకేతాలు పంపిస్తుంది. పంచేంద్రియాల నుండీ వచ్చిన, ముఖ్యమని అనిపించిన సమాచారాన్ని దాచటం, కావాల్సి వచ్చినప్పుడు బయటికి తీసుకువచ్చి వాడుకోవటం కూడా దీని పనే. జీవికి అపకారం జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే దాని నుండి తప్పించటం కూడా దీని పనే. అందుకు spinal cord సహాయం తీసుకుంటుంది. అందుకనే వేడి గిన్నె తగలగానే చెయ్యి తీసేసాము. 

CNS లో లేని సమాచార వ్యవస్థని Peripheral Nervous System (PNS)  అంటారు. దీనిలో చాలా భాగాలున్నాయి. 
Enteric Nervous System(ENS) మన జీర్ణ వ్యవస్థని(gastrointestinal system) కంట్రోల్ చేస్తుంది.
Autonomous Nervous System (ANS) మన ప్రమేయము లేకుండా పనిచేసే భాగాల్ని కంట్రోల్ చేస్తుంది(ఉదా: గుండె, కాలేయము మొదలయినవి). అల్లాగే Sympathetic Nervous System : మనకి బయటి నుండి వచ్చే stress లను, భయాలు బాధలను, Parasympathetic Nervous System తో కలసి తగ్గించాలని చూస్తుంది. Parasympathetic Nervous System మనం ఎప్పుడూ  ప్రశాంతంగా హాయిగా ఉండాలని చూస్తుంది. 

CNS, PNS, ANS వీటిని న్యురల్ నెట్వర్క్స్ అంటారు. వీటిలో ఉండేవి న్యురోన్స్, glial cells. ఇవి ఒకదానికి ఒకటి గోలుసుకట్టుగా ఏర్పడి synaptic connections తోటి సమాచారాన్ని ఒకచోటు నుండి ఒకచోటుకు చేరవేస్తాయి. మన కండరాల కదలికలను కంట్రోల్ చేసే న్యురోన్స్ ని Motor Neurons అంటారు. ఇవి తెచ్చే సందేశాల మూలంగా చేతులూ కాళ్ళు వగైరా కదప కలుగుతాము. అల్లాగే Sensory Neurons, sensory receptors నుండి సమాచారం Nervous System కి పంపుతాయి. అందుకనే మన వంటిమీద ఏదన్నా పాకుతుంటే వెంటనే తెలిసిపోతుంది. ఈ రెండూ అవి పనిచేసే వాటి దగ్గరలో ఉంటాయి. (ఉదా: Sensory Neurons & Receptors , స్కిన్ దగ్గర, Motor Neurons, కండరాలు దగ్గర ఉంటాయి)

మళ్ళా Motor neurons రెండు రకాలు. Somatic and Autonomic. Somatic Neurons మన కంట్రోల్ లో ఉండే కండరాల్ని, Autonomic Neurons మన కంట్రోల్ లో లేని కండరాల్ని కంట్రోల్ చేస్తాయి ( హార్ట్ కండరాలు మొదలయిన involuntary శరీర భాగాలు).

Biological Neural Networks లో ఉండేవల్లా రకరకాల న్యురాన్స్. ఇవి చేసే పనల్లా శరీరంలో సమాచారాన్ని ఒకచోటు నుండి ఇంకొక చోటుకు చేరవేసి జీవత్వం కొనసాగేటట్లు చూడటం.

చివరిమాట: ప్రకృతి మనం జీవించాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మనము చెయ్యాల్సిందల్లా దానికి కావాల్సింది ఇవ్వటమే. వయసు పెరిగినకొద్దీ కావలసిన మూలపదార్ధాలలో కొరత ఏర్పడుతుంది. అది గ్రహించి వాటిని ఇవ్వటానికి ప్రయత్నించాలి. అంతేకానీ ఇవ్వకూడనివి ఇవ్వటానికి ప్రయత్నించ కూడదు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ క్రింద రెఫరెన్సు లతో మొదలు పెట్టండి. 

1. Nervous_system  http://en.wikipedia.org/wiki/Nervous_system

2. Cell Basics  http://cellbiology333.blogspot.com/

Sunday, July 24, 2011

62 ఓ బుల్లి కథ 50---- మన బ్రెయిన్ కి శక్తి ప్రదాయిని మన తల్లి

ముందుమాట: మన శరీరంలో శక్తి ఎల్లా ఉత్పత్తి అవుతుందో తెలుసుకోటానికే ఈ పోస్ట్.

మన మొదటి కణం(haploid) లోకి కావలసిన వాటిల్లో సగం జీన్సుతండ్రి నుండీ సగం జీన్సు తల్లి నుండీ వస్తాయి. కానీ కణానికి జీవత్వం ఇచ్చే శక్తి ప్రదాయిని, mitochondria, తల్లి నుండి వస్తుంది. మన శరీరంలో ఏ కణాలకు అయినా జీవత్వం ఇచ్చి పెరుగుదలకు తోడ్పడేది ఈ mitochondria యే. ఈ mitochondria లు ప్రతి కణములో 1000 నుంచీ 2000 దాకా ఉండవచ్చు.

క్లుప్తంగా mitochondria మనము తినే ఆహారము లోనుండి వచ్చిన షుగర్ (Glucose) ని మనము పీల్చే గాలి లోనుంచి వచ్చిన ఆక్సిజన్ తో దహనం చేసి శక్తిని (Adenosine Triphosphate, ATP ద్వారా) విడుదల చేస్తుంది. ఆ శక్తి ద్వారానే మనము నడవటం, మాట్లాడటం, జీవించటం చేస్తున్నాము. ఈ దహన కాండ లో మనకు పనికిరాని కొన్ని పదార్దములు ఏర్పడుతాయి (free radicals). వీటిని వెంటనే హతమార్చక పోతే అవి వెళ్లి ఇంకొక పదార్ధమును చేరి అవి పని చేసే తీరును మార్చ వచ్చును. ప్రకృతి పరంగా వీటిని హతమార్చే పదార్ధాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. కానీ వయస్సు పెరిగిన కొద్దీ వీటి ఉత్పత్తి తగ్గుతుంది. అందుకనే వయస్సు పెరిగిన కొద్దీ Antioxidants, CoQ10, Alpha Lipoic Acid, Acetyl L Carnitine అవసరం అవ్వచ్చు.

మన శరీరంలో అన్ని కణాలు( న్యురాన్స్ తప్ప) పై విధముగా శక్తిని ఉత్పాదన చేస్తాయి. బ్రెయిన్ లో ఉన్న న్యురాన్సు కి మాత్రం శక్తిని ఉత్పత్తి చెయ్యటానికి glucose, oxygen ఎప్పుడూ కావాలి.

ఈ శక్తి ఉత్పాదన ప్రక్రియలో Glucose తనంతట తాను శక్తి నిచ్చే చోటుకి వెళ్ళలేదు. ఆపనిని insulin, glucose transporters(GLUT Glycoproteins ) లని ప్రభావితం చేసి, చేయిస్తుంది. ఇందుకని  insulin మన ఆరోగ్యమునకు చాలా ముఖ్యం. మన శరీరం, మిగిలిపోయిన Glucose ని fat గ మార్చుకుని దాచి పెట్టుకుంటుంది. మనము ఆహారము తిన నప్పుడు fat ను glucose గ మార్చి శక్తి వచ్చేటట్లు చేస్తుంది.

మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలన్నీ ఒక దాని మీద ఒకటి ఆధార పడుతాయి. నిజం చెప్పాలంటే మనము చేసే అన్ని పనులూ, ఆకలిగా ఉండి అన్నము తినాలని అనిపించటం నుంచీ, అన్నీ రసాయనిక చర్యలే. ఇవి సమతౌల్యంగ(Balanced) జరగక పోతే రోగాలు వస్తాయి. ఉదా: శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలలో షుగర్ ను పూర్తిగా వినియోగించ లేక పోతే diabetes వస్తుంది.

ఇంగ్లీషు లో క్లుప్తంగా:
Glucose coming from food we eat gets transported by the influence of  insulin to a site in mitochondria where it gets combined with oxygen coming from the air we breath to produce energy in the form of ATP molecule. In short this is how we live.

Nature has backup plans for everything. Survival is most important in Nature. It converts excess food we eat to fat and stores in fat cells and converts it back into glucose in case of a need (when we starve). When oxygen is not there it has the capability of producing energy (anaerobic respiration).  Exception is the neural cell neuron, which takes only glucose and oxygen for energy production. 

చివరిమాట: నాకు ప్రకృతి పరంగా మనకు జరిగే రెండు విషయాలు ప్రశ్నలుగా  నిలిచి పోయాయి. శక్తి ప్రదాయిని  mitochondria, అమ్మనుంచి వస్తుంది ఎందుకు? మనమందరం మొదట్లో embryo లో ఆడవాళ్ళుగా ఎందుకని ఉంటాము ? (embryo female గ ఉండి, fetus గ మారుతున్నప్పుడు హార్మోనుల వలన కొందరిలో  male గ రూపాంతరం చెందు తుంది. ఇది మన కంట్రోల్ తో చెయ్యగలమా? ).

1. Mitochondria (the Powerhouses of our Cells) and Brain Disease
    http://www.studentpulse.com/articles/195/mitochondria-the-powerhouses-of-our-cells-and-brain-disease

2. The Brain Trust Program ---- by Larry McCleary M.D.
    http://brainbooks303.blogspot.com/2010_03_01_archive.html

3. Embryological Development of the Human Brain by Arnold B. Scheibel, MD







Wednesday, July 13, 2011

61 ఓ బుల్లి కథ 49 ---- మన బ్రెయిన్ పుట్టుక ఈవిధంగా

ముందు మాట: మన జీవితంలో రోజూ ఉపయోగించేది మన బ్రెయిన్. అది తయారయ్యేటప్పుడు మనకి స్పృహ కూడా ఉండి ఉండదు. కానీ మన పిల్లలవి తయారయ్యేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం. బ్రెయిన్ ఎల్లా తయారవుతుంది. ఆ తయారీలో మన బాధ్యత ఏమిటి?  అనేదాన్ని పరిశీలించటానికే ఈ పోస్ట్.

మన శరీరం లో ఏ పనులు ఎప్పుడు ఎలా జరగాలి, అలా జరగటానికి కావాల్సిన మూల పదార్దములు (హార్మోనులు ) చెయ్యటానికి రెసిపీలు (code) ఇచ్చే వాటిని జీన్స్ అంటారు. అవి షుమారు 100,000 ఉంటాయి. వీటిల్లో బ్రెయిన్ తయారవటానికి, పనిచెయ్య టానికి ఉపయోగించుకునేవి 50,000. వాటిల్లో 30,000 జీన్సు బ్రెయిన్ కోసము నిర్దేశించినవే. బ్రెయిన్, జీవికి చాలా ముఖ్యమని సృష్టికి కూడా తెలుసు అందుకనే అన్ని జీన్సు కేటాయించింది.

Conception అయిన తరువాత egg sperm కలయిక మూలంగా వచ్చిన fertilized egg ని Zygote అంటారు. దీనితో  human embryo కి అంకురార్పణ జరుగుతుంది. ఈ కలయిక తో సంభవించిన మొదటి కణముని(cell) diploid అంటారు. దీనిలోకి  కావాల్సిన జీన్స్ సగం నాన్న నుండీ  సగం అమ్మ నుండీ వస్తాయి. కానీ శక్తి తయారు చేసే పరికరాలు(mitochondria) మొదలయినవి మాత్రం అమ్మ cytoplasm నుండి వస్తాయి. అందుకేనేమో  మొదట అన్నిembryo లు అమ్మాయిలుగా ఉండి తరువాత వచ్చిన మగ హార్మోనులని బట్టి అబ్బాయిలుగా మారుతాయి (default is female). ఈ diploid విభజనతో వచ్చే మొదటి రెండు కణాలకి తమంతట తాము వేరువేరుగా వృద్ది అయ్యే గుణం ఉంటుంది కానీ కణ విభజనలు జరుగుతున్న కొద్దీ ఈ శక్తి తగ్గుతుంది. అందుకే కమల పిల్లలు అందరికీ పుట్టరు. మొదటి కణాలు multiply అయ్యి embryo తయారు అవుతుంది. మొదటి 8 వారాలు దానికి కావలసిన అవయవాలు సృష్టించుకొని fetus గ మారి పెద్దదవుతుంది.

మానవుని సృష్టి ఏ విధంగా జరుగుతుంది తెలుసుకోటానికి చాలామంది పరిశోధనలు చేశారు. అన్ని సంగతులు తెలియక పోయినా ముఖ్య విషయాలు గ్రహించారు. embryo పైన ఉండే కణాలు విభజించుకుని చిట్ట చివరకు(ultimate గ) స్కిన్ తయారు చేస్తాయి. వీటిని ectodermal cells అంటారు. అల్లాగే embryo లోపల ఉన్న కణాలు కడుపు, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు మొదలయిన వాటిని తయారు చేస్తాయి. వీటిని endodermal cells అంటారు. దాదాపు embryo పెరగటం మొదలెట్టిన రెండున్నర వారాలకి embryo మధ్యలోకి కొత్త రకం కణాలు, కండరాలు, గుండె మొదలయినవి చెయ్యటానికి వస్తాయి. వీటిని mesoderm cells అంటారు.

దాదాపు మూడు వారాలకి ఈ mesoderm cells ఊరుకోకుండా పైనున్న ectodermal cells ని పురికొల్పి  కొత్త కణాలను తయారు చేయించి (షుమారు 125,00) ఒక flat sheet ను తయారు చేయిస్తాయి. దీనిని neural plate అంటారు. బ్రెయిన్ కు కావలసిన neurons, glial cells ఇక్కడ నుండే తయారు అవుతాయి.

దాదాపు మూడు నాలుగు వారాల మధ్యన ఈ షీట్ లాగా ఉండే  neural plate అంచులు కలుసుకొని ఒక పొడుగాటి గొట్టం లాగా తయారు అవుతుంది. దీనినే neural tube అంటారు. central nervous system అంతా neural tube నుండే తయారు అవుతుంది. ముందు భాగంలో బ్రెయిన్ వస్తుంది. ట్యూబ్ భాగం spinal cord అవుతుంది. neural tube తయ్యారయ్యే టప్పుడు కొన్ని కణాలు మిగిలిపోతాయి. వాటిని neural crest cells అంటారు. ఈ కణముల నుండే peripheral nervous system అంతా తయారు అవుతుంది.

దాదాపు అయిదు ఆరు వారాల మధ్యన neural tube రెండువేపులా మూసుకు పోతుంది. ముందర వేపు మూడు బొడిపెలు(swellings) వస్తాయి. అవే బ్రెయిన్ లో ఉండే మూడు భాగాలు forebrain, midbrain and hindbrain. అవే చిన్న మెదడు, పెద్ద మెదడు అనేవి. ఇంక అవి పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. వీటిలోకి కావలసిన న్యురోన్స్, న్యురోన్ ట్యూబ్ దగ్గరనుండి తయారు అయ్యి జారుకుంటూ మధ్యలో ఉన్న న్యురోన్స్ కి హలో చెప్పుకుంటూ గమ్యం చేరి అక్కడ ఇంకొక న్యురోన్ తో synaptic connection పెట్టుకుంటాయి. ఈ విధంగా connection లేక పోతే అవి బతక లేవు. అల్లాగే కొన్ని న్యురోనులు వెతుకుంటూ వెళ్ళి తప్పుడు త్రోవ బట్టి ఎక్కడికో వెళ్తాయి. అవి కూడా బ్రతకవు. glial సెల్ల్స్ ఈ చనిపోయిన న్యురోన్స్ ని బయటకు తీసివేస్తూ ఉంటాయి. మొత్తం మీద 10th  వీక్ కల్లా embryogenesis పూర్తవుతుంది. దాదాపు అన్ని అవయవాలు ఏర్పడుతాయి. ఇంక వాటిని పెద్దవి చేసి మెరుగుపరచటమే మానవ సృష్టిలో మిగిలింది. ఇలా తొమ్మిదో నెలకల్లా బ్రెయిన్ అన్ని neural synaptic connections తోటి తయారవుతుంది.

మనము పుట్టేటప్పుడు 100 billion న్యురోన్స్ ఉన్నయ్యనుకుంటే, పుట్టటానికి 9 నెలలు పడితే, నిమిషానికి 250,000 తయారు చెయ్యాల్సి వస్తుంది. ఈ పని చెయ్యటానికి  శక్తి ఆ తొమ్మిది నెలలు తినే ఆహారాన్నుండి వస్తుంది. అందుకని పౌషికాహారము చాలా ముఖ్యము. embryo ఆరోగ్య వంతంగా పెరగటానికి folic acid చాలా ముఖ్య మని తేలింది.ఇది కూడా ప్రెగ్నెన్సీ మొదటి  మూడు వారాలలో అవసరము అవుతుంది. అందుకని ప్రెగ్నెన్సీ కోసం చూసే వాళ్ళు B Complex tablets తీసుకొనుట మంచిది. వీటిలో folic acid ఉంటుంది. త్రాగుడూ, సిగరెట్లు మానెయ్యటం చాలా మంచిది. మనస్సుని మంచి ఆలోచనలతోటి సంతోషంగా ఉంచుకోవటం కూడా చాలా మంచిది.
ప్రెగ్నెన్సీ లో మొదటి మూడు నెలలు బ్రెయిన్ తయారయ్యేటప్పుడు చాలా క్రిటికల్ అని తెలుసుకున్నాము కదా అందుకని ఈ క్రింద చూపిన జాగార్తలలో ఉండటం చాలా మంచిది.
During this critical period (most of the first trimester), the developing embryo is also susceptible to toxic exposures, such as:

Alcohol, certain drugs, and other toxins that cause birth defects, such as Fetal alcohol syndrome
Infection (such as rubella or cytomegalovirus)
Radiation from x-rays or radiation therapy
Nutritional deficiencies such as lack of folate which contributes to Spina bifida


చివరి మాట: బ్రెయిన్ తయారు అవటం అనేది చాలా సున్నిత మైన పని. ఆ తయారయిన బ్రెయిన్ ను మన పిల్లలు వారి జీవితాంతము ఉపయోగించుకుంటారు. వాళ్ళ నడవడికలు దీని మీదే ఆధారపడేది. అందుకని మనకు తెలిసిన జాగర్తలు తీసికొనుట మంచిది. ఈ వ్యాసములోని సంగతులు చాలా పుస్తకాల్లో నుండి గ్రహించినవి. నేను ఇచ్చిన ఇంగ్లీషు పదములు వాడి గూగులమ్మని అడిగితే ఆ విషయాలన్నీ చెబుతుంది. ఈ క్రింది రెఫెరెన్సు చాలా బాగుంటుంది.

1. Embryological Development of the Human Brain by Arnold B. Scheibel, MD



2. వీలయితే నా ఇంకొక బ్లాగ్ కూడా చూడండి.
http://brainbooks303.blogspot.com/